Saturday, December 17, 2011

ఇద్దరూ... ఇద్దరే ( వీరేంద్ర సెహ్వగ్‌, జహీర్‌ఖాన్‌ )

ఈనెల 26న భారత, ఆస్ట్రేలియా మధ్య ప్రారంభమవుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో వీరేంద్ర సెహ్వగ్‌, జహీర్‌ఖాన్‌ ఎంతో విలువైన పాత్రను పోషిస్తారని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ ఇయాన్‌ చాపెల్‌ అభిప్రాయం వ్యక్తం చేశారు. ‘ భారీ స్కోరు చేయటానికి సెహ్వాగ్‌ ఉన్నాడు. ఐదువికెట్లు తీయటానికి జహీర్‌ సిద్ధం. ఇద్దరు తురుపుముక్కలు భారత జట్టులో ఉన్నారు.’ అని చాపెల్‌ తెలిపాడు. అయితే ఆసీస్‌ బౌలర్‌ పాటిన్‌సన్‌ సీరీస్‌ను ప్రభావితం చేయగలడని చాపెల్‌ అన్నాడు. ఇటీవల పాటిన్‌సన్‌ బౌలింగ్‌ గణాంకాలు చూస్తుంటే రాబోయే టెస్టు సీరీస్‌లోనూ అతను రాణిస్తాడని ఇయాన్‌ చెప్పాడు. స్వదేశీ పిచ్‌లు ఆస్ట్రేలియాకు అనుకూలంగానే ఉన్నా, జట్టు గాయలతో ఉండటం మూలంగా భారత్‌ దీన్ని సద్వినియోగం చేసుకోవచ్చన్నారు. ఇటీవల కాలంలో ఆస్ట్రేలియా బ్యాటింగ్‌ పరమచెత్తగా కూడా ఊహించుకోలేకపోతున్నామని చాపెల్‌ ఘాటుగా విమర్శించాడు. బౌలింగ్‌ను మెచ్చుకున్న ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌, ఆసీస్‌ బ్యాటింగ్‌పై తీవ్రంగా విమర్శించాడు. అసలు ఫామ్‌లోనే లేని రికీ భవితవ్యాన్ని ఈ సీరీస్‌యే నిర్ణయిస్తుందని ఇయాన్‌ అన్నాడు.

ధోనికి సిఎన్‌ఎన్‌ - ఐబిఎన్‌ అవార్డు

ఈ సంవత్సరం క్రికెట్‌ ప్రపంచ కప్‌ గెలుచుకున్నప్పుడు భారత జట్టు సారథి మహేంద్ర సింగ్‌ ధోని ఎంతగా భావోద్వేగానికి గుర య్యాడంటే ఫైనల్‌ మ్యాచ్‌ తరువాత జట్టు సహచరులతో పాటు అతను కూ డా ఏడ్చే శాడు. ‘ఫైనల్‌ మ్యాచ్‌ అనంతరం క్రీడాకారులందరూ ఏడ్చేశారు. నేనూ ఏడ్చాను. అయితే, ఆ ఫుటేజ్‌ ఎక్కడా లేదు. ప్రపంచ కప్‌ గెలుచుకోవాలన్నది మా అందరి కల అయినందున భావోద్వేగాలను అణచు కోవడం చాలా కష్టమైంది’ అని ధోని చెప్పా డు. శుక్రవారం రాత్రి ధోనికి ‘సిఎన్‌ఎన్‌-ఐబిఎన్‌ స్పోర్స్‌పర్సన్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డు ప్రకటించారు.

ఈ నెలలో ప్రారంభం కానున్న టెస్ట్‌ సీరీస్‌ కోసం ఆస్ట్రేలియాకు బయలుదేరి వెళ్లే ముందు రికార్డు చేసిన వీడియో సందేశంలో ధోని ఈ విషయం తెలియజేశాడు. ‘నేను ఏడ్చేశాను. నేను తలెత్తి చూస్తే తక్కిన క్రీడాకారులు నా చుట్టూ చేరారు. నేను డ్రెస్సింగ్‌ రూమ్‌కు పరుగెత్తాను. అని ధోని తెలిపాడు.ఈ అవార్డుకు ఇతర నామి నీలలో క్రికెటర్‌ రాహుల్‌ ద్రావిడ్‌, ఆర్చర్‌ దీపికా కుమారి, షూటర్‌ రంజన్‌ సోధి, బాక్సర్‌ వికాస్‌ కృష్ణన్‌, బ్యాడ్మింటన్‌ జోడి జ్వాలా గుత్తా, అశ్వినీ పొన్నప్ప ఉన్నారు. సోధికి, క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌కు ప్ర త్యేక ఘనత అవార్డులు ప్రదానం చేశారు.