Tuesday, December 28, 2010

రెండో ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా 111/3

లక్ష్యణ్‌ సెంచరీ మిస్‌ 96
భారత్‌ రెండో ఇన్నింగ్స్‌ 228 అలౌట్‌
దక్షిణాఫ్రికా లక్ష్యం 303

 
 దక్షిణాఫ్రికా ముందు భారత్‌ 303 పరుగుల లక్ష్మాన్ని ఉంచింది. ప్రస్తుతం ముడో రోజు ఆట ముగిసే సమాయానికి దక్షిణాఫ్రికా 111/3 చేసింది. డివిల్లర్స్‌ 17, కల్లిస్‌ 12 క్రీజులో ఉన్నారు. దక్షిణాఫ్రికా విజయం సాధిచాలంటే ఇంకా 192 పరుగుల చేయాలి. ఏడు వికెట్లు చేతిలో ఉన్నాయి. అంతకముందు ఆట ప్రారంభించిన భారత్‌ 228 పరుగుల చేసి అలౌట్‌ అయ్యింది. లక్ష్మణ్‌ 96 పరుగుల చేసి చివరి బ్యాట్స్‌మైన్‌ అవుట్‌ ఆయ్యాడు. దక్షిణాఫ్రికా 303 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగింది. స్మిత్‌ 37, ఆమ్లా 16, ఫిటరసన్స్‌ 26 పరుగులు చేసి అవుట్‌ అయ్యారు. ఇంకా దక్షిణాఫ్రికా 192 పరుగులు చేయ్యాలి. క్రీజులో డివిల్లర్స్‌, కల్లిస్‌ ఇద్దరు బ్యాట్‌మైన్‌ ఉన్నారు. ఏ ఒక్కరు క్రీజులో ఉన్న విజయం దక్షిణాఫ్రికాదే. భారత్‌ బౌలింగ్‌లో శ్రీశాంత్‌ రెండు వికెట్లు హర్భజన్‌ సింగ్‌ ఒక్క వికెటు లభించింది. నాల్గవ రోజు ఆట బౌలర్లదా, లేక బ్యాట్‌మైన్‌దా ?

జనవరి 12న 'మిరపకాయ్'

 రవితేజ, రిచా గంగోపాధ్యాయ, దీక్ష హీరోయిన్లుగా నటిస్తోన్న 'మిరపకాయ్' జనవరి 12న రానుంది. ఈ విషయాన్ని నిర్మాత రమేష్‌ పుప్పాల తెలియజేశారు. ఎల్లో ఫ్లవర్స్‌ బ్యానర్‌పై హరీష్‌శంకర్‌.ఎస్‌ దర్శకత్వం వహిస్తున్నారు. నిర్మాత మాట్లాడుతూ...'ఆద్యంతం వినోదాత్మకంగా సాగుతుంది. థమన్‌ సంగీత సారథ్యంలో రూపొందిన ఆడియో హిట్‌ అయింది. కిక్‌ తర్వాత రవితేజ కాంబినేషన్‌లో వస్తున్న పాటలవి. మా బ్యానర్‌లో ఎంతో రిచ్‌గా తీశాం. సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకులముందుకు వస్తోంది' అని తెలిపారు. దర్శకుడు మాట్లాడుతూ...'రవితేజ బాడీ లాంగ్వేజ్‌కు సరిపడే స్టోరీ. సీనియర్‌ నటీనటులు పాత్రలకు న్యాయం చేశారు. సంగీతం చిత్రానికి హైలైట్‌గా నిలుస్తుంది' అని చెప్పారు.