Thursday, December 30, 2010

పరమవీర చక్ర ఆడియో విడుదల

బాలకృష్ణ హీరోగా నటించిన 'పరమవీరచక్ర' ఆడియో విడుదల అభిమానుల కోలాహలంమధ్య శిల్పకళావేదికలో బుధవారం రాత్రి జరిగింది. తెలుగు, తమిళ రంగానికి చెందిన ప్రముఖులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో విధి నిర్వహణలో వికలాంగులైన మాజీ సైనికులకు బాలకృష్ణ చేతులమీదుగా ఆర్థిక సాయం జరిగింది. మరోవైపు దాసరి 150 సినిమాలు పూర్తిచేసుకున్న సందర్భంగా కె. బాలచందర్‌ దాసరిని సత్కరించారు.

యాభైరోజులు పూర్తయిన 'ఏమైంది ఈవేళ'

 వరుణ్‌సందేశ్‌, నిషా అగర్వాల్‌ హీరోహీరోయిన్లుగా సంపత్‌నంది దర్శకత్వంలో రూపొందిన 'ఏమైంది ఈ వేళ' చిత్రం 32 కేంద్రాల్లో 50రోజులు పూర్తిచేసుకుందని చిత్ర నిర్మాత రాధామోహన్‌ తెలియజేశారు. ఈ చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలియజేశారు. క్లాస్‌, మాస్‌, యూత్‌, ఫ్యామిలీ అన్న తేడా లేకుండా అందర్నీ మా చిత్రం ఆకట్టుకుంటున్నందుకు ఆనందంగా ఉందని చిత్ర సమర్పకులు అరిమిల్లి రామకృష్ణ చెప్పారు. దర్శకుడు మాట్లాడుతూ... నేను చేసిన తొలి సినిమానే సక్సెస్‌కావడం ఆనందంగా ఉందంటూ.. ప్రేక్షకులకు నూతన సంవత్సరశుభాకాంక్షలు తెలియజేశారు. ఈ చిత్రానికి సంగీతం: చక్రి, కెమెరా: బుజ్జి.

Tuesday, December 28, 2010

రెండో ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా 111/3

లక్ష్యణ్‌ సెంచరీ మిస్‌ 96
భారత్‌ రెండో ఇన్నింగ్స్‌ 228 అలౌట్‌
దక్షిణాఫ్రికా లక్ష్యం 303

 
 దక్షిణాఫ్రికా ముందు భారత్‌ 303 పరుగుల లక్ష్మాన్ని ఉంచింది. ప్రస్తుతం ముడో రోజు ఆట ముగిసే సమాయానికి దక్షిణాఫ్రికా 111/3 చేసింది. డివిల్లర్స్‌ 17, కల్లిస్‌ 12 క్రీజులో ఉన్నారు. దక్షిణాఫ్రికా విజయం సాధిచాలంటే ఇంకా 192 పరుగుల చేయాలి. ఏడు వికెట్లు చేతిలో ఉన్నాయి. అంతకముందు ఆట ప్రారంభించిన భారత్‌ 228 పరుగుల చేసి అలౌట్‌ అయ్యింది. లక్ష్మణ్‌ 96 పరుగుల చేసి చివరి బ్యాట్స్‌మైన్‌ అవుట్‌ ఆయ్యాడు. దక్షిణాఫ్రికా 303 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగింది. స్మిత్‌ 37, ఆమ్లా 16, ఫిటరసన్స్‌ 26 పరుగులు చేసి అవుట్‌ అయ్యారు. ఇంకా దక్షిణాఫ్రికా 192 పరుగులు చేయ్యాలి. క్రీజులో డివిల్లర్స్‌, కల్లిస్‌ ఇద్దరు బ్యాట్‌మైన్‌ ఉన్నారు. ఏ ఒక్కరు క్రీజులో ఉన్న విజయం దక్షిణాఫ్రికాదే. భారత్‌ బౌలింగ్‌లో శ్రీశాంత్‌ రెండు వికెట్లు హర్భజన్‌ సింగ్‌ ఒక్క వికెటు లభించింది. నాల్గవ రోజు ఆట బౌలర్లదా, లేక బ్యాట్‌మైన్‌దా ?

జనవరి 12న 'మిరపకాయ్'

 రవితేజ, రిచా గంగోపాధ్యాయ, దీక్ష హీరోయిన్లుగా నటిస్తోన్న 'మిరపకాయ్' జనవరి 12న రానుంది. ఈ విషయాన్ని నిర్మాత రమేష్‌ పుప్పాల తెలియజేశారు. ఎల్లో ఫ్లవర్స్‌ బ్యానర్‌పై హరీష్‌శంకర్‌.ఎస్‌ దర్శకత్వం వహిస్తున్నారు. నిర్మాత మాట్లాడుతూ...'ఆద్యంతం వినోదాత్మకంగా సాగుతుంది. థమన్‌ సంగీత సారథ్యంలో రూపొందిన ఆడియో హిట్‌ అయింది. కిక్‌ తర్వాత రవితేజ కాంబినేషన్‌లో వస్తున్న పాటలవి. మా బ్యానర్‌లో ఎంతో రిచ్‌గా తీశాం. సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకులముందుకు వస్తోంది' అని తెలిపారు. దర్శకుడు మాట్లాడుతూ...'రవితేజ బాడీ లాంగ్వేజ్‌కు సరిపడే స్టోరీ. సీనియర్‌ నటీనటులు పాత్రలకు న్యాయం చేశారు. సంగీతం చిత్రానికి హైలైట్‌గా నిలుస్తుంది' అని చెప్పారు.

Monday, December 27, 2010

భారత్‌ 92/4

<b>ప్రస్తుత ఆధిక్యం 166 పరుగులు </b>
  భారత్‌ దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్ట్‌ రెండో ఇన్నింగ్స్‌లో ఆట ముగిసే సమయానికి భారత్‌ నాలుగు వికెట్ల నష్టానికి 92 పరుగులు చేసింది. సెహ్వాగ్‌ 32, మురళీవిజరు 9, ద్రావిడ్‌ 2, సచిన్‌ 6 పరుగులు చేసి అవుట్‌ అయ్యారు. లక్ష్మణ్‌ 23, పుజారా 10 పరుగులతో క్రీజులో ఉన్నారు. భారత్‌ 166 పరుగుల ఆధిక్యంతో ఉంది. స్టెయిన్‌, మార్కెల్‌ చెరో వికెట్‌ తీసుకోగా, సొత్సెబె రెండు వికెట్లు తీసుకున్నాడు. అంతక ముందు రెండో రోజు ఆట ప్రారంభించిన భారత్‌ 205 పరుగులకు అలౌట్‌ అయ్యాది. 

దక్షిణాఫ్రికా 131 అలౌట్‌
దక్షిణాఫ్రికా 131 పరుగులకే అవుట్‌ అయ్యింది. దక్షిణాఫ్రికా బ్యాట్‌మెన్స్‌లో ఏఒకరు రాణించలేకపోయారు. పీటర్సన్‌ 24, స్మిత్‌ 9, ఆమ్లా 33, కల్లిస్‌ 10, డివిల్లీర్‌ 0, ప్రిన్స్‌ 13, బౌచర్‌ 16, స్టెయిన్‌ 1, హరిస్‌ 0, మోర్కెల్‌ 10, సొత్సెబె 0 పరుగులు చేశారు. ఆమ్లా 33 పరుగులు చేసి టాప్‌ స్కోర్‌గా నిలిచాడు. భారత్‌ బౌలింగ్‌లో హర్భజన్‌ సింగ్‌ 4, జహీర్‌ ఖాన్‌ 3, శ్రీశాంత్‌, శర్మ చెరో వికెటు తీసుకున్నారు. మొదటి ఇన్నింగ్స్‌లో 74 పరుగుల అదిక్యత సాధించింది. రెండో రోజు వికెట్లు పతనం మొదలైయింది. ఒక్కే రోజు రెండు జట్ల మధ్య 18 వికెట్లు పడ్డాయి. లక్ష్మణ్‌ 23, పుజారా 10 పరుగులతో ఆడుతున్నారు. భారత్‌ కనీసం 300- 350 పరుగులు చేస్తే విజయ అవకాశాలు ఉంటాయి.

Sunday, December 26, 2010

మళ్లీ అదే కథ : భారత్‌ 183/6

 డర్బన్‌ : భారత్‌, దక్షిణాఫ్రికాల మధ్య జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లలో టాస్‌ గెలిచిన దక్షిణాఫ్రికా బౌలింగ్‌ ఎంచుకున్నది. తొలి రోజు భారత్‌ 183/6 పరుగులు చేసింది. హర్భజన్‌ సింగ్‌ 15, దోనీ 20 పరుగులుతో క్రీజులో ఉన్నారు. టాస్‌ ఓడి బ్యాటింగ్‌ దిగిన ధోనీ సేన ఆరు వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. భారత్‌ బ్యాటింగ్‌ తక్కువ స్కోరుకే పెవిలియన్‌ చేరుకున్నారు. గంభీర్‌ స్థానంలో వచ్చిన మురళీ విజరుతో సెహ్వాగ్‌ బ్యాటింగ్‌ ప్రారంభించారు. సెహ్వాగ్‌ 25, విజరు 19, ద్రవిడ్‌ 25, సచిన్‌ 13, లక్ష్మణ్‌ 38, పుజరా 19 పరుగులు చేసి అవుట్‌ అయ్యారు. భారత్‌ జట్టులో రెండు మార్పులు జరిగాయి. రైనా స్థానంలో పుజరా అలాగే గంభీర్‌ స్థానంలో మురళీ విజరు జట్టులో ఉన్నారు. ఇద్దరు 19 పరుగులు చేసి అవుట్‌ అయ్యారు. దక్షిణాఫ్రికా బౌలింగ్‌లో స్టెయాన్‌కు నాలుగు వికెట్లు తీయగా, తొత్సంబేకు రెండు వికెట్లు దక్కాయి.

బాలయ్యతో రవితేజ కుస్తీ

 బాలయ్యతో, రవితేజ మళ్ళీ ఢ ఇంతక ముందు ఇద్దరు ఒక్కేసారి సినిమా విడుదల అయ్యాయి. ' ఒక్కమగాడు'తో బాలయ్య 'కృష్ణ' తో రవితేజ బరిలోకిగారు. ఇద్దరు కుస్తీ పడి చివరికి రవితేజ, సినిమా హిట్‌ కొట్టి బాలయ్యను ఓడించాడు. ఈ సారి బాలకృష్ణ సినిమా 'పరమవీరచక్ర' సంక్రాతికి విడుదల కానున్న సంగతి తెలిసిందే అదే సమయంలో రవితేజ సినిమా ' మిరపకాయ' కూడా సంక్రాతికే బరిలోకి దిగనుంది. మరి ఈ సారి ఆసీన్‌ రివర్స్‌ అవుతుందో మళ్లీ రిపీట్‌ అవుతుందో జనవరి 15 వరకు వేచి చూడాలి.

సుమంత్‌ - స్వాతి కాంబినేషన్‌లో ' గోల్కొండ హైస్కూల్‌ '

 సుమంత్‌ హీరోగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో రూపొందిన ' గోల్కొండ హైస్కూల్‌ ' చిత్రం సంక్రాంతి బరిలోకి దూకనుంది. గత కొంత కాలంగా విజయాలు లేక సుమంత్‌ కష్టాల్లో ఉన్నాడు. 'బోణి ' తర్వాత కావాలని బ్రేక్‌ తీసుకున్నాడు. ఆష్టాచమ్మా వంటి హిట్‌ ఇచ్చిన మోహనకృష్ణ - స్వాతి కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం కావడంతో ' గొల్కొండ హైస్కూల్‌ ' పై సుమంత్‌కి భారీ అంచనాలే ఉన్నాయి.

Tuesday, December 21, 2010

వన్డే జట్టులో మాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌

 మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ తిరిగి వన్డే మ్యాచ్‌ల్లో ఆడనున్నాడు. దక్షిణాఫ్రికాతో జరగనున్న ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు ఎంపిక చేసిన భారత జట్టులో సచిన్‌ టెండూలర్‌ చోటు దక్కించుకున్నాడు. వన్డే సిరీస్‌కు ఎంపిక చేసిన 16 మంది సభ్యుల్లో సచిన్‌ ఉన్నాడు. డర్బన్‌లో జనవరి 9న జరగనున్న టి20 మ్యాచ్‌లో సచిన్‌ ఆడకపోవచ్చు. తొలి వన్డే డర్బన్‌లో జనవరి 12న, రెండో వన్డే జోహన్నెస్‌బర్గ్‌లో 15న , మూడో వన్డే కేప్‌ టౌన్‌లో (జనవరి 18), పోర్ట్‌ఎలిజబెత్‌ (జనవరి 21), సెంచూరియన్‌ (జనవరి 23) జరుగుతాయి.

భారత జట్టు: మహేంద్ర సింగ్‌ ధోనీ (కెప్టెన్‌), వీరేందర్‌ సెహ్వాగ్‌, గౌతం గంభీర్‌, సచిన్‌ టెండూల్కర్‌, విరాట్‌ కొహ్లి, సురేష్‌ రైనా, యువరాజ్‌ సింగ్‌, హర్భజన్‌ సింగ్‌, జహీర్‌ ఖాన్‌; ఆశిష్‌ నెహ్రా, ప్రవీణ్‌ కుమార్‌, మునాఫ్‌ పటేల్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, యూసుఫ్‌ పఠాన్‌, పియూష్‌ చావ్లా, శ్రీశాంత్‌.
 
 రెండో ర్యాంక్‌లో సచిన్‌
బ్యాటింగ్‌ విభాగంలో టాప్‌ టెన్‌లో కుమార సంగక్కర (882) సచిన్‌ టెండూల్కర్‌(880), జాక్స్‌ కల్లిస్‌ (846), సెహ్వాగ్‌(832), డివిల్లీర్స్‌ 806, మహేలా జయవర్ధనే (781), శివనారాయణ్‌ చంద్రపాల్‌ (779), హసీం ఆమ్లా (768), జోనాథన్‌ ట్రాట్‌ (767) ఉన్నారు.   

Monday, December 20, 2010

నాగవల్లి

 వెంకటేష్‌ హీరోగా సినిమా వస్తోందంటే, ఫ్యామిటీ ఎంటర్‌టైనర్‌నే ప్రేక్షకులు ఎక్కువగా ఆశిస్తుంటారు.సాఫ్ట్‌ రోల్సోలో ఎక్కువగా కన్నించడానికి ఇష్టపడే వ్యక్తి వెంకటేష్‌, ఈ సారి వెరైటీ కాన్సెప్ట్‌తో .. అదీ రజనీకాంత్‌ గతంలో చేసిన ' చంద్రముఖి' సినిమా సీక్వెల్‌లో నటిస్తున్నాడంటే సహజంగానే ప్రేక్షకుల్లో ఆసక్తి కాస్త ఎక్కువగానే వుంటుంది.
ఐదుగురు హీరోయిన్లతో వెంకీ
అనుష్క, రిచా, కమిలిన, శ్రద్దాదాస్‌, పూనమ్‌కౌర్‌
సైకాలజిస్ట్‌గానూ, మహారాజ నాగభైరవగానూ వెంకటేష్‌ మొదటిసారి నెగెటివ్‌ రోల్‌ పోషించిన వెంకి, నాగబైరవగా ప్రేక్షకుల్ని ఓ రేంజ్‌లో మెప్పించడం ఖాయం.
అనుష్క ; ' అరుంధతి' తర్వాత అనుష్క ఆ స్థాయిలో నటనకు ప్రదర్శించేందుకు ఛానొచ్చిన సినిమా ' నాగవల్లి' తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది.
శ్రద్దాదాస్‌  ;తన నటనతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. కీలక సన్నివేశంలో శ్రద్దాదాస్‌ తన పెర్ఫామెన్స్‌తో మెస్మరైజ్‌ చేసింది.
కమలినీ ముఖర్జీ ; పేషెంట్‌టా కన్నించడం బాలేదు.... అయితే డాన్స్‌ కాస్ట్యూమ్స్‌లో చాలా బావుంది.
రిచా గంగోపాధ్యాయ ; అందంగా వుంది. పూనమ్‌కౌర్‌ది తక్కువ పాత్రే అయినా తళుక్కువ మెరిసింది.
రేటింగ్‌లో నాగవల్లి 3.25/5 సాధించింది.

అనుష్క , త్రిష మధ్య అధిపత్య పోరు

 అనుష్క కథానాయాకగా నటించిన రగడ, త్రిష నటించిన మన్మథ బాణం డిసెంబర్‌ 23న విడుదల కానున్నాయి. మన్మథ బాణం అనువాద చిత్రమే అయినా కానీ కమల్‌హాసన్‌ కథానాయకుడు కావడంతో ఈ చిత్రంపై కూడా అంచానాలు భారీగా ఉన్నాయి. త్రిష ' మన్మథ బాణం' తో హిట్టు కొట్టి తెలుగు, తమిళనాడుల్లో సత్తా చాటాలని త్రిష ఉవ్విళ్లూరుతోంది. మరోవైపు ' రగడ' పై కూడా అంచనాలు ఘనంగానే ఉన్నాయి. టైటిల్‌ దగ్గర్నుంచి పాటల వరకు అంతా మాస్‌ మయమైన ఈ చిత్రం దుమ్ము రేపుతుందని ట్రేడ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ' మన్మథ బాణం ' చిత్రాన్ని ' రగడ'తో సమానంగా విడుదల చేయాడానికి ఆ చిత్ర నిర్మాతలు కూడా ప్లాన్‌ చేసుకోవడంతో ఈ రెండింటి మధ్య పోటీ తప్పదనిపిస్తోందిసో .... రెండు సినిమాలతో ఇద్దరు స్టార్‌ హీరోయిన్లు అమీ తుమీ తేల్చుకోనున్న ఈ సందర్బంలో విజయం ఎవరిని వరిస్తుందనేది తేరపై చూడాలి.

Friday, December 10, 2010

భారత్‌ 5-0 తేడాతో ఘన విజయం


భారత్‌ - న్యూజిలాండ్‌ మధ్య జరుగుతున్న ఐదో వన్డే మ్యాచ్‌లో భారత్‌ బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌ విభాగంగా రాణించి సిరీస్‌ కైవసం చేసుకుంది. టెస్టు మ్యాచ్‌లో 1-0 తేడాతో, వన్డేలో 5-0 తేడాతో భారత్‌ - న్యూజిలాండ్‌ పై రెండు విభాగాలుగా విజయం సాధించింది. ఆఖరి చివరి వన్డేలో న్యూజిలాండ్‌ 103 పరుగులకే అలౌట్‌ అయ్యింది. న్యూజిలాండ్‌ బ్యాటింగ్‌లో ఫ్రాంక్లింగ్‌ 24 పరుగులు చేసి టాప్‌ స్కోర్‌గా నిలిచాడు. మిగితా బ్యాట్స్‌మైన్‌లు అంతగా రాణించలేకపోయారు. భారత్‌ బౌలింగ్‌లో ఆశ్విన్‌ 3 మూడు వికెట్లు తీసుకోగా యువరాజ్‌, యుసుఫ్‌ పఠాన్‌, నెహ్రా తలో రెండు వికెట్లు తీసుకున్నారు. ప్రవీణ్‌ కుమార్‌ ఒక వికెటు తీసుకున్నారు. 104 పరుగుల లక్ష్యంతో భ్యాటింగ్‌ దిగిన భారత్‌ 10 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది.ే గంభీర్‌ 0, విరాట్‌ కోహ్లీ 2 పరుగులకే అవుట్‌ అయ్యారు. ఓపెనరుగా వచ్చిన పార్థీవ్‌ పటేల్‌ అర్థ సెంచరీ చేశాడు. (56) పార్థీవ్‌ పటేల్‌ అండగా యువరాజ్‌ సింగ్‌ 42 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.

Monday, December 6, 2010

ఘాటెక్కిస్తానంటోన్న ' రిచా '

తొలి చిత్రం ' లీడర్‌'లో పద్దతిగా కన్పించిన రిచా గంగోపాధ్యారు, ' మిరపకారు' సినిమాకొచ్చేసరికి చాలా ఘూటుగా కన్పిస్తోంది.' మిరపకారు ' సినిమాతో తన గ్లామర్‌ ఘాటు ఏంటో చూపిస్తానంటోన్న రిచా వెంట టాలీవుడ్‌ దర్శక నిర్మాతక ఇప్పుడు క్యూ కడ్తున్నారట.నిన్న జరిగిన ' మిరపకాయ' సినిమా ఆడియో విడుదల వేడుకలో అందరి కళ్ళూ రిచాపైనే పడ్డాయంటే ఆమె ఎంత గ్లామర్‌ని వెద జల్లిందో అర్ధం చేసుకోవచ్చు. రేంజ్‌ని ఎంతవరకు పెంచుతుందోగానీ, ' మిరపకారు' సినిమాపై మాత్రం టాలీవుడ్‌లో అంచనాలు బాగానే వున్నాయి.

భూవివాదంలో అనుష్క

అందాల అనుష్క నటిగానే కాకుండా మంచి వ్యక్తిగా కూడా మన సినిమా ఇండస్ట్రీలో పేరు తెచ్చుకుంది. వివాదాలకు, గొడవలకు ఎప్పుడూ దూరంగా వుంటుంది. తన పనేదో తాను చేసుకుని వెళ్ళిపోతుంది. అలాంటి అనుష్క ఇప్పుడు ఓ వివాదంలో చిక్కుకొంది.రెండేళ్ల క్రితం వైజాగ్ లో కొందరు సినీప్రముఖులతో కలిసి అనుష్క కూడా విశాఖ జిల్లా భీమిలిలో కొంత భూమి కొనుగోలు చేసింది.అయితే ఆ స్థలం తనదేనని తనకి తెలియకుండా ఎవరో అక్రమంగా అనుష్కకి అమ్మేశాడని ఓ ఎన్నారై కోర్టు కెక్కాడు. ఈ కేసు విషయమై కోర్టు పలుమార్లు సమన్లు జారీ చేసినప్పటికీ, అనుష్క వాటిని పట్టించుకోలేదు.దీంతో ఈ కేసు విచారణను చేపట్టిన న్యాయమూర్తి జనవరి 28 న అనుష్క వ్యక్తిగతంగా కోర్టులో హాజరుకావాలని సమన్లు జారీచేసింది. మరి దీనిని ఈ ముద్దుగుమ్మ ఎలా ఎదుర్కుంటుందో చూడాలి! తరలిపోతున్న టాలీవుడ్..

Saturday, December 4, 2010

మూడు వన్డేలో భారత్‌ ఘన విజయం


కెప్టెన్‌ గంభీర్‌ 126 ( 117) సెంచరీ, విరాట్‌ కోహ్లీ 63 (70) అర్థసెంచరీలతో చెలరేగడంతో మూడో వన్డేలో భారత్‌ 9 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌పై ఘన విజయం సాధించింది. దీంతో భారత్‌ 3-0 తేడాతో వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుంది. మరికొద్ది రోచేసుకుంది. మరికొద్ది రోజుల్లో ప్రపంచకప్‌ జరగనున్న నేపథ్యంలో ఈ విజయం టీం ఇండియాకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చింది. ఓపెనర్‌ విజరు 30( 50)తో గౌతమ్‌ గంభీర్‌లు మొదటి వికెట్‌కు 115 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పడం భారత్‌ను పటిష్ఠ స్థితిలో ఉంచింది.

అంతకు ముందుటాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌ నిర్థీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసింది. గుప్తిల్‌ 12, మెక్‌కలమ్‌ 0, విలియమ్‌సన్‌ 21, టేలర్‌ 4, స్లైరిస్‌ 22, వెట్లోరి 3, హాప్కిన్స్‌ 6, మెక్‌కలమ్‌ 43, మిల్స్‌ 15 పరుగులు చేసి ఔటయ్యారు. ఫ్రాంక్లిన్‌ 72 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. భారత్‌ బౌలర్లలలో జహీర్‌ , అశ్విన్‌,పఠాన్‌ రెండేసి వికెట్లు తీయగా, మునాఫ్‌ పటేల్‌కు ఓ వికెట్‌ దక్కింది.

Sunday, November 28, 2010

మొదటి వన్డే భారత్‌ 40 పరుగుల తేడాతో ఘన విజయం


భారత్‌ - న్యూజిలాండ్‌ జట్ల మధ్య జరుగుతున్న మొదటి వన్డేలో భారత్‌ 40 పరుగుల తేడా విజయం సాధించింది. 277 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్‌ 45.2 ఓవర్లలో 236 పరుగులకఁ అలౌట్‌ అయ్యింది. టేలర్‌ ఒక్కడే అర్థసెంచరీ చేశారు. మిగిత బ్యాట్‌మైన్‌ పెద్దగా రాణించలేకపోయారు. గుప్తిల్‌ 30, హౌ 9, విలియమ్‌సన్‌ 25, స్లైరిస్‌ 10, ఎలియట్‌ 5, హాప్కిన్స్‌ 16, టఫీ 4, మెక్‌కల్లమ్‌ 35, మిల్స్‌ 32 పరుగులకఁ ఔట్‌ అయ్యారు. భారత్‌ బౌలింగ్‌లో శ్రీశాంత్‌, యువరాజ్‌ సింగ్‌, అశ్విన్‌ తలో మూడు వికెట్లు తీసుకొఁ మిడిల్‌ ఆర్డర్‌ను కట్టడి చేశారు. నెహ్రాకఁ ఒక వికెట్‌ లభించింది. 
అంతకముందు భారత్‌ 276 పరుగులకఁ ఆలౌటైంది. విరాట్‌ కోహ్లీ ( 105 )అద్బుత సెంచరీ చేశాడు.టాస్‌ ఓడి బ్యాటింగ్‌కఁ దిగిన భారత్‌ ఓపెనర్లు విజరు 29, గంభీర్‌ 38, పరుగులకఁ ఔటయ్యారు. కోహ్లీ యువరాజ్‌తో కలసి మూడు వికెట్‌కఁ 88 పరుగుల స్కోరు అందించారు. యువరాజ్‌ 42 పరుగుల వద్ద ఔట్‌ అయ్యాడు. అ తర్వాత వచ్చిన బ్యాట్‌మైన్‌లు పెద్దగా రాణించలేకపోయారు. రైనా 13, వర్థమాన్‌ షా 4, ఆశ్విన్‌ 0, నెహ్రా 0, శ్రీశాంత్‌ 4, యుసుఫ్‌ పఠాన్‌ 29 పరుగులు చేశారు.న్యూజిలాండ్‌ బౌలర్లలలో మెకే నాలుగు, మిల్స్‌ మూడు, టఫే రెండు వికెట్లు దక్కాయి.

Wednesday, November 24, 2010

కొత్త సీఎంగా కిరణ్‌కూమార్‌రెడ్డి

 ఆంధ్రప్రదేశ్‌ 16వ ముఖ్యమంత్రిగా నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డిని ఎంపిక చేస్తూ కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. బుధవారం రాజీనామా సమర్పించిన రోశయ్య స్థానంలో కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రి పదవిని చేపట్టనున్నారు. కిరణ్‌కుమార్‌ రేడ్డి రేపు ఉదయం 10 గంటలకు స్పీకర్‌ పదవికి రాజీనామా చేసి ముఖ్యమంత్రిగా ప్రమాణా స్వీకారం చేస్తారు.

నేటి నుండి యాషెస్‌ పోరు


ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ క్రికెట్‌ జట్ల మధ్య 133 సంవత్సరాల పోరాటం మరోసారి కొనసాగనుంది. యాషెస్‌ సిరీస్‌గా పేరుగాంచిన ఇరు జట్ల మధ్య టెస్టు సిరీస్‌ గురువారం నాడిక్కడ ప్రారంభం కానుంది. ఆండ్రూ స్ట్రాస్‌ నేతృత్వంలోని ఇంగ్లండ్‌ జట్టు ట్రోఫీని నిలబెట్టుకోవాలని పట్టుదలగా ఉండగా యాషెస్‌ సిరీస్‌ను ఎక్కువసార్లు గెలుచుకున్న ఆస్ట్రేలియా జట్టు ఈసారి విజేతగా నిలవాలని ఉబలాటంతో ఉంది. రికీ పాంటింగ్‌ తన నాయకత్వ గరిమను మరోసారి చాటుకోవాలని ఉత్సాహపడుతున్నాడు. 1988 తరువాత గబ్బా మైదానంలో ఓటమి ఎరుగని ఆస్ట్రేలియా అదే రికార్డును కొనసాగించేందుకు సమయాత్తమవుతుండగా ఆసీస్‌ ఆధిపత్యానికి గండి కొట్టాలని స్ట్రాస్‌ బృందం ఎదురుచూస్తోంది. ఐదు టెస్టుల సిరీస్‌లో మొదటి మ్యాచ్‌ను గెలుచుకుని శుభారంభం చేయాలని ఇరు జట్లు ఉత్సుకతో ఉన్నాయి. ఇటీవలి కాలంలో సంచలన విజయాలు సాధిస్తున్న ఇంగ్లండ్‌ ఉత్సాహంతో ఉరకలేస్తుండగా కొన్ని ఎదురుదెబ్బలు తిన్న ఆసీస్‌ వాటి నుండి పాఠాలు నేర్చుకుని తన ప్రాభవానికి ఎదురులేదని చాటుకోవాలని ఆకాంక్షిస్తోంది. అయితే ఇటీవలికాలంలో ఆసీస్‌కు పెద్ద దిక్కుగా ఉంటున్న బోల్లింగర్‌ పూర్తి ఫిట్‌నెస్‌ సాధించలేకపోవడంతో తొలి టెస్టుకు అందుబాటులో ఉండడు. మిచెల్‌ జాన్సన్‌పై ఆసీస్‌ ప్రధానంగా ఆధారపడుతోంది.సైమన్‌ కటిచ్‌, షేన్‌ వాట్సన్‌, మైఖేల్‌ క్లార్క్‌, మైఖేల్‌ హస్సే మాత్రమే కాదు మార్కస్‌ నార్త్‌ , బ్రాడ్‌ హాడిన్‌, జాన్సన్‌ కూడా పరుగుల వర్షం కురిపించగల సత్తా ఉన్నవారు. రికీ పాంటింగ్‌ ఈ యాషెస్‌ సిరీస్‌ను ప్రతిష్టాత్మకమైందిగా భావిస్తున్నాడు. జాన్సన్‌తో పాటు సిడిల్‌, బెన్‌ హిల్ఫెన్హాస్‌ ఆసీస్‌ జట్టులో ప్రత్యర్థులను దెబ్బతీయగల బౌలర్లు. ఇంగ్లండ్‌ విషయానికి వస్తే కెప్టెన్‌ ఆండ్రూ స్ట్రాస్‌, కెవిన్‌ పీటర్సన్‌, పాల్‌ కాలింగ్‌వుడ్‌ ప్రత్యర్థులపాలిట సింహస్వప్నాలే. అలెస్టర్‌ కుక్‌ ఫామ్‌లో ఉన్నాడో, లేదో తెలియాల్సి ఉంది. రెండు రోజుల క్రితం కురిసిన వర్షంతో పిచ్‌ ఫాస్ట్‌బౌలింగ్‌కు అనుకూలంగా మారగలదని నిపుణులు భావిస్తున్నారు.

Tuesday, November 23, 2010

' నాగవల్లి' డిసెంబర్‌ 16న విడుదల



వెంకటేష్‌ నటించిన ' చంద్రముఖి ' సీక్వెల్‌ ' నాగవల్లి' డిసెంబర్‌ 16న విడుదలయ్యే అవకాశముంది. వెంకటేష్‌ హీరోగా అనుష్క, కమలినీ ముఖర్జీ, రిచా గంగోపాధ్యాయ, శ్రద్దాదాస్‌ తారమణులుగా ఈ చిత్రం నటించనున్నారు. ఆడియో చాలా పెద్ద హిట్‌ కావడంతో సినిమా పై కూడాప్రేక్షకల్లో అంచనాలున్నాయి. వెంకటేష్‌ అభినయం హైలైట్‌ అవుతుంది. చంద్రముఖి కంటే నాగవల్లి పెద్ద హిట్‌ అవుతుందన్న నమ్మకం నాకు ఏర్పడింది.

నాగపూర్‌ టెస్ట్‌లో భారత్‌ ఘన విజయం


న్యూజిలండ్‌తో జరిగిన టెస్ట్‌ మ్యాచ్‌లో భారత్‌ 198 పరుగుల తేడాతో ఘన విజయం సాధిచింది. న్యూజిలాండ్‌ తన రెండో ఇన్నింగ్స్‌లో 175 పరుగులకు అలౌట్‌ అయ్యింది. దీంతో మూడు టెస్టుల సీరీస్‌ను 1-0 తేడాతో భారత్‌ గెలుచుకుంది. మ్యాన్‌ ఆఫ్‌ద సీరీస్‌గా హర్భజన్‌, మ్యాన్‌ ఆప్‌ద మ్యాచ్‌గా ద్రవిడ్‌ ఎంపికయ్యారు. న్యూజిలాండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో సౌతీ 31 పరుగులు చేసి టాప్‌ స్కోర్‌గా నిలిచాడు. భారత్‌ బౌలింగ్‌లో ఇషాంశ్‌ శర్మ , హర్బజన్‌ సింగ్‌ చెరో మూడు వికెట్లు తీసుకున్నారు. ఓజా, రైనా ఇద్దరు చెరో రెండు వికెట్లు తీసుకున్నారు.

Sunday, November 21, 2010

రెండో రోజు భారత్‌ స్కోర్‌ 292/2




 న్యూజిలండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో రెండో రోజు ఆట మూగిసే సమయానికి భారత్‌ రెండు వికెట్లు కోల్పోయి 292 పరుగులు చేసింది. సచిన్‌ 57, ద్రావిడ్‌ 69 పరుగులతో నాటౌట్‌గా ఉన్నారు. అంతక ముందు న్యూజిలాండ్‌ 148 పరుగులతో ఆట ప్రారంభించి మరో 45 పరుగులు చేసింది. రెండో రోజు ఆట ప్రారంభించిన భారత్‌ 292/2 పరుగులు చేసింది. సెహ్వాగ్‌, గంభీర్‌ ఇద్దరు ఆట ప్రారంభించి మొదటి వికెటు 113 పరుగుల వద్ద సెహ్వాగ్‌ వెట్లోరి బౌలింగ్‌లో అవుట్‌ అయ్యాడు. ( 72 బంతులలో 12 ఫోర్లు, 1 సిక్స్‌లతో ) 74 పరుగులు చేశాడు. గంభీర్‌ ( 127 బంతులలో 12 ఫోర్లు ) 78 పరుగులు చేశాడు. సచిన్‌ 57, ద్రావిడ్‌ 69 పరుగులతో క్రీజులో ఉన్నారు. కివీస్‌ బౌలింగ్‌లో వెట్లోరి, సౌతీ చెరో వికెటు లభించింది. భారత్‌ 99 పరుగుల అధిక్యతం ఉంది.

Monday, November 15, 2010

న్యూజిలండ్‌ స్కోరు 273/4


భారత్‌ - న్యూజిలండ్‌ మధ్య జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్యలో నాల్గొవ రోజు న్యూజిలాండ్‌ నాలుగు వికెట్లు కోల్పోయి 237 పరుగులు చేసింది. మెక్‌కల్లమ్‌ 124, విలియమ్‌సన్‌ 12 పరుగులతో క్రీజులో ఉన్నారు. రెండో టెస్టు మ్యాచ్‌ కూడా డ్రా దిశగా పయనిస్తుంది. నాల్గోవ రోజు ఆట ప్రారంభించిన భారత్‌ మరో 36 పరుగులు చేసి చివరి వికెటు కోల్పోయింది. భజ్జీ 116 బంతులలో ఏడు ఫోర్లు, ఏడు సిక్స్‌ర్‌ల సహయంతో సెంచరీ చేసి నాటౌట్‌గా మిగిలాడు. శ్రీశాంత్‌ 24 పరుగుల ఔట్‌ అయ్యాడు. భారత్‌ 122 పరుగుల అధికత్యం నిలిచింది. న్యూజిలండ్‌ రెండో ఇన్సింగ్‌ ప్రారంభించిన నాలుగు వికెట్లు కోల్పోయి 237 పరుగులు చేసింది. మెకింతోష్‌ 49, గుప్తిల్‌ 18, టైలర్‌ 7, రైడర్‌ 20 పరుగులు చేసి అవుట్‌ అయ్యారు. మెక్‌కల్లమ్‌ 124, విలియమ్‌సన్‌ 12 పరుగులతో క్రీజులో ఉన్నారు. భారత్‌ బౌలింగ్‌లో ఓజా రెండు వికెట్లు తీసుకున్నాడు. శ్రీశాంత్‌ , రైనా చెరో వికెటు తీసుకున్నారు. న్యూజిలండ్‌ 115 పరుగుల లీడ్‌తో ఉంది.

Sunday, November 7, 2010

తీవ్రత తగ్గిన 'జల్‌'



కొద్దిరోజులుగా వణుకు పుట్టించిన జల్‌ తుపాను తీవ్రత తగ్గింది. తీవ్ర తుపాను నుండి సాధారణ తుపాను స్థాయికి జల్‌ తీవ్రత తగ్గినట్లు వాతావరణశాఖ ఆదివారం సాయంత్రం నిర్ధారించింది. ఇది మరింతగా బలహీనపడి చెన్నై, నెల్లూరుల మధ్య ఆదివారం రాత్రికే తీరం దాటే అవకాశం ఉందని వాతావారణ శాఖ తెలిపింది. తుపాను కారణంగా నెల్లూరు జిల్లాలో 14 మంది, కృష్ణా, చిత్తూరు జిల్లాల్లో ఒక్కొక్కరు మృతి చెందారు. విశాఖ జిల్లాలో ఒక మత్స్యకారుడు గల్లంతయ్యాడు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం పెదమైనవాని లంక వద్ద సముద్రంలో 15 మంది జాలర్లతో కూడిన సోనా బోటు చిక్కుకుంది. కృష్ణపట్నం రేవులో పదో నెంబరు ప్రమాద సూచికను ఎగురవేశారు. పులికాట్‌ సరస్సు పొంగుతోంది. కాళంగి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. సోమశిల, కండలేరు జలాశయాలు నిండాయి. తుపాన్‌ ప్రభావంతో నెల్లూరు. ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాలో పెద్దఎత్తున చలిగాలులు వీస్తున్నాయి. సముద్రం కల్లోలంగా ఉంది.రాత్రి 7.30 గంటలకు భారత వాతావరణ శాఖ విడుదల చేసిన బులెటిన్‌ ప్రకారం తుపాన్‌ చెన్నై తీరానికి 90 కిలోమీటర్లు దూరాన, నెల్లూరుకు 200 కిలోమీటర్ల దూరాన కేంద్రీకృతమై ఉంది.


దక్షిణ కోస్తా జిల్లాల వైపు నెమ్మదిగా కదులుతున్న తుపాను ఆదివారం రాత్రి 12 గంటల నుండి సోమవారం తెల్లవారుజామున రెండు గంటల మధ్య తీరం దాటే అవకాశం ఉంది. అయితే తుపాను కారణంగా సముద్రం అల్లకల్లోలంగా మారింది. అలలు మీటరు నుంచి రెండు మీటర్ల ఎత్తున ఎగిసిపడుతున్నాయి. తుపాను తీవ్రత తగ్గినప్పటికీ మరో 24 గంటల పాటు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ హెచ్చరించడంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుజాగ్రత్త చర్యలను కొనసాగిస్తోంది.

అహ్మదాబాద్‌ టెస్టు : భారత్‌ 82/6


న్యూజిలండ్‌తో జరుగుతున్న తొలిటెస్టు నాలుగో రోజున ఆట ముగిసే సమయానికి 6 వికెట్ల నష్టానికి 82 పరుగుల మాత్రమే చేసింది. లక్ష్మణ్‌ 34, భజ్జీ 12 పరుగులతో క్రీజులో ఉన్నారు. రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన భారత్‌ గంభీర్‌ 0, సెహ్వాగ్‌ 1, ద్రావిడ్‌ 1, సచిన్‌ 12, రైనా 0, ధోని 22 పరుగులకే అవుట్‌ అయ్యారు. మార్టిన్‌ భారత్‌ను దెబ్బమీద దెబ్బ తీశాడు. భారత్‌ 110 పరుగుల ఆధిక్యంలో ఉంది.

Saturday, November 6, 2010

భారత్‌కు కివీస్‌ చెక్‌


uó²sÁÔYÔà ÈsÁT>·TÔáTq• yîTT<Š{ì fÉdŸT¼ eÖ«#YýË eTÖ&à sÃE qÖ«›ý²+&Ž €³eTTНd dŸeTjáÖ“¿ì ×<ŠT $¿³T¢ ¿ÃýËÎsTT 331/5 |ŸsÁT>·T\T #ûd¾+~. ÂsÕ&ƒsY 104 , $*jáTyŽTdŸHŽ 87,  yîT¿ù¿£\¢yŽT 65, fñ\sY 56 |ŸsÁT>·T\T #ûXæsÁT. uó²sÁÔY u…*+>´ýË  zC² Âs+&ƒT $¿³T¢ rdŸTÅ£”H•&ƒT. ÈVÓ²sY U²HŽ, çoXæ+ÔY,  VŸ²sÁÒÈHŽ d¾+>´ #îsà $¿³T rdŸTÅ£”H•sÁT. uó²sÁÔY ©&+>´ 156 |ŸsÁT>·T\T.

Thursday, November 4, 2010

దీపావళి శుభాకాంక్షలు

పరుగుల విందు



డాషింగ్‌ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ తన బ్యాట్‌ పదునును న్యూజిలాండ్‌ బౌలర్లకు మరోసారి రుచి చూపించాడు. వరుస వైఫల్యాలతో నిరుత్సాహపరుస్తున్న రాహుల్‌ ద్రావిడ్‌ మళ్లీ ఫామ్‌లోకి వచ్చి మొటేరా మైదానంలో తన సత్తాను మరోసారి చాటుకున్నాడు. వీరిద్దరూ విజృంభించి ఆడి సెంచరీలు చేయడంతో న్యూజిలాండ్‌తో గురువారం నాడిక్కడ ప్రారంభమైన తొలి క్రికెట్‌ టెస్టులో భారత్‌ మొదటి రోజు మూడు వికెట్ల నష్టానికి 329 పరుగులు చేసింది. వన్డే మ్యాచ్‌ తరహాలో బ్యాటింగ్‌ చేసిన సెహ్వాగ్‌ 173 పరుగులు చేసి అవుటయ్యాడు. కాగా ద్రావిడ్‌104 పరుగులకు అవుటయ్యాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 237 పరుగులు జోడించి రికార్డు నెల కొల్పారు. వరుసగా తొమ్మిది టెస్టుల్లో టాస్‌ కోల్పో యిన ధోనీ ఈ టెస్టులో టాస్‌ గెలవడం తరువాయి బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. బౌలర్లకు భారంగా పరిణ మించిన పిచ్‌పై భారత్‌ బ్యాట్స్‌మెన్‌ చెలరేగి ఆడారు. 

తొలి వికెట్‌కు గంభీర్‌, సెహ్వాగ్‌ 12 ఓవర్లలోనే 60 పరుగులు చేసి శుభారంభం అందించారు. గంభీర్‌ అవుటైన తరువాత వచ్చిన ద్రావిడ్‌ ఆరంభంలో కొంత నిదానంగా ఆడినప్పటికీ తరువాత పుంజు కున్నాడు.సెహ్వాగ్‌తో రికార్డు భాగస్వామ్యం నెలకొల్పాడు. సునీల్‌ గవాస్కర్‌, సురీందర్‌ అమర్‌నాథ్‌ 1976లో ఆక్లండ్‌లో 204 పరుగులు చేసి నెలకొల్పిన రికార్డును సెహ్వాగ్‌, ద్రావిడ్‌ జోడీ చెరిపేసింది. మొదటి రోజు ఆట టీ విరామం తరువాత భారత్‌ ఈ రెండు వికెట్లను కోల్పోయింది.సెహ్వాగ్‌కు టెస్టుల్లో ఇది 22వ సెంచరీ కాగా ద్రావిడ్‌కు 30వది.

Wednesday, November 3, 2010

సినిమా ఉసురు తీస్తున్నఫైరసి


కొన్ని వందల కోట్లు కర్చుపెట్టి, ప్రపంచంలోని వివిద దేశాలు తిరిగి సుందర ప్రదేశాలను అద్భుతంగా చూపించి, ఎండనక వాననక నిద్రాహారాలు మాని ఎంతో శ్రమించి నిర్మించిన సినిమా నేడు విడుదలైన రోజే ఇంటర్‌నెట్టులో ప్రత్యక్షమౌతోంది. దీంతో కోట్లు కర్చుపెట్టిన నిర్మాత కుదేలవుతున్నాడు. భారీ ఖర్చు పెట్టి తీసిన సినిమాని ఏ నయాపైసా కర్చు లేకుండా ఇంటర్నెట్టుల్లో చూస్తూ దానికి తాము ఎంతో పొడిచినట్టు రాసే రివ్యూలు అబ్బో చేసే యాక్షన్‌లు అంతా ఇంతా కాదు. మరి సినిమా తీసిన వారిని విమర్శించే ముందు మనం వారు చేసిన దాంట్లో చిటికెన వేలంత అయినా చేయగలమా అని మనస్ఫూర్తిగా ఆలోచించే ధైర్యం చేస్తే మళ్లీ ఇలాంటి రివ్యూలు, ఎవరు రాయరు రాయలేరు. వీరు చేసే వెకిలి పని, వికారపు పని ఒక్క నిర్మాతనే కాదు అందులో పనిచేసే లైట్‌ బాయ్ దగ్గర నుంచి వేల మంది క్యారెక్టర్‌ ఆర్టిస్టుల, మరియు వందల మంది సిబ్బంది జీవితాలతో ఆడుకుంటుందన్న విషయం ఇంకా అర్థం అయినా కానట్టు నాదేం పోతుందిలే అని ఈ ఇంటర్నెట్‌ సినిమాయలో పడి చాలా మంది థియేటర్లకు వెళ్లకుండానే ఇంట్లోకూర్చుని దర్జాగా సినిమాని చూస్తున్నామని వాళ్లు అనుకుంటున్నారు.

కాని ఎంతో కళాత్మకంగా అందిచిన ఆ సంగీతం 70 ఎంఎం థియేటర్‌లో వినిపిచినంత మధురంగా ఆ డొక్కు కంప్యూటర్‌లో వినిపిస్తుందా. వందల మందితో కలిసి చూసేటప్పుడు కలిగే ఆ థ్రిల్లింగ్‌, ఈ నాలుగు గోడల మధ్యన ఒంటరిగా కూర్చుని చూస్తే వస్తుందా..? ఆ గ్రాఫిక్స్‌ మాయ కళ్ల నిండా వెలిగి గుండె నిండా వెదజల్లుతూ... థియేటర్‌ తెర మన మనసులో చేసే సందడి ఈ 28 ఇంచిల కంప్యూటర్‌ కలిగిస్తుందా...? అయినా ఒకే సారి రాకుండా ఆగుతూ ఆగుతూ వచ్చే తొస్సు మాటలలా వచ్చే డైలగాలు.... ఒక్కక్కొక్కరిని కాదు షేర్‌ఖాన్‌ వందమందిని ఒకే సారి పంపించు అనే గాంభీర్యం గానీ..... వదల బొమాలి వదలా.......అనగానే మనసులో కలిగే ఓ భయంలాంటి ఆనందంగానీ.... ఆ వినీ పిచని స్ట్రక్‌ అవుతూ వచ్చే మాటలలో ఉంటుందా....? అంటే ఒక్క పర్సెంట్‌ కూడా ఉండదు కానీ వాటినే చూడటం వాటికోసం వెంపర్లాడటం తర్వాత ఏం బాగోలేదనో.. లేక ఆవరేజ్‌ అనో సైట్‌లలో రాసి పెడితే.. అది సదివిన వెర్రి ప్రేక్షకుడు సినిమాహాలుకు వెళ్లకుండా సినిమా బాగోలేదని కూర్చోవడం ఇదంతా సినిమా ఇండిస్టీ పతనానికి దారి తప్ప ఇంకోటి కాదు. ఇలా కంప్యూటర్ల మానిటర్లపై సినిమా చూడటం ఆరంభిస్తే ముందుముందు కాలంలో భారీ బడ్జెట్‌తో మగధీరా, రోబో లాంటి విన్యాసాలు, చూపేందుకు నిర్మాతలు ముందుకు రారు అలాంటప్పుడు, తెలుగు సినీ ఇండిస్టీ, లేదా మరే సినీ ఇండిస్టీ అయినా మూసేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి రివ్యూలు చదివో, ఇంటర్నెట్‌లోకి సినిమాలు అప్‌లోడ్‌ చేసి, లేక వాటిని చూస్తూ ఆనందింస్తున్న వాళ్లు కనీస మానవతావాద దృక్ఫథంతో ఆలోచించి మనం చూస్తుంది, ఇంటర్నెట్‌ సినిమా కాదు వందల మంది నెత్తుటి బొట్టును చెమటచుక్కగా కరిగించి సినిమా తీసిన వారి నోటికాడి ముద్దని లాగేస్తున్నమని మర్చిపోవద్దు. సినిమానే జీవనాదారంగా బ్రతుకుతున్న జీవితాలతో ఆడుకుంటున్నామనే సంగతి కొద్దిగా ఆలోచించాలని ఆశిస్తూ ,,,,,,!
 

శ్రీలంక అద్భుత విజయం

ఆంజెలో మాథ్యూస్‌, లాసిత్‌ మలింగ అసాధ్యాన్ని సుసాధ్యం చేసారు. ఆస్ట్రేలియాతో బుధవారం నాడిక్కడ జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో ఈ జోడీ శ్రీలంకకు ఒక వికెట్‌ తేడాతో అనూహ్య విజయం సంపాదించిపెట్టారు. 240 పరుగులు చేయాల్సిన జట్టు 107 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోతే ఏ జట్టయినా విజయంపై ఆశలు వదులు కోవాల్సిందే. అందుకు మాథ్యూస్‌, మలింగ ససేమిరా అన్నారు. తమ జట్టును గెలిపించే బాధ్యతను భుజస్కంథాలపై వేసుకుని చేసి చూపించారు. రణదీవ్‌ రనౌట్‌ అయిన తరువాత అసలు సంచలనం ప్రారం భమైంది. మాథ్యూస్‌తో మలింగ జత కట్టాడు. ఈ జోడీ తొమ్మిదో వికెట్‌కు 132 పరుగులు జోడించి ప్రపంచ రికార్డు నెలకొల్పారు. తమ జట్టును లక్ష్యానికి చేరువకు తీసుకెళ్లారు. 239 పరుగుల వద్ద, అంటే విజయానికి ఒక పరుగు కావాల్సిన దశలో మలింగ రనౌటయ్యాడు. ఈ దశలో చివరి బ్యాట్స్‌మన్‌గా వచ్చిన ముత్తయ్య మురళీధరన్‌ను ఆసీస్‌ అవుట్‌ చేసి ఉంటే మ్యాచ్‌ టైగా ముగిసేది. అయితే ఆసీస్‌ బౌలర్లు, ముఖ్యంగా వాట్సన్‌ ఆ పని చేయలేకపోయాడు. శ్రీలంక 45వ ఓవర్‌లో వాట్సన్‌ బౌలింగ్‌లో రెండో బంతిని మురళీధరన్‌ బౌండరీకి తరలించడంతో శ్రీలంక విజయం సాధించింది. భారత జట్టు చేతిలో అటు వన్డే సిరీస్‌లోనూ, ఇటు టెస్టుల్లోనూ ఓటమి చవిచూసిన ఆసీస్‌ వరుసగా ఆరో ఓటమిని చవిచూసింది. వన్డేల్లో తొమ్మిదో వికెట్‌కు మాథ్యూస్‌, మలింగ 132 పరుగులు జోడించి 27 కిందటి రికార్డును చెరిపివేసారు.

1983 ప్రపంచకప్‌లో కపిల్‌దేవ్‌, సయ్యద్‌ కిర్మాణీ నెలకొల్పిన రికార్డును బ్రేక్‌ చేసారు. ఈ క్రమంలో వన్డేల్లో తొలి అర్ధసెంచరీని మలింగ నమోదు చేసాడు. మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ మాథ్యూస్‌ 77 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఆసీస్‌ విధించిన 240 పరుగుల లక్ష్యాన్ని శ్రీలంక 44.2 ఓవర్లలోనే సాధించింది. అంతకుముందు పెరీరా 46 పరుగులు మాత్రమే ఇచ్చి ఐదు వికెట్లు తీసుకోవడంతో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకన్న ఆసీస్‌ నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 239 పరుగులు చేసింది. ఆ జట్టులో ఓపెనర్‌ హాడిన్‌ 49, మైక్‌ హస్సే 71, మార్ష్‌ 31 పరుగులు చేసారు. మిగిలిన బ్యాట్స్‌మెన్‌ విఫలమయ్యారు. శ్రీలంక జట్టులో కెప్టెన్‌ సంగక్కర 49 పరుగులు చేసాడు. మలింగ 48 బంతుల్లో 56 పరుగులు చేసి రనౌటయ్యాడు. తొలి వన్డే మ్యాచ్‌ ఆడిన ఆసీస్‌ బౌలర్‌ దోహర్తీ 46 పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు తీసుకున్నాడు.

Sunday, October 24, 2010

గోవా వన్డే రద్దు

 అనుకున్న దంతా అయింది. వర్షం భారత్‌, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఆదివారం నాడిక్కడ జరగాల్సిన మూడవ, చివరి వన్డేను బలి తీసుకుంది. శనివారం రాత్రి కురిసిన భారీ వర్షం కార ణంగా నెహ్రూ స్టేడియం మైదానం తడిసి ముద్దవడంతో మ్యాచ్‌ ఆడే పరిస్థితి లేదని అంపైర్లు బిల్లీ బౌడెన్‌, అమిష్‌ సహేబా నిర్ణయించారు. మధ్యాహ్నం 12.15 నిమి షాలకు మైదానాన్ని పరీక్షించిన అంపైర్లు ఒంటి గంటకు ఈ నిర్ణయానికి వచ్చారు. గోవా వన్డే మ్యాచ్‌ రద్దు కావడంతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను భారత్‌ 1-0తో కైవసం చేసుకుంది. టెస్టు సిరీస్‌తోపాటు వన్డే సిరీస్‌ను కూడా కోల్పోయిన ఆసీస్‌ భారత్‌లో ఒక్క మ్యాచ్‌లో కూడా విజయం సాధించకుండా రిక్తహస్తాలతో స్వదేశం తిరిగి ప్రయాణమైంది.

Wednesday, October 13, 2010

రెండవ టెస్టులో భారత్ ఘనవిజయం : సిరీస్ కైవశం


ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో భారత్‌ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. రెంటు టెస్టుల సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. ఏడు వికెట్ల నష్టానికి 202 పరుగులతో ఐదో రోజు ఆటను ప్రారంభించిన ఆసిస్‌ 21 పరుగులు చేసి ఆలౌటయింది. 207 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌ 3 వికెట్లను కోల్పోయి విజయాన్ని సాధించింది. పుజారా 72, సచిన్‌ 53, విజయ్‌ 37, డ్రావిడ్‌ 21 సెహ్వాగ్‌ 7 పరుగులు చేశారు. చిన్నస్వామీ స్టేడియంలో ఆస్ట్రేలియాపై భారత్‌కిది తొలి విజయం. ఈ విజయంతో సొంతగడ్డపై ఆస్ట్రేలియాను భారత్‌ 15వ సారి ఓడించింది.

Tuesday, October 12, 2010

బెంగళూరు టెస్ట్‌లో సచిన్ డబుల్ సెంచరీ


ఆస్ట్రేలియాతో ఇక్కడ జరుగుతున్న టెస్ట్‌లో భారత్ మాస్టర్స్ బ్యాట్స్‌మేన్ సచిన్ టెండూల్కర్ డబుల్ సెంచరీ చేశాడు. దీంతో కలుపుకొని సచిన్ తన కేరీర్'లో ఆరు డబుల్ సెంచరీలు చేశాడు. ఈ ఏడాది చేసిన రెండవ డబుల్ సెంచరీ ఇది. ఆస్ట్రేలియాపై రెండవ డబుల్ సెంచరీ.

Sunday, October 10, 2010

టెస్టుల్లో సచిన్‌ మరో ప్రపంచ రికార్డు


  టెస్టు క్రికెట్‌ చరిత్రలో భారత్‌ బ్యాట్స్‌మెన్‌ సచిన్‌ టెండూల్కర్‌ మరో ప్రపంచ రికార్డు సాధించాడు. టెస్టు మ్యాచ్లఓల 14 వేల పరుగులు చేసిన అరుదైన ఆటగాడిగా సచిన్‌ చరిత్రకెక్కాడు. సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో సచిన్‌ 14 వేల పరుగులు పూర్తి చేయడం విశేషం. దీంతో సచిన్‌ అభిమానలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Thursday, October 7, 2010

2010 ఐసిసి క్రికెటర్‌ సచిన్‌ టెస్టు క్రికెటర్‌ సెహ్వాగ్‌


మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ ఐసిసి క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డును గెలుచుకున్నాడు. బుధవారం నాడు బెంగళూరులో అవార్డులను ప్రకటించారు. సచిన్‌కు పీపుల్స్‌ ఛాయిస్‌ అవార్డు కూడా లభించింది. ఈ అవార్డును ఐసిసి ఈ సంవత్సరం కొత్తగా ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌ అభిమానులు ఐదుగురు క్రికెటర్ల జాబితా నుండి ఆన్‌లైన్‌లో సచిన్‌ను ఈ అవార్డుకు ఎన్నుకున్నారు. ఈ సంవత్సరం టెస్టు క్రీడాకారుని అవార్డును వీరేంద్ర సెహ్వాగ్‌ గెలుచుకున్నాడు. దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మన్‌ డివిల్లీర్స్‌ వన్డే క్రీడాకారుని అవార్డు కైవసం చేసుకున్నాడు. అతడికి సచిన్‌, షేన్‌ వాట్సన్‌, ర్యాన్‌ హారిస్‌ నుండి గట్టి పోటీ ఎదురైంది. ఓటింగ్‌ కాలంలో డివిల్లీర్స్‌ 16 వన్డే మ్యాచ్‌లు ఆడి 71.25 సగటుతో మొత్తం 855 పరుగులు చేసాడు. ఇందులో నాలుగు సెంచరీలు, నాలుగు అర్ధసెంచరీలున్నాయి. భారత్‌ ఈ సంవత్సర టెస్టు టీం అవార్డును, ఆసీస్‌ వన్డే టీం అవార్డును దక్కించుకున్నాయి. ఇంగ్లండ్‌ ఫాస్ట్‌బౌలర్‌ స్టీవెన్‌ ఫిన్‌ ఈ సంవత్సరపు ఐసిసి వర్థమాన క్రికెటర్‌ అవార్డును సొంతం చేసుకున్నాడు. 21 ఏళ్ల ఫిన్‌ ఓటింగ్‌ కాలంలో ఆరు టెస్టులు ఆడి 27 వికెట్లు తీసుకున్నాడు. ప్రముఖ అంపైర్‌ డేవిడ్‌ షెప్హర్డ్‌పేర నెలకొల్పిన పాకిస్తాన్‌ అంపైర్‌ అలీమ్‌ దర్‌కు లభించింది.
ఆయనకు ఈ అవార్డు లభించడం ఇది రెండోసారి. ఐసిసి అంపైర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డును ఆయన సొంతం చేసుకున్నాడు. హాల్‌ఆఫ్‌ ఫేమ్‌లో వెస్టిండీస్‌ మాజీ బౌలర్‌ జోయల్‌ గార్నర్‌కు చోటు దక్కింది. ఎల్‌జి- ఐసిసి అవార్డులను ప్రకటించడం ఇది ఏడోసారి. ఇంతకుముందు లండన్‌ (2004), సిడ్నీ (2005), ముంబయి (2006), జోహన్నెస్‌బర్‌ ్గ(2007, 2009), దుబారు (2008) నగరాల్లో ఈ అవార్డు ఉత్సవాలను నిర్వహించారు.ఐదుగురు సభ్యుల సెలెక్షన్‌ ప్యానెల్‌ ఏడు అవార్డులకు నామినేషన్లను ఖరారు చేసింది. ఈ ప్యానెల్‌కు క్లయివ్‌ లాయిడ్‌ ఛైర్మన్‌గా ఉన్నారు. రవిశాస్త్రి, ఆంగస్‌ ఫ్రేజర్‌, డంకన్‌ ఫ్లెచర్‌; మాథ్యూ హెడెన్‌ సభ్యులుగా ఉన్నారు.

Tuesday, October 5, 2010

తొలి టెస్టులో భారత్‌ ఘన విజయం

 హైదరాబాదీ సొగసరి బ్యాట్స్‌మెన్‌ మెన్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ మరోసారి సత్తా చూపాడు. ఆస్ట్రేలియాను ధీటుగా ఎదుర్కొని ఒంటిచేత్తో జట్టుకు విజయాన్ని అందించాడు. వెన్నునొప్పి భాదిస్తున్నా రన్నర్‌ సాయంతో బరిలోకి దిగి బట్టును విజయతీరాలకు చేర్చాడు. 73 పరుగులతో అజేయంగా నిలిచి ఆసీస్‌ ఆశలపై నీళ్లు చల్లాడు. ఐదో రోజు ఆట ప్రారంభించిన భారత్‌ 76 పరుగుల వద్ద జహీర్‌ఖాన్‌ అవుట్‌ అయ్యాడు. అ తరువాత బరిలోకి దిగిన వివిఎస్‌ లక్ష్మణ్‌ 73 పరుగుల చేశాడు. కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని 2 పరుగులు చేసి రనౌట్‌ అయ్యాడు. భజ్జీ 2, ఇషాంత్‌ శర్మ 31 పరుగులు చేశారు. చివరిలో లక్ష్మణ్‌ 73, ఓజా 5 పరుగులతో నాటౌట్‌గా మిగిలారు. ఆస్ట్రేలియా బౌలింగ్‌ను ధీటుగా ఎదుర్కొని జట్టుకు విజయాన్ని అందించాడు. రెండు టెస్టుల సిరీస్‌లో 1-0 తో భారత్‌ ముందంజలో ఉంది.

Thursday, September 9, 2010

రామానాయుడికి ఫాల్కే అవార్డు

సిని నిర్మాత మూవీ మొఘల్‌ డాక్టర్‌ దగ్గుబాటి రామానాయుడు దాదాసాహేబ్‌ఫాల్కే పురస్కారానికి ఎంపికయ్యారు. 2009 సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డును ప్రకటించింది. భారతీయ సినిమా రంగంలో ఎనలేని కృషి చేసినవారిని కేంద్ర ప్రభుత్వం ఈ పురస్కారంతో గౌరవిస్తుంది. అవార్డుకింద 10 లక్షల రూపాయలు, స్వర్ణ కమలం అందజేస్తారు. ఫాల్కే పురస్కారానికి ఎంపికను దేశంలోని అత్యంత ప్రముఖ వ్యక్తులతో కూడిన కమిటీ నిర్ణయిస్తుంది. అక్టోబర్‌లో జరుగనున్న జాతీయ సినిమా అవార్డుల ప్రదానోత్సవంలో రాష్ట్రపతి చేతుల మీదుగా రామానాయుడు ఫాల్కే అవార్డు అందుకోనున్నారు.

Thursday, September 2, 2010

వై.ఎస్‌.కు సినీ పరిశ్రమ నివాళి




దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి ప్రథమ వర్థంతి సందర్భంగా సినీ పరిశ్రమకు చెందిన పలువురు ఆయనకు నివాళులు అర్పించారు. హీరో శ్రీహరి, బైరవ చిత్ర నిర్మాత నట్టికుమార్‌లు పేద కళాకారులకు చీరలు పంపీణీ చేశారు.ఆ కార్యక్రమాలలో హీరో రాజశేఖర్‌, జీవిత పాల్గొన్నారు. వై. ఎస్‌ మృతి పట్ల రాష్ట్రానికి తీరని లోటని శ్రీహరి అన్నారు.

వైఎస్‌తో ఉన్న ఆత్మీయత గొప్పంది : రోశయ్య

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఉన్న అనుబంధం, ఆత్మీయత చాలా గొప్పదని ముఖ్యమంత్రి రోశయ్య అన్నారు. వైఎస్‌ ప్రధమ వర్థంతి కార్యక్రమాలకు వెళ్లాలని ఉన్నా ఆరోగ్య కారణాల వల్ల వెళ్లలేకపోతున్నానని ఆవేధన వ్యక్తం చేశారు. ఆయన చేపట్టిన ప్రజాహిత కార్యక్రమాలు ప్రజల్లో ఎప్పుడూ పచ్చగానే ఉంటాయన్నారు. వైఎస్‌ మరణం ఊహించలేనిదని రోశయ్య అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు సీఎం ప్రగాఢ సానుభూతి తెలిపారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి మహోన్నత వ్యక్తి అని పేర్కొన్నాడు. ఆయన ప్రతి నిమిషం ప్రజల ఆవేధన గురించి మాట్లాడుతు ఉండేవారు. ఎవరొచ్చి అడిగినా లేదనటం ఆయనకు చేతకాదని ముఖ్యమంత్రి రోశయ్య గుర్తు చేసుకున్నారు.

Tuesday, August 31, 2010

స్పాట్‌ ఫిక్సింగ్‌

పాకిస్తాన్‌ క్రికెట్‌ జట్టు ఫిక్సింగ్‌ వివాదంలో పాల్పడింది. ఇంగ్లండ్‌ జట్టుతో నాలుగు టెస్టుల సిరీస్‌లోని లార్డ్స్‌ టెస్టులో ఈ స్పాట్‌ ఫిక్సింగ్‌ జరిగినట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. కెప్టెన్‌ భట్‌తో సహా మహ్మద్‌ ఆసిఫ్‌, మహ్మద్‌ అమీర్‌, కీపర్‌ ఆక్మల్‌ ఈ వ్యవహరంలో దోషులుగా ఉన్నారు. వీరితో పాటు మరో ముగ్గురు క్రీడాకారులు కూడా సంబంధం ఉండి ఉండవచ్చునని అనుమానం వ్యక్తం చేసింది. మహ్మద్‌ అసిఫ్‌, మహ్మద్‌ అమీర్‌ ఇద్దరు మజీద్‌ సూచనల మేరకు గురువారం, శుక్రవారం నాడు మూడు నోబాల్స్‌ వేస్తారని వెల్లడించింది. పాక్‌ బౌలర్లు ఉద్దేశపూర్వకంగానే మూడు నోబాల్స్‌ వేయాలని మజర్‌ పాకిస్తాన్‌ క్రీడాకారుల మధ్య రహస్య అంగీకారం కుదిరిందని పేర్కొంది.

అమితాబ్‌ సరసన శ్రీదేవి

తెలుగు ప్రేక్షకుల అతిలోక సుందరి...శ్రీదేవి. ఆ గుర్తింపు కేవలం ఒక్క తెలుగుకే పరిమితం కాలేదు. తనవైన అందం, అభినయంతో బాలీవుడ్‌ను సైతం దశాబ్దాలపాటు ఏలుకొంది. హిందీలో అగ్ర కథానాయకుల సరసన నటించి అలరించింది. భాషా భేదం లేకుండా అందరినీ కలగలిపి ఆకట్టుకున్న శ్రీదేవి బోనీకపూర్‌తో పెళ్లయ్యాక మాత్రం సినిమాలకు దూరమైంది. అప్పట్నుంచి ఆమె పునరాగమనం కోసం అభిమానులు ఎదురుచూస్తునే ఉన్నారు. బుల్లితెర ప్రేక్షకుల కోసం మధ్యలో ఒక ధారావాహికలో కనిపించి ముచ్చట తీర్చినా...వెండితెరపై కనిపించే ప్రయత్నమేదీ చేయలేదు. ఇదిగో, అదిగో...అని.

ఊరిస్తూనే ఆమె చేయబోయే చిత్రంపై స్పష్టమైన సంకేతాలేవీ వచ్చింది లేదు. అయితే ఆవిడ అభిమానులకు ఓ శుభవార్త. వెండితెరపై వెలిగేందుకు మరోసారి సిద్ధమవుతోంది. సినిమా మాత్రం తెలుగులో కాదు. ప్రస్తుతానికి హిందీలోనే. ఇంతకీ కథానాయకుడు ఎవరను కుంటున్నారా..! అమితాబ్‌ బచ్చన్‌. బాలీవుడ్‌ అంతా ఆయన్ని ఃబిగ్‌ బిః అని పిలుచుకుంటుందని సినీ అభిమానులకంతా తెలిసిందే. మరి అదే పేరుతో ఓ సినిమా రాబోతోంది. ఈ చిత్రానికి ఆర్‌.బల్కీ దర్శకత్వం వహిస్తున్నారు.

Sunday, August 22, 2010

ఎనిమిది వికెట్ల తేడాతో లంక ఘన విజయం


 టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్‌ 103 పరుగులకే అలౌట్‌ అయ్యింది. 104 లక్ష్యంతో దిగిన లంక 15.1 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి, 104 పరుగులు చేసి విజయం సాధించింది. జయవర్థన్‌ 33, దిల్షాన్‌ 35, పరుగులు చేసి అవుట్‌ అయ్యారు. సంగక్కర 13, తరంగ 12 పరుగులతో నాటౌట్‌గా మిగిలారు. భారత్‌ బ్యాట్‌ మెన్స్‌లో యువరాజ్‌ సింగ్‌ 38 పరుగులు చేసి టాప్‌ స్కోరుగా నిలిచాడు. మిగితా బ్యాట్స్‌మెన్‌లు రెండు అంకెల స్కోరు కూడా చేయలేదు. లంక బౌలర్లలో పెరారి 5, మలింగా , కులశేఖర్‌ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. మాథ్యస్‌ 1 వికెటు లభించింది. పెరారి మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ దక్కింది.