Sunday, October 24, 2010

గోవా వన్డే రద్దు

 అనుకున్న దంతా అయింది. వర్షం భారత్‌, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఆదివారం నాడిక్కడ జరగాల్సిన మూడవ, చివరి వన్డేను బలి తీసుకుంది. శనివారం రాత్రి కురిసిన భారీ వర్షం కార ణంగా నెహ్రూ స్టేడియం మైదానం తడిసి ముద్దవడంతో మ్యాచ్‌ ఆడే పరిస్థితి లేదని అంపైర్లు బిల్లీ బౌడెన్‌, అమిష్‌ సహేబా నిర్ణయించారు. మధ్యాహ్నం 12.15 నిమి షాలకు మైదానాన్ని పరీక్షించిన అంపైర్లు ఒంటి గంటకు ఈ నిర్ణయానికి వచ్చారు. గోవా వన్డే మ్యాచ్‌ రద్దు కావడంతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను భారత్‌ 1-0తో కైవసం చేసుకుంది. టెస్టు సిరీస్‌తోపాటు వన్డే సిరీస్‌ను కూడా కోల్పోయిన ఆసీస్‌ భారత్‌లో ఒక్క మ్యాచ్‌లో కూడా విజయం సాధించకుండా రిక్తహస్తాలతో స్వదేశం తిరిగి ప్రయాణమైంది.

Wednesday, October 13, 2010

రెండవ టెస్టులో భారత్ ఘనవిజయం : సిరీస్ కైవశం


ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో భారత్‌ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. రెంటు టెస్టుల సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. ఏడు వికెట్ల నష్టానికి 202 పరుగులతో ఐదో రోజు ఆటను ప్రారంభించిన ఆసిస్‌ 21 పరుగులు చేసి ఆలౌటయింది. 207 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌ 3 వికెట్లను కోల్పోయి విజయాన్ని సాధించింది. పుజారా 72, సచిన్‌ 53, విజయ్‌ 37, డ్రావిడ్‌ 21 సెహ్వాగ్‌ 7 పరుగులు చేశారు. చిన్నస్వామీ స్టేడియంలో ఆస్ట్రేలియాపై భారత్‌కిది తొలి విజయం. ఈ విజయంతో సొంతగడ్డపై ఆస్ట్రేలియాను భారత్‌ 15వ సారి ఓడించింది.

Tuesday, October 12, 2010

బెంగళూరు టెస్ట్‌లో సచిన్ డబుల్ సెంచరీ


ఆస్ట్రేలియాతో ఇక్కడ జరుగుతున్న టెస్ట్‌లో భారత్ మాస్టర్స్ బ్యాట్స్‌మేన్ సచిన్ టెండూల్కర్ డబుల్ సెంచరీ చేశాడు. దీంతో కలుపుకొని సచిన్ తన కేరీర్'లో ఆరు డబుల్ సెంచరీలు చేశాడు. ఈ ఏడాది చేసిన రెండవ డబుల్ సెంచరీ ఇది. ఆస్ట్రేలియాపై రెండవ డబుల్ సెంచరీ.

Sunday, October 10, 2010

టెస్టుల్లో సచిన్‌ మరో ప్రపంచ రికార్డు


  టెస్టు క్రికెట్‌ చరిత్రలో భారత్‌ బ్యాట్స్‌మెన్‌ సచిన్‌ టెండూల్కర్‌ మరో ప్రపంచ రికార్డు సాధించాడు. టెస్టు మ్యాచ్లఓల 14 వేల పరుగులు చేసిన అరుదైన ఆటగాడిగా సచిన్‌ చరిత్రకెక్కాడు. సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో సచిన్‌ 14 వేల పరుగులు పూర్తి చేయడం విశేషం. దీంతో సచిన్‌ అభిమానలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Thursday, October 7, 2010

2010 ఐసిసి క్రికెటర్‌ సచిన్‌ టెస్టు క్రికెటర్‌ సెహ్వాగ్‌


మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ ఐసిసి క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డును గెలుచుకున్నాడు. బుధవారం నాడు బెంగళూరులో అవార్డులను ప్రకటించారు. సచిన్‌కు పీపుల్స్‌ ఛాయిస్‌ అవార్డు కూడా లభించింది. ఈ అవార్డును ఐసిసి ఈ సంవత్సరం కొత్తగా ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌ అభిమానులు ఐదుగురు క్రికెటర్ల జాబితా నుండి ఆన్‌లైన్‌లో సచిన్‌ను ఈ అవార్డుకు ఎన్నుకున్నారు. ఈ సంవత్సరం టెస్టు క్రీడాకారుని అవార్డును వీరేంద్ర సెహ్వాగ్‌ గెలుచుకున్నాడు. దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మన్‌ డివిల్లీర్స్‌ వన్డే క్రీడాకారుని అవార్డు కైవసం చేసుకున్నాడు. అతడికి సచిన్‌, షేన్‌ వాట్సన్‌, ర్యాన్‌ హారిస్‌ నుండి గట్టి పోటీ ఎదురైంది. ఓటింగ్‌ కాలంలో డివిల్లీర్స్‌ 16 వన్డే మ్యాచ్‌లు ఆడి 71.25 సగటుతో మొత్తం 855 పరుగులు చేసాడు. ఇందులో నాలుగు సెంచరీలు, నాలుగు అర్ధసెంచరీలున్నాయి. భారత్‌ ఈ సంవత్సర టెస్టు టీం అవార్డును, ఆసీస్‌ వన్డే టీం అవార్డును దక్కించుకున్నాయి. ఇంగ్లండ్‌ ఫాస్ట్‌బౌలర్‌ స్టీవెన్‌ ఫిన్‌ ఈ సంవత్సరపు ఐసిసి వర్థమాన క్రికెటర్‌ అవార్డును సొంతం చేసుకున్నాడు. 21 ఏళ్ల ఫిన్‌ ఓటింగ్‌ కాలంలో ఆరు టెస్టులు ఆడి 27 వికెట్లు తీసుకున్నాడు. ప్రముఖ అంపైర్‌ డేవిడ్‌ షెప్హర్డ్‌పేర నెలకొల్పిన పాకిస్తాన్‌ అంపైర్‌ అలీమ్‌ దర్‌కు లభించింది.
ఆయనకు ఈ అవార్డు లభించడం ఇది రెండోసారి. ఐసిసి అంపైర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డును ఆయన సొంతం చేసుకున్నాడు. హాల్‌ఆఫ్‌ ఫేమ్‌లో వెస్టిండీస్‌ మాజీ బౌలర్‌ జోయల్‌ గార్నర్‌కు చోటు దక్కింది. ఎల్‌జి- ఐసిసి అవార్డులను ప్రకటించడం ఇది ఏడోసారి. ఇంతకుముందు లండన్‌ (2004), సిడ్నీ (2005), ముంబయి (2006), జోహన్నెస్‌బర్‌ ్గ(2007, 2009), దుబారు (2008) నగరాల్లో ఈ అవార్డు ఉత్సవాలను నిర్వహించారు.ఐదుగురు సభ్యుల సెలెక్షన్‌ ప్యానెల్‌ ఏడు అవార్డులకు నామినేషన్లను ఖరారు చేసింది. ఈ ప్యానెల్‌కు క్లయివ్‌ లాయిడ్‌ ఛైర్మన్‌గా ఉన్నారు. రవిశాస్త్రి, ఆంగస్‌ ఫ్రేజర్‌, డంకన్‌ ఫ్లెచర్‌; మాథ్యూ హెడెన్‌ సభ్యులుగా ఉన్నారు.

Tuesday, October 5, 2010

తొలి టెస్టులో భారత్‌ ఘన విజయం

 హైదరాబాదీ సొగసరి బ్యాట్స్‌మెన్‌ మెన్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ మరోసారి సత్తా చూపాడు. ఆస్ట్రేలియాను ధీటుగా ఎదుర్కొని ఒంటిచేత్తో జట్టుకు విజయాన్ని అందించాడు. వెన్నునొప్పి భాదిస్తున్నా రన్నర్‌ సాయంతో బరిలోకి దిగి బట్టును విజయతీరాలకు చేర్చాడు. 73 పరుగులతో అజేయంగా నిలిచి ఆసీస్‌ ఆశలపై నీళ్లు చల్లాడు. ఐదో రోజు ఆట ప్రారంభించిన భారత్‌ 76 పరుగుల వద్ద జహీర్‌ఖాన్‌ అవుట్‌ అయ్యాడు. అ తరువాత బరిలోకి దిగిన వివిఎస్‌ లక్ష్మణ్‌ 73 పరుగుల చేశాడు. కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని 2 పరుగులు చేసి రనౌట్‌ అయ్యాడు. భజ్జీ 2, ఇషాంత్‌ శర్మ 31 పరుగులు చేశారు. చివరిలో లక్ష్మణ్‌ 73, ఓజా 5 పరుగులతో నాటౌట్‌గా మిగిలారు. ఆస్ట్రేలియా బౌలింగ్‌ను ధీటుగా ఎదుర్కొని జట్టుకు విజయాన్ని అందించాడు. రెండు టెస్టుల సిరీస్‌లో 1-0 తో భారత్‌ ముందంజలో ఉంది.