Monday, December 20, 2010

నాగవల్లి

 వెంకటేష్‌ హీరోగా సినిమా వస్తోందంటే, ఫ్యామిటీ ఎంటర్‌టైనర్‌నే ప్రేక్షకులు ఎక్కువగా ఆశిస్తుంటారు.సాఫ్ట్‌ రోల్సోలో ఎక్కువగా కన్నించడానికి ఇష్టపడే వ్యక్తి వెంకటేష్‌, ఈ సారి వెరైటీ కాన్సెప్ట్‌తో .. అదీ రజనీకాంత్‌ గతంలో చేసిన ' చంద్రముఖి' సినిమా సీక్వెల్‌లో నటిస్తున్నాడంటే సహజంగానే ప్రేక్షకుల్లో ఆసక్తి కాస్త ఎక్కువగానే వుంటుంది.
ఐదుగురు హీరోయిన్లతో వెంకీ
అనుష్క, రిచా, కమిలిన, శ్రద్దాదాస్‌, పూనమ్‌కౌర్‌
సైకాలజిస్ట్‌గానూ, మహారాజ నాగభైరవగానూ వెంకటేష్‌ మొదటిసారి నెగెటివ్‌ రోల్‌ పోషించిన వెంకి, నాగబైరవగా ప్రేక్షకుల్ని ఓ రేంజ్‌లో మెప్పించడం ఖాయం.
అనుష్క ; ' అరుంధతి' తర్వాత అనుష్క ఆ స్థాయిలో నటనకు ప్రదర్శించేందుకు ఛానొచ్చిన సినిమా ' నాగవల్లి' తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది.
శ్రద్దాదాస్‌  ;తన నటనతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. కీలక సన్నివేశంలో శ్రద్దాదాస్‌ తన పెర్ఫామెన్స్‌తో మెస్మరైజ్‌ చేసింది.
కమలినీ ముఖర్జీ ; పేషెంట్‌టా కన్నించడం బాలేదు.... అయితే డాన్స్‌ కాస్ట్యూమ్స్‌లో చాలా బావుంది.
రిచా గంగోపాధ్యాయ ; అందంగా వుంది. పూనమ్‌కౌర్‌ది తక్కువ పాత్రే అయినా తళుక్కువ మెరిసింది.
రేటింగ్‌లో నాగవల్లి 3.25/5 సాధించింది.

అనుష్క , త్రిష మధ్య అధిపత్య పోరు

 అనుష్క కథానాయాకగా నటించిన రగడ, త్రిష నటించిన మన్మథ బాణం డిసెంబర్‌ 23న విడుదల కానున్నాయి. మన్మథ బాణం అనువాద చిత్రమే అయినా కానీ కమల్‌హాసన్‌ కథానాయకుడు కావడంతో ఈ చిత్రంపై కూడా అంచానాలు భారీగా ఉన్నాయి. త్రిష ' మన్మథ బాణం' తో హిట్టు కొట్టి తెలుగు, తమిళనాడుల్లో సత్తా చాటాలని త్రిష ఉవ్విళ్లూరుతోంది. మరోవైపు ' రగడ' పై కూడా అంచనాలు ఘనంగానే ఉన్నాయి. టైటిల్‌ దగ్గర్నుంచి పాటల వరకు అంతా మాస్‌ మయమైన ఈ చిత్రం దుమ్ము రేపుతుందని ట్రేడ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ' మన్మథ బాణం ' చిత్రాన్ని ' రగడ'తో సమానంగా విడుదల చేయాడానికి ఆ చిత్ర నిర్మాతలు కూడా ప్లాన్‌ చేసుకోవడంతో ఈ రెండింటి మధ్య పోటీ తప్పదనిపిస్తోందిసో .... రెండు సినిమాలతో ఇద్దరు స్టార్‌ హీరోయిన్లు అమీ తుమీ తేల్చుకోనున్న ఈ సందర్బంలో విజయం ఎవరిని వరిస్తుందనేది తేరపై చూడాలి.