Monday, June 13, 2016

చిరు చిందేస్తే..!


వెండితెరపై చిరంజీవి స్టెప్పేసి చాలా కాలమైంది. ‘బ్రూస్‌లీ’లో చిరు కనిపించినా అది పోరాట సన్నివేశమే. చిరు స్టెప్పేస్తే చూడాలని ఆయన అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఆ నిరీక్షణకు తెరదించుతూ చిరంజీవి కాలు కదిపారు. అయితే సినిమా కోసం కాదు. ఓ అవార్డు వేడుకలో! ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఓ ప్రైవేటు కార్యక్రమంలో చిరంజీవి స్టెప్పులేసి ఆహూతుల్ని అలరించారు. ‘గ్యాంగ్‌ లీడర్‌’లోని ‘చికు చికు చైలం..’ పాటకు చిరు రిథమిక్‌గా చెలరేగిపోవడం అందరినీ ఆకట్టుకొంది. చిరుతో పాటు శ్రీకాంత్‌, సాయిధరమ్‌తేజ్‌, సునీల్‌, నవదీప్‌ చిందులేశారు. త్వరలోనే చిరంజీవి తన 150వ చిత్రంగా ‘కత్తి’ రీమేక్‌తో తెరపైకి రాబోతున్నారు. ఆ సినిమాలో వేయబోయే స్టెప్పులకు ఇది టీజర్‌ అన్నమాట! ఇదే వేదికపై అందాల భామలు తమన్నా, రకుల్‌ప్రీత్‌ సింగ్‌, రాశీ ఖన్నా, శ్రియ డ్యాన్స్‌లతో అలరించారు.
కథానాయికలు శ్రీయ, తమన్నా, రకుల్ ప్రీత్‌సింగ్, రాశీ ఖన్నా, ప్రగ్యా జైశ్వాల్, ముమైత్‌ఖాన్ ఆటాపాటా ఈ వేడుకకు హైలైట్‌గా నిలిచాయి. ఆసక్తికరంగా జరిగిన ఈ అవార్డు వేడుకను మాటీవీలో ఈ నెల 25, 26 తేదీల్లో సాయంత్రం ప్రసారం చేయనున్నట్లు చానల్ ప్రతినిధులు తెలిపారు.

హీరోయిన్‌కు విడాకులు మంజూరు


బాలీవుడ్ లో ఓ జంట విడిపోయింది. ప్రముఖ బాలీవుడ్ నటి కరిష్మాకపూర్ ఆమె భర్త సంజయ్ కపూర్ విడిపోయారు. సోమవారం ముంబయి ఫ్యామిలీ కోర్టు వారికి విడాకులు మంజూరు చేసింది. దీంతో వారిద్దరు చట్టబద్దంగా విడిపోయారు. 2003లో వివాహం చేసుకున్న ఈ జంట గత రెండేళ్ల కిందటే పలుమార్లు ఘర్షణలు పడిన విషయం తెలిసిందే.
తామిద్దరం ఇక కలిసి ఉండటం ఏమాత్రం సాధ్యం కాదన్న నిర్ణయం మేరకు 2014లో విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. అప్పటి నుంచి పలు మలుపులు తీసుకున్న ఈ వివాదం చివరకు సోమవారం ఓ కొలిక్కి వచ్చింది. వీరికి సమైరా, కియాన్ అనే ఇద్దరు చిన్నారులు ఉండగా వారి సంరక్షణ బాధ్యతలు కరిష్మా చూసుకోనుంది. రెండు వీకెండ్ లలో మాత్రం సంజయ్ కపూర్ వద్దకు వెళ్లే అవకాశం ఉంటుంది. కరిష్మా కపూర్ మరో ప్రముఖ బాలీవుడ్ నటి కరీనా కపూర్ వాళ్ల సోదరి అనే విషయం తెలిసిందే.

ఈ మొబైల్‌ వంచితే.. చేతి గడియారం

నేటి ఆధునిక యుగంలో సాంకేతిక ఎప్పటికప్పుడు కొత్త రూపు సంతరించుకుంటోంది. వినూత్న ఆవిష్కరణలతో మానవుని అవసరాలను తీర్చుతోంది. ఇక ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్‌ వాడని వారు లేరంటే అతిశయోక్తి కాదు. ఇప్పుడు అది మరింత స్మార్ట్‌గా మన ముందుకు రాబోతోంది. ఇప్పటిదాకా మనం ఫోన్‌ను చేతితో పట్టుకుని మాత్రమే ఉపయోగించాం. కానీ త్వరలో చేతికి వాచీలా ధరించి ఉపయోగించుకునేలా ఓ కొత్త మొబైల్‌ రూపుదిద్దుకుంటోంది.

ఇటీవల శాన్‌ఫ్రాన్సికోలో నిర్వహించిన ‘టెక్‌ వరల్డ్‌-2016’లో లెనోవా సంస్థ మడతపెట్టుకోగలిగే మొబైల్‌, ట్యాబ్‌లను ప్రదర్శించింది. ‘సీ-ప్లస్‌’గా పిలుస్తున్న ఈ మొబైల్‌ను అవసరమైనప్పుడు వాచీలా చేతికి ధరించి ఉపయోగించుకోవచ్చు. అయితే ప్రస్తుతం ఇది ప్రయోగ దశలోనే ఉంది. దీన్ని మార్కెట్లోకి విడుదల చేసేందుకు మరికొంత సమయం పట్టవచ్చు.