Monday, December 26, 2016

అందుకు టైం కలసి రావాలి

పెళ్లికి నేను తయారయ్యాను కానీ అంటున్నారు అందాల తార అనుష్క. ఈ తరం నటీమణుల్లో లేడీ ఓరియెంటెడ్‌ కథా చిత్రాల నటిగా పేరు తెచ్చుకున్న మొదటి నటి అనుష్క అని పేర్కొనవచ్చు. అరుంధతి చిత్రంలో తన అట్టహాస నటన అంత సులభంగా మర్చిపోలేం. అదే విధంగా శత్రుసేనను తన ఖడ్గంతో చీల్చి చెండాడిన వీర వనిత రుద్రమదేవిగా అభినయం గుర్తుండి పోతుంది. 35 ఏళ్ల పరువాల ఈ కాంత ఇంకా జతను నిర్ణయించుకోలేదు. అయితే త్వరలో అనుష్క ఇంట పెళ్లి భాజాలు మోగనున్నాయని, కాబోయే వరుడి ఎంపిక కూడా జరిగిపోయిందనే ప్రచారం జోరుగా సాగుతోంది. అదే విధంగా ఈ ఏడాది అనుష్క నటించిన ఒక్క చిత్రం కూడా తెరపైకి రాలేదు. ఈ విషయాల గురించి ఈ యోగా సుందరి ఎలా స్పందించారో చూద్దాం.

నా పెళ్లి ఎప్పుడని చాలా మంది చాలా సార్లు అడుగుతున్నారు. కొందరైతే పెళ్లి కొడుకు నిశ్చయం అయ్యాడు, బెంగళూర్‌కు చెందిన వ్యాపార వేత్తను అనుష్క వరించనుంది. వచ్చే ఏడాది పెళ్లి చేసుకోనున్నాను అనే దుమారం రేపుతున్నారు. నిజానికి పెళ్లికి నేను తయరయ్యాను. అయితే అందుకు కాలం కలిసి రావాలిగా. ప్రస్తుతం చేతి నిండా చిత్రాలున్నాయి. కథానాయకికి ప్రాముఖ్య ఉన్న కథా చిత్రాలనే ఎంపిక చేసుకుని నటిస్తున్నాను. గత ఏడాది మంచి కథా చిత్రాల్లో నటించాను. బాహుబలి చిత్రంలో నా పాత్ర ప్రశంసలు అందుకుంది. ఇడుప్పళగి చిత్రం కోసం బరువు భారీగా పెంచి నటించాను. రుద్రమదేవి చిత్రం మంచి ప్రేక్షకుల ఆదరణ పొందింది. ఇక ఈ ఏడాది నా చిత్రాలేవీ విడుదల కాలేదు. ఇది కాస్త నిరాశ పరచే అంశమే. అయితే వచ్చే ఏడాది వరసగా మూడు చిత్రాలు తెరపైకి రానున్నాయి. బాహుబలి–2, ఎస్‌–2, నమో వెంకటే«శాయ చిత్రాల్లో ప్రాముఖ్యత ఉన్న పాత్రల్లో నటించాను. ఇది సంతోషకరమైన విషయం. బాహుబలి–2లో నేను పోషించిన దేవసేన పాత్ర చాలా కొత్తగా ఉంటుంది. ఓం వెంకటేశాయ భక్తిరస కథా చిత్రం.ఈ చిత్రాల్లో నన్ను వైవిధ్యభరిత పాత్రల్లో చూడవచ్చు.

అక్కడ రాత్రి.. ఇక్కడ పగలు!

 అమ్మ మధు చోప్రా, నిర్మాత వసు భగ్నాని కూతురు దీప్షికా దేశ్‌ముఖ్‌లతో కలసి ప్రియాంకా చోప్రా నిర్మించిన పంజాబీ చిత్రం ‘సర్వన్న్‌’. ఈ సినిమా షూటింగ్‌ జరిగినన్ని రోజులూ ‘క్వాంటికో’ టీవీషో, ‘బేవాచ్‌’ సినిమా కోసం ప్రియాంక విదేశాల్లోనే ఉన్నారు. అయితే.. నిర్మాణ బాధ్యతలన్నీ మిగతా ఇద్దరిపై వేయలేదట!
మనకూ, అమెరికాకీ సుమారు 11 గంటల వ్యత్యాసం ఉంది. అమెరికాలో పగలంతా షూటింగ్‌ చేసి, రాత్రి హోటల్‌ రూమ్‌కి చేరుకునేసరికి ఇండియాలో పగలు అవుతుంది. అప్పుడు ప్రియాంక ఫోనులో ‘సర్వన్న్‌’ టీమ్‌కి సలహాలిస్తూ, పనులను పర్యవేక్షించేవారట! అలా.. పగలు నటిగా.. రాత్రి నిర్మాతగా కష్టపడి పనిచేశానన్నారు.