Monday, April 20, 2015

పవన్‌ కల్యాణ్‌ను కలిసిన శ్రీజ కుటుంబం

                 తీవ్ర అనారోగ్యం నుంచి బయటపడిన చిన్నారి శ్రీజ తన అభిమాన నటుడు పవన్‌కల్యాణ్‌ కలుసుకుంది. సోమవారం జూబ్లీహిల్స్‌లోని జనసేనపార్టీ కార్యాలయంలో పవన్‌ను చిన్నారి శ్రీజ, ఆమె కుటుంబసభ్యులు కలుసుకున్నారు. మూడు నెలల క్రితం ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన శ్రీజ ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. ఒకానొక దశలో శ్రీజ బతకడం కష్టమని వైద్యులు తేల్చేశారు.
            ఈ క్రమంలో అభిమాన నటుడు పవన్‌ను కలవడం శ్రీజ చివరి కోరిక అని తెలుసుకున్న ‘‘మేక్‌ ఎ విష్‌’’ ఫౌండేషన్‌ కార్యకర్తలు ఆ విషయాన్ని పవన్‌కు తెలిపారు. దీనిపై స్పందించిన పవన్‌ ఖమ్మం వెళ్లి ఆస్పత్రిలో చావుబతుకుల్లో ఉన్న శ్రీజను పరామర్శించారు. తన అభిమాన నటుడు పవన్‌కల్యాణ్‌ వచ్చి పలకరించడంతో శ్రీజ ఆరోగ్యం మెరుగుపడింది. దాదాపు నెలన్నర చికిత్స తర్వాత పూర్తిగా కోలుకుంది.
                         ఆరోగ్యం కుదుట పడిన తర్వాత హైదరాబాద్‌ తీసుకురావాలని ఆనాడే శ్రీజ తల్లిదండ్రులకు పవన్‌ చెప్పారు. ఈ క్రమంలో పూర్తిగా కోలుకున్న శ్రీజను తీసుకుని ఆమె తల్లిదండ్రులు ఈరోజు పవన్‌ను కలిశారు. దాదాపు రెండు గంటల పాటు పవన్‌తో శ్రీజ భేటీ అయ్యారు. అభిమాన నటుడితో మాట్లాడిన తర్వాత శ్రీజ ఎంతో ఉత్సాహంగా కనిపించింది.

Thursday, April 9, 2015

'సన్నాఫ్ సత్యమూర్తి' రివ్యూ

                    విరాజ్ ఆనంద్ (అల్లు అర్జున్) సన్ ఆఫ్ సత్యమూర్తి‌గా పరిచయమవుతాడు. సత్యమూర్తి పాత్ర ను ప్రకాష్ రాజ్ పోషించారు. సత్యమూర్తి ఒక పెద్ద బిజినెస్ మాన్. అకస్మాత్తుగా సత్యమూర్తి మరణిస్తాడు. సత్యమూర్తి మరణంతో అతని కుటుంబం 300 కోట్ల అప్పులతో చాలా కష్టాలకు లోనవుతుంది. మెల్లగా అతని కుటుంబ సభ్యులు అందరు కుటుంబానికి దూరంగా వెళ్ళిపోతారు. ఆనంద్‌కి సహాయం చేసే వారు కూడా ఉండరు. చివరకు ఆనంద్ కి కాబోయే భార్య అధ శర్మ కూడా వదిలేసి వెళ్ళిపోతుంది.

             ల్లిని, వదిన, బ్రదర్ ను తీసుకొని చిన్నఇంటికి మారాడు. ఏదో ఓ ఉద్యోగం చేయాలి కాబట్టి శ్రియాస్ మీడియా అనే ఈవెంట్ మేనేజ్ మెంట్ కంపెనీలో చేరి ఓ పెళ్లి చేయడానికి వెళతాడు. ఆ పెళ్లి ఎవరిదో కాదు... తనతో ఎంగేజ్ మెంట్ అయిన తర్వాత కాదని వెళ్లిపోయిన పల్లవి క్యారెక్టర్ చేసిన అదాశర్మది. అక్కడే సుబ్బలక్ష్మి అలియాస్ సమీరా అనే పాత్ర పోషించిన సమంతాతో హీరో విరాజ్ ఆనంద్ అదే మన బన్నీలవ్ లో పడతాడు.
సుబ్బలక్ష్మి తండ్రి సాంబశివరావు (రాజేంద్రప్రసాద్) బన్నీకి ఓ చాలెంజ్ విసురుతాడు. దేవరాజ్ (ఉపేంద్ర) దగ్గర ఉన్న తన 8000 గజాల స్థలం పేపర్స్ తీసుకొస్తే కూతురిని ఇచ్చి పెళ్లి చేస్తా అంటాడు. సరే అని హీరో తమిళనాడు వెళతాడు. దేవరాజ్ ను ఓసారి బన్నీ కాపాడుతాడు. దీంతో స్థలం పేపర్స్ ఇస్తానంటాడు... బట్..తన చెల్లెలు వల్లి (నిత్యామీనన్)ని పెళ్లి చేసుకోమని అడుగుతాడు. వల్లికి పెళ్లి ఇష్టం లేదు. 


                 చివరికి బన్నీ ఏం చేశాడు. ఆ పెళ్లి నుంచి తప్పించుకొని స్థలం పేపర్స్ ఎలా సంపాదించాడు. తండ్రిని తూలనాడిన రాజేంద్రప్రసాద్ కు ఎలా బుద్ది చెప్పాడన్నదే మిగిలిన కథ.

                 ప్లస్ పాయింట్స్: అల్లు అర్జున్ - పాటలు - సమంతా - ఉపేంద్ర - చిన్నట్విస్ట్ - కుటుంబ సెంటిమెంట్
మైనస్ పాయింట్స్: స్టొరీ - సెకండ్ హాఫ్ - ఎడిటింగ్ - కామెడీ లేక పోవడం


 ఫైనల్ గా :
               
సత్యమూర్తి లాంటి ఫ్యామిలీ డ్రామాలు చాలా తక్కువగా వస్తుంటాయి. అందునా... అల్లు అర్జున్ లాంటి మాస్ హీరోలు ఇలాంటి కథలు చేయడానికి ఒప్పుకోరు. అలాంటిది విలువలే ఆస్తి అనే ట్యాగ్ లైన్ తో వచ్చిన సత్యమూర్తిని ఓసారి చూడొచ్చు. దర్శకుడు పూర్తి న్యాయం చేయలేకపోయినా... అడ్జస్ట్ అవ్వడం మనకు అలవాటే కాబట్టే ఫ్యామిలీతో కలిసి చూసెయ్యెచ్చు.

Tuesday, April 7, 2015

ఆరంభం అదిరె ఐపీఎల్


  కళ్ల్లుమిరుమిట్లు గొలిపేలా విద్యుద్దీపకాంతులు.. వాటిని చిన్నబుచ్చుకునేలా చేస్తూ బాలీవుడ్ ముగ్ధ అనుష్క శర్మ నృత్యవిన్యాసం.. ఆపై ఫర్హాన్ అక్తర్, హృతిక్ రోషన్ స్టెప్పులు.. మధ్య మధ్యలో హోస్ట్ సైఫ్ అలీఖాన్ మాటల విన్యాసాలు.. ఇలా సాల్ట్‌లేక్ వేదికగా మంగళవారం సాగిన ఐపీఎల్-8 ప్రారంభోత్సవ కార్యక్రమం గ్రాండ్ సక్సెస్ అయింది. ఐపీఎల్ ఓపెనింగ్‌షోను వరుణుడు జల్లులు కురిపించి ఆశీర్వదిస్తే, ఆ తర్వాత బాలీవుడ్ స్టార్ల నృత్యజల్లు సాల్ట్‌లేక్ స్టేడియాన్ని తడిపి ముద్దచేసింది. బాలీవుడ్ యువహీరో షాహిద్ కపూర్ డ్యాన్స్ షో ప్రారంభోత్సవానికి నాంది వాక్యం పలికింది. అప్పటిదాకా వరుణుడి ఆటంకంతో నిరాశపడిన ప్రేక్షకులు కమీనే మూవీలో పాటపై ఎనర్జిటిక్ స్టెప్పులతో షాహిద్ బృందం చేసిన ప్రదర్శనతో ఫుల్‌జోష్‌లోకొచ్చారు. ఇక ఆ తర్వాత పొట్టి దుస్తుల్లో అనుష్క శర్మ వేసిన స్టెప్పులకైతే సాల్ట్‌లేక్ స్టేడియం ఈలల మోతతోహోరెత్తిపోయింది. ఫర్హాన్ అక్తర్ బ్యాండ్ బాజా అయితే రాక్ ఆన్ అంటూ కార్యక్రమాన్ని ఒకస్థాయికి తీసుకెళ్లింది.