Sunday, January 16, 2011

ఒకటి - ఒకటి సమానం

భారత్‌, దక్షిణాఫ్రికా మద్య జరుగుతున్న ఐదు వన్డే సిరీస్‌లో 1-1 సమానంగా ఉన్నాయి. తొలి వన్డేలో దక్షిణాఫ్రికా విజయం సాధించింది. ఇంకా రెండో వన్డేలో భారత్‌ విజయం సాధించింది. తొలి వన్డేలో అటు బ్యాటింగ్‌లో, ఇటు బౌలింగ్‌లో సౌతాఫ్రికా పైచెయి సాధించింది. ఇంకా రెండో వన్డేలో బారత్‌ 190 పరుగులకే అలౌట్‌ అయ్యింది. దీనికి బదులు సౌతాఫ్రికా 189 పరుగులు చేసింది. స్మిత్‌ 77 పరుగులు చేసి టాప్‌ స్కోరుగా నిలిచాడు. భారత్‌ బౌలర్లలు విజృబించి మ్యాచ్‌ విజయం సాదించారు. ముఖ్యంగా మునాఫ్‌ పటేల్‌ నాలుగు వికెట్లు తీసి మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ తీసుకున్నాడు. భారత్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ప్రారంభించింది. మురళీ విజరు 16, సచిన్‌ 24, విరాట్‌ కోహ్లీ 22, యువరాజ్‌ సింగ్‌ 53, ధోని 38, రైనా 11, రోహిత్‌ శర్మ 9, హర్భజన్‌ సింగ్‌ 3, ఖాన్‌ 0, నెహ్రా 6 పరుగులు చేశారు. మొదటి వన్డే మ్యాచ్‌లో విరాట్‌ కోహ్లీ అర్థ సెంచరీ చేశాడు. ఇంకా రెండో వన్డేలో యువరాజ్‌ సింగ్‌ అర్థ సెంచరీ చేసి టాప్‌ స్కోరుగా నిలిచాడు. మూడో వన్డేలో అర్థ సెంచరీ లేక సెంచరీ ? ఈసారి వంతు ఎవరిది. రైనా, రోహిత్‌ శర్మ, దోని, విజరు విలలో ఎవరు ?

తీర్పు మార్పు ....

 ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా మద్య జరుగుతున్న ఏడు వన్డే సిరీస్‌లో మొదటి వన్డేలో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా విజయం సాధించింది. టెస్టు సిరీస్‌, టి20 మ్యాచ్‌ కోల్పోయిన ఆస్ట్రేలియా జట్టు వన్డే సిరీస్‌లో రుచి చూపించింది. వాట్సన్‌ తన సత్తా వన్డేలో చూపించాడు. వాట్సన్‌ 150 బంతులలో 4 సిక్స్‌లు, 12 ఫోర్లు సహాయంతో 161 పరుగులు చేసి నాటౌట్‌గా ఉన్నాడు. తొలి వన్డేలో ఇంగ్లండ్‌కు ఆస్ట్రేలియా షాక్‌ ఇచ్చింది.