Saturday, February 19, 2011

వీరేంద్రుడి విరాట్‌ విశ్వసరూపం


టైటిల్‌ ఫెవరెట్లలో ఒకటిగా బరిలోకి దిగిన భారత్‌ ప్రపంచకలో అదిరిపోయే ఆరంభమిచ్చింది. వీరేంద్ర సెహ్వాగ్‌ మెరుపులు, యువతేజం విరాట్‌ కోహ్లి పిడుగులతో మొదట బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత ఓరర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 370 పరుగులు చేసింది. 371 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లా పోరాట చూపినా, భారీ లక్షాఁ్న ఛేదించే ఆట తీరు లేకపోవడంతో... నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 283 పరుగులు చేసింది. దీంతో భారత్‌ 87 పరుగులు తేడాతో భారీ విజయం సాధించింది. బంగ్లా బ్యాట్స్‌మెన్లలో తమీమ్‌ ఇక్బాల్‌ 70, సారథి సకిబుల్‌ హసన్‌ 50 , ఇమ్రాన్‌ కాయాస్‌ 34, జునాయద్‌ సిద్ధిఖీ 37, రకీబుల్‌ హాసన్‌ 28, ముషఫికరం రహీం 25 పరుగులు చేశారు. కాగా భారత బౌలర్లలో మునాఫ్‌ పటేల్‌ నాలుగు వికెట్లు తీసుకున్నాడు. జహీర్‌ ఖాన్‌ రెండు, హర్భజన్‌ సింగ్‌, యూసుఫ్‌ పఠాన్‌ తలో వికెటు తీసుకున్నారు.
అంతకు ముందు సెహ్వాగ్‌, కోహ్లీ ధాటికి షేరే బంగ్లా జాతీయ స్టేడియంలో పరుగుల వరద పొంగిపొర్లింది. ప్రేక్షకులను ఆనందం పరవంలో ముంచెత్తింది. అదురు, బెదురు, ఎదురులేని రీతిలో ఆడిన సెహ్వాగ్‌ పరుగుల జడివాన కురిపించాడు. 14 ఫోర్లు, 5 సిక్సర్లతో బంగ్లా బౌలర్లపై ఏమాత్రం కనికరం చూపకుండా చితక్కొట్టాడు.అతనితో పాటు పోటాపోటీగా ఆడిన విరాట్‌ కోహ్లీ ప్రపంచకప్‌లో ఆడుతున్న తొలి మ్యాచ్‌లోనే సెంచరీతో కదం తొక్కారు.

No comments:

Post a Comment