అమితాబ్-హేమమాలిని జంటగా రూపొంది ఘన విజయం సాధించిన ‘సత్తే పె సత్తే’ చిత్రాన్ని సంజయ్‌దత్‌తో రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రంలో హేమమాలిని పాత్రకు విద్యాబాలన్‌ను ఎంపిక చేసినట్లు వార్తలొచ్చాయి.అయితే.. విద్యాబాలన్‌ను తామెప్పుడూ అనుకోలేదని, తొలుత నుంచి ఈ పాత్రకోసం ఐశ్వర్యను మాత్రమే తాము అనుకుంటూ వచ్చామని హీరో సంజయ్‌దత్ చెబుతున్నాడు.ఈ చిత్రానికి నిర్మాత కూడా అతనే. ఆరుగురు తమ్ముళ్లకు వదినగా ఐశ్వర్య అయితేనే బాగుంటుందని భావిస్తున్న సంజయ్‌దత్.. ఆమె డేట్స్ కోసం ఎన్ని రోజులైనా నిరీక్షించేందుకు తాను సిద్ధమేనంటున్నాడు. అటు ఐశ్వర్య కూడా ఈ ప్రాజెక్ట్‌లో నటించేందుకు సానుకూలంగా ఉన్నట్లు సమాచారం.కాబట్టి.. త్వరలోనే ఈ చిత్రం సెట్స్‌కు వెళ్లడం ఖాయం!
No comments:
Post a Comment