Sunday, December 26, 2010

మళ్లీ అదే కథ : భారత్‌ 183/6

 డర్బన్‌ : భారత్‌, దక్షిణాఫ్రికాల మధ్య జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లలో టాస్‌ గెలిచిన దక్షిణాఫ్రికా బౌలింగ్‌ ఎంచుకున్నది. తొలి రోజు భారత్‌ 183/6 పరుగులు చేసింది. హర్భజన్‌ సింగ్‌ 15, దోనీ 20 పరుగులుతో క్రీజులో ఉన్నారు. టాస్‌ ఓడి బ్యాటింగ్‌ దిగిన ధోనీ సేన ఆరు వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. భారత్‌ బ్యాటింగ్‌ తక్కువ స్కోరుకే పెవిలియన్‌ చేరుకున్నారు. గంభీర్‌ స్థానంలో వచ్చిన మురళీ విజరుతో సెహ్వాగ్‌ బ్యాటింగ్‌ ప్రారంభించారు. సెహ్వాగ్‌ 25, విజరు 19, ద్రవిడ్‌ 25, సచిన్‌ 13, లక్ష్మణ్‌ 38, పుజరా 19 పరుగులు చేసి అవుట్‌ అయ్యారు. భారత్‌ జట్టులో రెండు మార్పులు జరిగాయి. రైనా స్థానంలో పుజరా అలాగే గంభీర్‌ స్థానంలో మురళీ విజరు జట్టులో ఉన్నారు. ఇద్దరు 19 పరుగులు చేసి అవుట్‌ అయ్యారు. దక్షిణాఫ్రికా బౌలింగ్‌లో స్టెయాన్‌కు నాలుగు వికెట్లు తీయగా, తొత్సంబేకు రెండు వికెట్లు దక్కాయి.

No comments:

Post a Comment