Thursday, February 17, 2011

ఐపీఎల్‌-4 షెడ్యూల్‌ విడుదల


అత్యంత ప్రజాదరణ పొందిన ఐపీఎల్‌-4 టోర్నీ షెడ్యూల్‌ను ఐపీఎల్‌ పాలకమండలి బుధవారం ఇక్కడ విడుదల చేసింది. అయితే దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్న దృష్టా ఇంకా దీనికి తుది ఆమోదాన్ని ఇవ్వలేదు. ఈ ఏడాది ఏప్రిల్‌ 8 నుంచి ప్రారంభం కానున్న ఈ టోర్నీలో తొలి మ్యాచ్‌ భారత క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని నేతృత్వం వహిస్తున్న డిఫెండింగ్‌ ఛాంపియన్‌ చెనై్న సూపర్‌ కింగ్స్‌, కోల్‌కత నైట్‌ రైడర్స్‌ జట్ల మధ్య చెనై్నలోని ఎమ్‌ఏ చిదంబరం స్టేడియంలో జరగనుంది. ఫైనల్‌ మ్యాచ్‌ మే 28 వ తేదీన టోర్నీ నిర్వహించబోయే కొన్ని నగరాల్లో ఎన్నికలు నిర్వహించబోతున్నందున్న ఆయా రాష్ట్రాల అధికారులను సంప్రదించిన అనంతరం. టోర్నీ షెడ్యూల్‌కు తుది అమోదాన్ని ఇస్తామని ఐపీఎల్‌ పాలకమండలి చైర్మన్‌ చిరాయు అమీన్‌ వెల్లడించారు.
74 మ్యాచులు: టోర్నీలో మొత్తం 74 మ్యాచులను నిర్వహించనున్నారు. వీటిన నిర్వహణ కోసం వివిధ నగరాల్లో ఎంపిక చేసిన 13 వేదికలను ఎంపిక చేశారు. ఈ మ్యాచులన్నీ మొత్తం 51 రోజుల పాటు జరగనున్నాయి.
క్రొత్త ఫార్మాట్‌
ఈసారి టోర్నీని కొత్త ఫార్మాట్‌లో నిర్వహించనున్నారు. ఫైనల్స్‌కు అర్హత సాధించడానికి తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు కొత్తగా ప్రవేశపెట్టిన ప్లే ఆఫ్‌ మ్యాచులను ఆడాల్సి ఉంటుంది. ఈ ప్లే ఆఫ్‌ మ్యాచులను క్వాలిఫైయర్‌-1, 2 లుగా వర్గీకరించారు. లీగ్‌ దశలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు ఆ తర్వాతి దశ అయిన ప్లేఆఫ్‌ మ్యాచ్‌-1 (క్వాలిఫైయర్‌-1)లో పోటీపడతాయి. ఇందులో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్స్‌లోకి ప్రవేశిస్తుంది.

No comments:

Post a Comment