తొలిటెస్టులో తమ జట్టు విజయం సాధించడానికి చాలా కారణాలున్నాయని ఆసీస్ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ అన్నాడు. టాపార్టర్ నుంచి టెయిలెండర్ల వరకు అందరూ విజయంలో ఉన్నారన్నాడు. మైక్ హస్సీ, పాంటింగ్ ఒత్తిడిలోనూ విలువైన పరుగులు అందించారన్నాడు. తొలి ఇన్నింగ్స్ లో ఎడ్ కోవాన్‌తో, రెండో ఇన్నింగ్స్ లో హస్సీ తో పాంటింగ్ నెలకొల్పిన భాగస్వామ్యాలు చలా కీలకంగా మారాయని చెప్పాడు. టెయిలెండర్లు కూడా విలువైన పరుగులు రాబట్టడంలో సఫలమయ్యారని చెప్పాడు.
పటిష్టమైన భారత బ్యాటింగ్ లైనప్ ను కుప్పకూల్చడంలో తమ బౌలర్లపాత్ర ఎంతో ఉందన్నాడు. భారత్ ను తొలి ఇన్నింగ్స్ లో 282పరుగులకు రెండో ఇన్నింగ్స్ లో 169పరుగులకు ఆలౌట్ చేయడంలో సక్సెస్ అయ్యారని చెప్పాడు. పాటిన్సన్, హిల్ఫెన్హాస్, పీటర్ సిడిల్ ప్రదర్శన ఆనందకరంగా ఉందని చెప్పాడు. ఇంకా తాము మెరుగుపర్చుకోవాల్సింది చాలా ఉందన్నాడు. టాపార్డర్ ఇంకా పరుగులు రాబడితే భారత్ ను ఓడించడం మరింత సులువౌతుందని క్లార్క్ చెప్పాడు. జనవరి 3 నుంచి జరుగనున్న సిడ్నీ టెస్టులో మంరింత మెరుగైన ప్రదర్శనను అందిస్తామని మైఖేల్ క్లార్క్ తెలిపాడు.

వెంక ముచ్చటిస్తే ఆయన మాటల్లో సినిమా సంగతులకంటే ఆధ్యాత్మిక విషయాలే ఎక్కువ చర్చకు వస్తాయి. ఆయన మాట్లాడే ప్రతి మాటలో జీవితం తాలూకు తాత్విక చింతన తొంగిచూస్తుంది. జయాపజయాలకు అతీతంగా సినిమాని ప్రేమిస్తారాయన. విలక్షణ పాత్రలతో తెలుగు సినిమాలో కుటుంబ చిత్రాల కథానాయకుడిగా తిరుగులేని స్థానాన్ని సొంతం చేసుకున్నారు వెంక ‘మనం చేసే పనిని నిజాయితీగా చేయాలి. ఫలితం ఎలా వున్నా స్వీకరించాలి’ అన్నది ఆయన నమ్మిన ఫిలాసఫీ. తాజాగా ఆయన ‘బాడీగార్డ్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. బెల్లంకొండ సురేష్ నిర్మించిన ఈ చిత్రానికి గోపీచంద్ మలినేని దర్శకుడు. త్రిష కథానాయికగా నటిస్తోంది. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురాబోతోంది. నేడు వెంక జన్మదినం. ఈ సందర్భంగా ఆయన చెప్పిన సంగతులివి...

ఎవరికీ అపకారం చేయని వ్యక్తి. ముక్కుసూటి మనిషి. ఆయన నిష్ర్కమణంతో పరిశ్రమ పెద్ద దిక్కును కోల్పోయింది.
పరిశ్రమకు అన్నీ తానే అయి తలో నాలుకలా మెలిగేవారు. చివరి రోజుల్లో ఏ బాదరబందీ లేని వ్యక్తిగా స్వర్గస్తులైన గొప్ప వ్యక్తి. మల్లెమాల ధన్య జీవి.
ఉత్తమ నిర్మాత, కవి, దార్శనికుడు మల్లెమాల. తెలుగుదనం ఉట్టిపడేలా కవిత్వం రాశారు. రెడ్డిగారి మరణం విచారం కలిగించింది.

మహేష్ కథానాయకుడిగా నటిస్తున్న సినిమా ‘బిజినెస్‌మేన్’. కాజల్ కథానాయిక. పూరి జగన్నాథ్ దర్శకుడు. ఆర్.ఆర్.మూవీమేకర్స్ పతాకంపై డావెంకట్ నిర్మిస్తున్నారు. ఈ నెల 10తో షూటింగ్ సాంతం పూర్తి కానుంది. దర్శకనిర్మాతలు మాట్లాడుతూ ‘ఇటీవల బ్యాంకాక్, పటాయ, క్రాబిలలో రెండు పాటలు తెరకెక్కించాం. ప్రస్తు తం అనువాదం సహా రీరికార్డింగ్ పనులు జరుగుతున్నాయి. నెలాఖరుకు తొలికాపీ వస్తుంది. ఇదే నెల 22న తెలుగు, తమిళ్, మలయాళ వెర్షన్ల ఆడియోలను రిలీజ్ చేయనున్నాం. జనవరి 11న అత్యథిక థియేటర్లలో సినిమా రిలీజవుతుంది. మహేష్-పూరి ఈ సినిమా కోసం థీమ్ సాంగ్ పాడడం ఓ విశేషం. ‘పోకిరి’ని మించిన డైలాగులు ఈ చిత్రంలో ఉన్నాయి. అవి రెట్టింపు పాపులారిటీని తెస్తాయని విశ్వసిస్తున్నాం. మహేష్ కెరీర్‌కే మరో మేలిమలుపు కాబోతోందీ సినిమా. రికార్డుల కోసం సంక్రాంతి వరకూ ఆగాల్సిందే’’ అన్నారు.