Saturday, December 17, 2011

ఇద్దరూ... ఇద్దరే ( వీరేంద్ర సెహ్వగ్‌, జహీర్‌ఖాన్‌ )

ఈనెల 26న భారత, ఆస్ట్రేలియా మధ్య ప్రారంభమవుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో వీరేంద్ర సెహ్వగ్‌, జహీర్‌ఖాన్‌ ఎంతో విలువైన పాత్రను పోషిస్తారని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ ఇయాన్‌ చాపెల్‌ అభిప్రాయం వ్యక్తం చేశారు. ‘ భారీ స్కోరు చేయటానికి సెహ్వాగ్‌ ఉన్నాడు. ఐదువికెట్లు తీయటానికి జహీర్‌ సిద్ధం. ఇద్దరు తురుపుముక్కలు భారత జట్టులో ఉన్నారు.’ అని చాపెల్‌ తెలిపాడు. అయితే ఆసీస్‌ బౌలర్‌ పాటిన్‌సన్‌ సీరీస్‌ను ప్రభావితం చేయగలడని చాపెల్‌ అన్నాడు. ఇటీవల పాటిన్‌సన్‌ బౌలింగ్‌ గణాంకాలు చూస్తుంటే రాబోయే టెస్టు సీరీస్‌లోనూ అతను రాణిస్తాడని ఇయాన్‌ చెప్పాడు. స్వదేశీ పిచ్‌లు ఆస్ట్రేలియాకు అనుకూలంగానే ఉన్నా, జట్టు గాయలతో ఉండటం మూలంగా భారత్‌ దీన్ని సద్వినియోగం చేసుకోవచ్చన్నారు. ఇటీవల కాలంలో ఆస్ట్రేలియా బ్యాటింగ్‌ పరమచెత్తగా కూడా ఊహించుకోలేకపోతున్నామని చాపెల్‌ ఘాటుగా విమర్శించాడు. బౌలింగ్‌ను మెచ్చుకున్న ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌, ఆసీస్‌ బ్యాటింగ్‌పై తీవ్రంగా విమర్శించాడు. అసలు ఫామ్‌లోనే లేని రికీ భవితవ్యాన్ని ఈ సీరీస్‌యే నిర్ణయిస్తుందని ఇయాన్‌ అన్నాడు.

No comments:

Post a Comment