Sunday, April 17, 2011

యువరాజ్‌ హిట్‌ మ్యాచ్‌ ఫట్‌

 ఐపీఎల్‌-4లో పూణే వారియర్‌, ఢిల్లీ డేర్‌ డెవిల్‌ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ 
ఢంకా మోగించింది. ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌లో బ్యాట్స్‌మెన్‌లు అందరూ సమిష్ట విజయం సాధించారు. మ్యాచ్‌లో ప్రతి ఒక్కరు రాణించడంతో విజయం సాధించారు. టాస్‌ గెలిచి ఢిల్లీ ఫీల్డింగ్‌ ఎంచుకుంది. పూణే వారియర్‌ 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. చివరిలో యువరాజ్‌ మెరుపులు మెరింపించాడు. 32 బంతులలో నాలుగు ఫోర్లు, ఐదు సిక్స్‌ల సహయంతో 66 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. 188 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ పరుగులు సాధించింది. ఓపెనర్లు ఇద్దరు దూకుడు ఆడారు. వార్నర్‌ 28 బంతులలో నాలుగు ఫోర్లు, రెండు సిక్స్‌ల సహయంతో 46 పరుగులు చేసి రనౌట్‌ అయ్యాడు. సెహ్వాగ్‌ ఎక్కువగా వార్నర్‌కు స్ట్రైక్‌ ఇచ్చాడు. ఐదు ఓవర్లలో 52 పరుగులు చేశారు. వార్నర్‌ అవుట్‌ అయ్యాక సెహ్వాగ్‌ తన దైన శైలిలో విరుచుకపడ్డాడు. 23 బంతులలో ఆరు ఫోర్లులతో 37 పరుగులు చేశాడు. వన్‌డౌన్‌గా ఇర్పాన్‌ పఠాన్‌ వచ్చాడు. యువరాజ్‌ సింగ్‌ తన మొదటి ఓవర్లలో రెండు వికెట్లు తర్వతగా తీసుకున్నాడు. హ్యట్రిక్‌ విజయం కోసం చూశాడు. కానీ వేణుగోపాల్‌రావు అవకాశం ఇవ్వలేదు. వాడే 3 పరుగులు చేసి నిరాశపరిచాడు. వేణుగోపాల్‌రావు, ఫ్నిచ్‌ ఇద్దరు స్కోరు బోర్డును ముందుకు నడిపారు. యురాజ్‌ సింగ్‌ నాలుగో ఓవర్లలో మళ్ళీ రెండు వికెట్లు లభించాయి. ఫిన్న్‌చ్‌ 12 బంతులలో రెండు సిక్స్‌లు, ఒక ఫోర్లులతో 25 పరుగులు చేసి జట్టు సహయపడ్డాడు. అదే ఓవర్లలో వేణుగోపాల్‌రావు ఒక సిక్స్‌, ఒక ఫోర్లు కొట్టి మరుసటి బంతికి ఔట్‌ అయ్యాడు. ఇంకా చివరి ఓవర్లలో ఆరు బంతులలో ఎనిమిది పరుగుల కావాలి. స్పిన్నర్‌ రైడర్‌కు అవకాశం ఇచ్చాడు. స్ట్రైక్‌ హోఫ్‌ ఉన్నాడు. మొదటి బంతికి సిక్స్‌ రెండో బంతికి ఫోర్లు కొట్టి మ్యాచ్‌ విజయం సాధించింది. ఢిల్లీ డేర్‌ డెవిల్స ఐపీఎల్‌-4లో మొదటి విజయం సాధించింది. పూణే వారియర్‌ మొదటి పరాజయం.

No comments:

Post a Comment