Friday, April 15, 2011

సచిన్‌ ' హిట్‌ ' ముంబయి ' ఫట్‌ '


ఐపీఎల్‌-4లో మ్యాచ్‌లో ముంబయి,కోచిల మధ్య జరిగిన మ్యాచ్‌లో కొచ్చి ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్‌ గెలిచి కొచ్చి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. ముంబయి జాకబ్‌,సచిన్‌ ఇద్దరు ఓపెనింగ్‌ ప్రారంభించారు. జాకబ్‌ 12 పరుగులకే అవుట్‌ అయ్యాడు. వన్‌డౌన్‌గా వచ్చిన రాయుడు. వచ్చి రావడంతో చిచ్చర పిడుగులగా సిక్స్‌ల మోత మోగించాడు. ఇద్దరు ఒక్కరి మిచ్చి ఫోర్లు, సిక్స్‌లతో మోత మోగించారు. సచిన్‌ 66 బంతులలో 12 ఫోర్లు, 3 సిక్స్‌ల సహయంతో 100 పరుగులు చేశారు. ఐపీఎల్‌-4లో ఇది రెండో సెంచరీ. రాయుడు కేవలం 33 బంతులలో మూడు ఫోర్లు, నాలుగు సిక్స్‌లతో అర్థసెంచరీ పూర్తి చేశాడు. రాయుడు చివరిలో రెండు పరుగులు కోసం వెళ్లి రనౌట్‌ అయ్యాడు. ముంబయి 20 ఓవర్లలో 182 పరుగుల చేసింది. లక్ష్యం చాలా పెద్దది. 183 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌ ప్రారంభించారు. మెక్‌కల్లమ్‌, జయవర్థన్‌ ఇద్దరు ఓపెనింగ్‌ వచ్చారు. మొదటి నుంచి పరుగులు రాబటడం ప్రారంభించారు. మొదటి వికెట్‌కు 128 పరుగుల బాగ్యస్వామం వహించారు. మెక్‌కల్లమ్‌ 81, జయవర్థన్‌ 56 పరుగులు చేశారు. చివరిలో జడేజా 11 బంతులలో రెండు ఫోర్లు, రెండు సిక్స్‌ల సహయంతో 25 పరుగులు చేశాడు.

No comments:

Post a Comment