Tuesday, February 8, 2011

అందరికీ గాయల బెడదే ..... ?


టోర్నీల పాల్గొంటున్న ప్రధాన ఆటగాళ్లు గాయలతో ఉన్నారు. ఎలాగైనా ఈవెంట్‌ నాటికి సిధ్దం కావాలనే లక్ష్యంతో చికిత్స తీసుకుంటున్నారు. కొందరు ఆటగాళ్లు పూర్తిగా ఫిట్‌నెస్‌పై దృష్టి సారించారు.
భారత్‌ తరుపున సచిన్‌, సెహ్వాగ్‌, గంభీర్‌, గాయల నుంచి ఇంకా పూర్తిగా కోలుకుని ఫిట్‌నెస్‌ను పటిష్టం చేసుకునే పనిలో ఉన్నారు. బౌలర్‌ ప్రవీణ్‌కుమార్‌ గాయం కారణంగా ప్రపంచకప్‌కు దూరమయ్యే ఆవకాశం ఉంది. అతని స్థానంలో శ్రీశాంత్‌ ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయి.
ఆస్ట్రేలియాలో మైక్‌ హాస్సీ, పాంటింగ్‌, హారిట్జి గాయాలతో ఉన్నారు. స్వదేశంలో ఇంగ్లాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో ఈ ఇద్దరు ఆడలేపోయారు. తోలి మ్యాచ్‌ నాటికి కోలుకొని బరిలోకి దిగుతామని కెప్టెన్‌ రిక్‌పాంటింగ్‌ తెలియజేశాడు.

ఇంగ్లాండ్‌ పరిస్థితి మరి దారుణంగా వుంది. అందులో ఏకంగా ఆరు మంది సభ్యులు గాయలతో సతమవుతున్నారు. మోర్గాన్‌ ఆడడం అనుమానంగా మారింది. స్టువర్ట్‌ బ్రాడ్‌ కూడా ఇంకా కోలుకోలేదు. కాలింగ్‌వుడ్‌, స్వాన్‌ వీరిద్దరు వెన్ను నొప్పితో బాధపడుతున్నారు. అజ్మల్‌ షెV్‌ాజాద్‌ కూడా గాయంతో ఉన్నాడు. బ్రెస్నన్‌ కూడా పూర్తిగా ఫిట్‌నెస్‌తో లేడు.
దక్షిణాఫ్రికాకు గాయల బెడద తప్ప లేదు. కీలక ఆటగాడు కలీస్‌ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. అతడు భారత్‌తో జరిగిన మూడో టెస్టుమ్యాచ్‌లో గాయంతో వెన్నుదిగిరాడు. అతరువాత వన్డే మ్యాచ్‌లో దూరమయ్యాడు.
న్యూజిలండ్‌ కెప్టెన్‌ వెటోరి గాయంతోనే ఉన్నాడు. 

దాదాపు అన్ని జట్టులో కీలకమైన ఆటగాళ్లు గాయలతో సతమతవుతున్నారు. మరో వారం రోజులో ప్రపంచకప్‌ ప్రారంభమవుతుంది.

No comments:

Post a Comment