Friday, January 21, 2011

నాల్గొవ వన్డేలో పరాజయం

భారత్‌, దక్షిణాఫ్రికాల మధ్య జరుగుతన్న నాల్గొవ వన్డేలో 48 పరుగుల తేడాతో సౌతాఫ్రికా విజయం సాధించింది. దీంతో ఇరు జట్లు 2-2 సమానంగా నిలిచాయి. భారత్‌, దక్షిణాఫ్రికాల మధ్య జరుగుతున్న నాల్గోవ వన్డేలో సౌతాఫ్రికా టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్నది. 50 ఓవర్లలో 265 పరుగులు చేసింది. డుమ్మిని 71, స్టెయిన్స్‌ 4 పరుగులుతో క్రీజులో ఉన్నారు. ఆమ్లా, స్మిత్‌ ఇద్దరు కలిసి బ్యాటింగ్‌ ప్రారంభించారు. ఆరభంలో పరుగుల వరద కురిపించారు. ఆమ్లా అర్థ సెంచరీ కదం తోక్కాడు. మరో ఓపెనరు స్మిత్‌ 18 పరుగులు చేశాడు. వన్‌డౌన్‌గా వచ్చిన వాన్వఆక్‌ 15 తక్కువ పరుగులకే పెవిలియమ్‌ చేరుకున్నాడు. క్రీజులో ఆమ్లా, డివిలర్సు ఉన్నారు. అ తరువాత వికెట్ల పతనం ఆరభం అయ్యింది. నాలుగు ఓవర్లలో నాలుగు వికెట్లు తీసుకుంది. వాన్వఆక్‌ 15, డివిలర్సు 3 పరుగులు చేసి యువరాజ్‌ సింగ్‌ బౌలింగ్‌లో అవుట్‌ అయ్యారు. ఆమ్లా లేని పరుగుల కోసం ప్రయత్నించి రనౌట్‌గా అయ్యాడు. ప్లెస్సిన్‌ 1 పరుగు చేసి రనౌట్‌ అయ్యాడు. డుమ్మిని, బోథా ఇద్దరు 50 పరుగులు అర్థ సెంచరీ బ్యాగస్వాముల అయ్యారు. బోతా 44 పరుగులు చేసి యువరాజ్‌ సింగ్‌ బౌలింగ్‌లో ధోని క్యాచ్‌ ఇచ్చి అవుట్‌ అయ్యాడు. తన అత్యధిక స్కోరు కూడా చేయలేక పోయాడు. భారత్‌ బౌలింగ్‌లో యువరాజ్‌ సింగ్‌ 3 , నెహ్రా ఒక వికెట్‌ తీసుకున్నాడు. 266 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌ 32.5 ఓవర్లలో 142 పరుగుల చేసింది. అప్పటికే వర్షం అడ్డుకోవడంతో డక్‌వర్త్‌ ప్రకారం 48 పరుగుల తేడాతో సౌతాఫ్రికా విజయం సాధించింది. భారత్‌ బ్యాటింగ్‌లో ఏ మాత్రం పదును లేదు. కోహ్లీ ఒక్కడే 87 పరుగులు చేసి నాటౌట్‌ గా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో మురళీ విజరు పక్కన పెట్టి పార్థివ్‌ పాటేల్‌ తీసుకున్నారు. పార్థీవ్‌ పాటేల్‌, రోహిత్‌ శర్మ ఇద్దరు కలిసి బ్యాటింగ్‌ ప్రారంభించారు. రోహిత్‌ శర్మ 1 పరుగు చేసి నిరాశ పరిచాడు. మరో ఓపెనరు 11 పరుగుల చేసి అవుట్‌ అయ్యాడు. యువరాజ్‌ అదుకున్న అనిపిచినా 12 పరుగులు చేసి వెనుదిరిగాడు. రైనా కొద్ది సేపు సహాకరించాడు. అతరువాత అతను కూడా పెవిలియన్‌ చేరుకున్నాడు. ధోని, పఠాన్‌ చెరో రెండు పరుగులు చేసి పెవిలియన్‌ క్యూ కట్టారు. సౌతాఫ్రికాతో జరిగినా నాల్గువ వన్డేలో కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని ఒక మ్యాచ్‌లో కూడా అర్థ సెంచరీ చేయలేదు. మొదటి వన్డేలో కోహ్లీ అర్థ సెంచరీ. రెండో వన్డేలో యువరాజ్‌ సింగ్‌ అర్థసెంచరీ, మూడోవన్డేలో యూసుఫ్‌ పఠాన్‌ చేలరేగడంతో భారత్‌ 2-1 తేడాతో ఉన్నది. నాల్గొవ వన్డేలో మాత్రం కోహ్లీకి ఎవరు సహకరించలేపోయారు. వర్షం కారణంగా మ్యాచ్‌ రెండు సార్లు నిలిపివేశారు. అప్పటికే క్రీజులో కోహ్లీ, హర్భజన్‌ సింగ్‌ ఇద్దరు. ఉన్నారు. 87 బంతులలో 123 పరుగులు చేయాలి.

No comments:

Post a Comment