Monday, June 13, 2016

ఈ మొబైల్‌ వంచితే.. చేతి గడియారం

నేటి ఆధునిక యుగంలో సాంకేతిక ఎప్పటికప్పుడు కొత్త రూపు సంతరించుకుంటోంది. వినూత్న ఆవిష్కరణలతో మానవుని అవసరాలను తీర్చుతోంది. ఇక ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్‌ వాడని వారు లేరంటే అతిశయోక్తి కాదు. ఇప్పుడు అది మరింత స్మార్ట్‌గా మన ముందుకు రాబోతోంది. ఇప్పటిదాకా మనం ఫోన్‌ను చేతితో పట్టుకుని మాత్రమే ఉపయోగించాం. కానీ త్వరలో చేతికి వాచీలా ధరించి ఉపయోగించుకునేలా ఓ కొత్త మొబైల్‌ రూపుదిద్దుకుంటోంది.

ఇటీవల శాన్‌ఫ్రాన్సికోలో నిర్వహించిన ‘టెక్‌ వరల్డ్‌-2016’లో లెనోవా సంస్థ మడతపెట్టుకోగలిగే మొబైల్‌, ట్యాబ్‌లను ప్రదర్శించింది. ‘సీ-ప్లస్‌’గా పిలుస్తున్న ఈ మొబైల్‌ను అవసరమైనప్పుడు వాచీలా చేతికి ధరించి ఉపయోగించుకోవచ్చు. అయితే ప్రస్తుతం ఇది ప్రయోగ దశలోనే ఉంది. దీన్ని మార్కెట్లోకి విడుదల చేసేందుకు మరికొంత సమయం పట్టవచ్చు.
 

No comments:

Post a Comment