Wednesday, December 23, 2015

నెంబర్‌ కొట్టండి .. సమస్య చెప్పండి




ప్రజల సౌకర్యార్థం టోల్‌ ఫ్రీ నెంబర్లు 


సిఎంఓ ఆఫీస్‌ 040-23454071                 మీ ఏరియాలో ఏదైనా సమస్య ఏళ్ల తరబడి పెండింగ్‌లో కొనసాగుతోందా.? అధికారులు నిర్లక్ష్యంగా పనిచేస్తున్నారా? ప్రజా ప్రతినిధులు మీవైపు చూడటం లేదా..? ప్రభుత్వ పథకాల్లో మీకు ఏమైనా అసౌకర్యం కలుగుతుందా..? ఇవన్నీ సమస్యలను నేరుగా ముఖ్యమంత్రికే చెప్పుకోవాలని ఉందా.. అయితే మీరు అక్కడి దాకా పోవాల్సిన పనిలేదు. ఇలాంటి వాళ్ల కోసమే సిఎంఓ కార్యాలయంలో 040- 23454071 టోల్‌ ఫ్రీ నెంబర్‌ను ఏర్పాటు చేశారు. దీనికి ఫోన్‌ చేస్తే ముఖ్యమంత్రికి చెప్పినట్లేనని కెసిఆర్‌ చెప్పారు మరి. ఏ సమస్యకైనా 100

 మనం ఏ సమస్యలో ఉన్నా, పోలీసులకు ఏదైనా సమాచారం ఇవ్వాలనుకున్నా 100 డయల్‌ చేస్తే సరి. ఈ నెంబర్‌కు ఫోన్‌ చేస్తే స్థానికంగా ఉన్న పోలీస్‌ స్టేషన్లకు కనెక్ట్‌ అవుతోంది. పైసా ఖర్చు లేకుండా సమాచారం ఇవ్వొచ్చు. తెలుసుకోవచ్చు.
 
తక్షణ వైద్యం కోసం 108




ఆపదలో ఉన్నప్పుడు ఫోన్‌ చేస్తే వచ్చేది ఏమిటంటే 108 అంబులెన్స్‌ వాహనమని నేడు అందరికీ తెలుసు. రోడ్డు ప్రమాదాలు, ఇతర ప్రమాదాలు జరిగినా.. ఆరోగ్య పరిస్థితి ఆందోళన కరంగా ఉన్నా? ఆసుపత్రికి చేరేందుకు 108 వాహనానికి ఫోన్‌ చేస్తే చాలు. క్షణాల్లో మీ ముందుంటుంది. అయితే అంబులెన్స్‌ వచ్చేంత వరకు రూట్‌ వివరాల కోసం ఆ సిబ్బంది మనకూ ఫోన్‌ చేస్తుంటారు.
'మీసేవా' కేంద్రాలపై...


'మీసేవా' కేంద్రాల్లో మీ పనులు సకాలంలో జరగడం లేదా? ఇచ్చిన సమయానికి ధృవీకరణ పత్రాలు జారీ చేయడం లేదా? కేంద్రాల్లో కనీస వసతులు లేవా? సమాచారం కోసం గంటల తరబడి నిలబెడుతున్నారా? పైసలిస్తే తప్ప పని జరగడం లేదా.. అయితే 1100 టోల్‌ఫ్రీ నెంబర్‌కు ఫోన్‌ చేయండి మీ సమస్యను పరిష్కరిస్తారు.


ఆరోగ్య సందేహాలు తీర్చుకోండిలా...



మీ మానసిక పరిస్థితి బాగా లేదా? ఫోన్‌ ద్వారా కౌన్సిలింగ్‌ పొందాలని అనుకుం టున్నారా? ఆరోగ్యశ్రీ శస్త్ర చికిత్సల్లో ఏమేమి ఉన్నాయి? వైద్య సేవల కోసం ఎక్కడెక్కడ సంప్రదించాలి? వంటి సలహాలతో పాటు ఆరోగ్యశ్రీ ఉన్న ఆసుపత్రుల్లో చికిత్స అందించేందుకు నిరాకరిస్తున్నాయా? ఇలాంటి సమస్యలకు పరిష్కార మార్గాలను వెతికేందుకు 104 నంబర్‌ ఉపయోగపడుతుంది.
అవినీతి అంతు చూడాలంటే...1064



ప్రభుత్వ కార్యాలయంలో మిమ్మల్ని ఎవరైనా లంచం అడుగుతున్నారా? అక్రమ వ్యాపారాలు చేస్తున్న వారి వివరాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలనుకుంటున్నారా? అయితే 'ఎసిబి' వారు ఏర్పాటు చేసిన 1064 టోల్‌ఫ్రీ నెంబర్‌కు ఫోన్‌ చేసి, సమాచా రాన్ని వారికి చెప్పండి. ఇదే కాక 1800 222 021కు కూడా ఫోన్‌ చేసి చెప్పొచ్చు.



విద్యుత్‌ సమస్యపై 1912 కరెంట్‌ బిల్‌ ఎక్కువగా వచ్చిందా..? విద్యుత్‌ సరఫరా నిల్చిపోయిందా? సరఫరాలో తరచూ అవాంతరాలు ఎదురవుతున్నాయా? ఇలా విద్యుత్‌ శాఖకు సంబంధించిన ఏ ఫిర్యాదులనైనా స్వీరించేందుకు విద్యుత్‌ శాఖ '1912' టోల్‌ఫ్రీ నెంబరు ఏర్పాటు చేసింది.


ఆర్టీసీ సంస్థ గురించి.. 


ఏదైనా విహారయాత్రకు బస్సులో పోవాల నుకుంటున్నారా ? ఆర్టీసీ బస్సు బాగా లేదా? సమయానికి బస్సు రావడం లేదా? బస్సులతో మరేమైనా ఇబ్బందులు ఉన్నాయా? వెంటనే 1800-200-4599 టోల్‌ఫ్రీ నెంబర్‌కు ఫోన్‌ చేయాలి. ఫిర్యాదు వెళ్లిన వెంటనే హైదరాబా ద్‌లోని నియంత్రణ విభాగం (కంట్రోల్‌రూం) ద్వారా జిల్లా సిబ్బందికి ఆదేశాలు వస్తాయి. తద్వారా ఒక పరిష్కార మార్గం ఏర్పడుతుంది. దీనికి తోడు సమాచారం కూడా అందిస్తారు.
 రాజీవ్‌ గాంధీ ఎయిర్‌ పోర్టు...
 
హైదరాబాద్‌లోని రాజీవ్‌ గాంధీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టులో ఏదైనా సమాచారం కావాలా? విమానాలు సకాలంలో నడుస్తున్నాయా లేక రద్దు చేయబడ్డాయా అనే విషయాలతో పాటు విమానాల రాకపోకలు, ఛార్జీల వివరాలు తెలుసుకోవాలంటే 1800 419 2008 నెంబర్‌కు ఫోన్‌ చేస్తే సరి. 

యూత్‌ సమస్యలపై...

యుక్త వయస్సులోకి వచ్చాకా యువతలో అనేక సమస్యలు ఉత్పన్నమవుతుంటాయి. వీటిని ఎవరికి చెప్పుకోవాలో తెలియక అనేక మంది తికమకపడుతుంటున్నారు. అలాంటి వారికోసం ప్రభుత్వం యువ కౌన్సిలింగ్‌ హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేసింది. ఏ సమస్యనైనా నేరుగా 1800 116 888కు ఫోన్‌ చేయండి.
 ర్యాగింగ్‌ సమస్యపై...
 

కళాశాలలోనైనా, లేక ఇతర ప్రాంతాల్లోనైనా ఎవరైనా ర్యాగింగ్‌కు పాల్పడితే ఈ సమాచారాన్ని నేరుగా అధికారుల దృష్టికి తీసుకుపోవచ్చు. దీనికోసం 1800 180 5522 నెంబర్‌కు ఫోన్‌ చేయాలి. 
 
ఆధార్‌ కార్డు, పాన్‌ కార్డు కోసం...
 ప్రస్తుతం ప్రతి పనిలో ఆధార్‌ కార్డు ఒక బాగస్వామిగా అయిపోయింది. గతంతో ఒక వ్యక్తి గుర్తింపు కార్డుగా రేషన్‌ కార్డు ఉండగా ప్రస్తుతం ఆధార్‌, పాన్‌ కార్డులుగా మారిపో యాయి. మీ ఆధార్‌ కార్డు, పాన్‌ కార్డులు పోయినా.. తప్పులు పడ్డా ఈ నెంబర్ల ద్వారా సూచనలు తీసుకోవచ్చు. ఆధార్‌ కార్డు 1800 300 1947, పాన్‌ కార్డు- 1800 180 1961 నెంబర్లను టోల్‌ ఫ్రీ గా ఏర్పాటు చేశారు.

 గ్యాస్‌ ఇబ్బందులపై..



గ్యాస్‌ సరఫరాలో ఏమైనా ఇబ్బందులు ఉన్నా, సకాలంలో అందివ్వకపోయినా దానికోసం గ్యాస్‌ సంస్థలు టోల్‌ ఫ్రీ నెంబర్‌ ఏర్పాటు చేశారు. భారత్‌ గ్యాస్‌- 1800 222 725 , హిందుస్తాన్‌ గ్యాస్‌ - 1800 2333 777, ఇండెన్‌ గ్యాస్‌ -1800 2333 555లకు ఫోన్‌ చేయండి.


ఉపాధి హామీ వివరాలకు...

గ్రామాల్లో ఉపాధి హామీ పథకం కింద కూలీ పని దొరకడం లేదా? పని చేసినా కూలి ఇచ్చేం దుకు డబ్బులు అడుగుతున్నారా? సకాలంలో కూలీ అందడం లేదా? ఎక్కడైనా అక్రమాలు జరిగాయా? సిబ్బంది పనితీరు సక్రమంగా లేదా? ఇలా ఎలాంటి సమస్యలపైనా '155321' నెంబర్‌కు ఫోన్‌ చేసి చెప్పొచ్చు.
 
వ్యవసాయరంగ ఫిర్యాదులకు..

అదనంగా వ్యవసాయరంగ ఫిర్యాదుల కోసం 1800-425-3536 అనే నెంబర్‌ను కూడా ఏర్పాటు చేశారు. సిబ్బందిపైనా, ఎటువంటి ఫిర్యాదుల కోసమైనా ఫోన్‌ చేసి చెప్పొచ్చు. వెంటనే స్పందించి సమస్య పరిష్క రిస్తారు.
 
సాగుపై సలహాలు పొందండిలా..


ప్రస్తుతం ఏ పంట వేస్తే బాగుంటుంది? అంతర పంటల్లో దేనికి డిమాండ్‌ ఉంటుంది. ఏ సమయంలో ఏ పంటలు వేసుకుంటే మేలు. వేసిన పంటలపై వచ్చే చీడపీడలు, పురుగుల నివారణ కోసం ఏ మందులు వాడాలి? ఇలా పంటల సాగుపై సలహాల కోసం వ్యవసాయ శాఖ 1100 టోల్‌ఫ్రీ నెంబర్‌ను ఏర్పాటు చేసింది. పంటల నష్టపరిహారం అందకపో వడం, నల్ల బజారుకు విత్తనాలు, ఎరువుల తరలిండం తదితర అంశాలపైనా సమాచా రాన్ని పొందొచ్చు.

No comments:

Post a Comment