Wednesday, December 2, 2015

చెన్నైలో భారీ వర్షం

భారీ వర్షం కారణంగా ' ది హిందూ' పత్రిక ప్రచురణ నిలిపివేత
వరద నీటిలో చెన్నై ఐటీ కంపెనీలు
సినీ ప్రముఖులు ఆర్థిక సహాయం
మరో 48 గంటలు చాలా ప్రమాదం ...



                  చెన్నై భారీ వర్షాల బీభత్సంలో ఎక్కువప్రాంతాలు నీటమునిగాయి. దాదాపు వందేళ్ల తరువాత ఇంతటి స్థాయిలో వర్షపాతం కురిసిందని వాతావరణశాఖ పేర్కొనడం జరిగింది. దాదాపు కోటిమందికిపైగా ప్రజలు వరద బీభత్సంతో ఇబ్బందులు పడుతున్నారు. చెన్నైలో విమానాశ్రయంలోకి వర్షపునీరు ప్రవేశించడంతో విమాన సర్వీసులను నిలిపివేయడం గమనార్హం.



భారీ వర్షం కారణంగా ' ది హిందూ' పత్రిక ప్రచురణ నిలిపివేత
                       చెన్నై నగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తుతున్న సంగతి తెలిసిందే. అన్ని మౌలికసదుపాయాలు, అత్యవసర సేవలు కూడా నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది. గత వందేళ్లలో ఇదే అత్యంత దారుణ పరిస్థితి అని అధికారులు తెలిపారు. వర్షాలు, భారీగా నిలిచిపోయిన నీరు కారణంగా అక్కడి ప్రముఖ దినపత్రిక ' ది హిందూ' కూడా బుధవారం ప్రింట్‌ ఎడిషన్‌ ప్రచురణ నిలివేస్తారు. 1878లో హిందూ స్థాపించగా 137 ఏళ్లలో ఇలా ప్రతికూల వాతావరణ పరిస్థితులు కారణంగా ప్రతిక ప్రింటింగ్‌ను నిలిపేయడం ఇదే మొదటిసారి. చైన్నైలో మౌంట్‌ రోడ్డులోని హిందూ ప్రధానకార్యాలయంలో జరగాల్సిన సిటీ ఎడిషన్‌ ముద్రణ నిలివేసింది.
మరో 48 గంటలు చాలా ప్రమాదం ...                           భారీ వర్షాలు, వరదలతో అష్టకష్టాలు పడుతున్న చెన్నై వాసులకు మరింత ముప్పుపొంచి ఉంది. రోడ్లు, కాలనీలు, రైల్వే ట్రాక్‌లు, రైల్వేస్టేషన్లు, విమానాశ్రయాలు జలమయంకావడంతో ఇప్పటికే జనజీవనం స్తంభించిపోగా.. చెన్నైలో మరో 48 గంటలు పాటు భారీ వర్షం పడే అవకాశముందని వాతావరణ అధికారులు తెలిపారు. ఈ 48 గంటలు పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉంటుందని హెచ్చరించింది. చైన్నెలో తాగు నీరు, నిత్యావసర వస్తువులు దొరకక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్ల నుంచి బయటకు వెళ్లాలంటే రోడ్లు నదులను తలపిస్తున్నాయి.


వరద నీటిలో చెన్నై ఐటీ కంపెనీలు
                తమిళనాడులో కురుస్తున్న భారీ వర్షాలు, వరద నీటి ప్రభావం చైన్నెలోని పలు ఐటీ కంపెనీలకు తాకింది. అయితే కీలక సేవలకు అంతరాయం లేదని పలు ఐటీ కంపెనీలు తెలిపాయి. ఇన్పోసిస్‌ క్యాంపస్‌లోకి వరద నీరు ప్రవేశించింది. దీంతో రేపు కూడా ఇన్ఫోసిస్‌ ఉద్యోగులకు సెలవు ప్రకటించింది. అంతే కాకుండా నగరంలో చిక్కుకు పోయిన తమ ఉద్యోగులను రక్షించేపనిలో నిమన్నమైంది. దీనిపై ప్రభుత్వ అధికారులతో కలిసి పనిచేస్తున్నామని ఇన్ఫోసిస్‌ వెల్లడించింది. కీలక సేవలకోసం కాగ్నిజెంట్‌ సిబ్బంది కార్యాలయాల్లోనే పని చేస్తున్నారు.


హీరో సిద్ధార్థ్‌                  తమిళనాడులో సోమవారం నుంచి ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ వర్షాల కారణంగా సాధారణ ప్రజలే కాదు... సినీ ప్రముఖులు సైతం ఇబ్బందులు పడుతున్నారు. వర్షం కారణంగా తన ఇంట్లోకి నీరు వచ్చిందని ... తాము పై అంతస్థుకు వెళ్తున్నామని నటుడు సిద్ధార్థ్‌ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. డ్రైయిన్‌లలోంచి నీరు బయటకు వస్తోందన్నారు. తన ఇంటి పరిస్థితే ఇలా ఉంటే రాష్ట్రంలో సాధారణ ప్రజల పరిస్థితి వూహించుకోండి.. అంటూ సిద్దార్థ్‌ పేర్కొన్నాడు. సినీ ప్రముఖులు సహాయ చర్యల్లో పాల్గొంటున్నారు.
వరదభాదితులకు రూ.10 లక్షలు విరాళం అందించిన రజినీకాంత్‌. అదే విధంగా నటుడు దనుష్‌ రూ. 5 లక్షలు, సూర్య, ఆయన సోదరుడు కార్తీలు కలిసి రూ. 25 లక్షలు, విశాల్‌ రూ. 10 లక్షలు విరాళం అందించారు. టాలీవుడ్‌ స్టార్‌ అల్లుఅర్జున్‌ వరద బాధితులకు 25 లక్షల విరాళం ప్రకటించాడు.

No comments:

Post a Comment