Thursday, February 10, 2011

దక్షిణాఫ్రికా జట్టు రాక

వరల్డ్‌కప్‌కు గట్టిపోటీదారులైన దక్షిణాఫ్రికా జట్టు బుధవారం ఉదయం ఇక్కడకు చేరుకుంది. ఇప్పటివరకు ప్రపంచకప్‌ను ఒక్కసారి కూడా గెలుచుకోలేకపోయిన ఆ జట్టు ఈ సారి విజేతగా స్వదేశానికి తిరిగివెళ్లాలనే పట్టుదలతో వచ్చింది. గ్రీమ్‌ స్మిత్‌ నేతృత్వంలోని ఆ జట్టులో హసీం ఆమ్లా, డివిల్లీర్స్‌, జెపి డ్యూమినీ మంచి ఫామ్‌లో ఉన్నారు. అయితే అందరి చూపు బ్యాటింగ్‌ ఆల్‌రౌండర్‌ జాక్స్‌ కల్లిస్‌పై ఉంటుందనడంలో అతి శయోక్తి లేదు. ఇటీవల భారత్‌తో జరిగిన సిరీస్‌లో కల్లిస్‌ అద్భు తంగా రాణించాడు. ఐసిసి నెంబర్‌ వన్‌ ర్యాంక్‌ దక్కించుకున్న డేల్‌ స్టెన్‌, మార్నే మోర్కెల్‌, కొత్తకుర్రాడైన ఇటీవల భారత్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో సత్తా చాటుకున్న సొసోబే వంటి క్రీడాకారులతో దక్షిణాఫ్రికా జట్టు పటిష్టంగా ఉంది. అటు బ్యాటింగ్‌ లోనూ, ఇటు బౌలింగ్‌లోనూ దక్షిణాఫ్రికా జట్టు బలంగా ఉంది. భారత్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను 3-2తో గెలుచుకున్న ఆ జట్టు ఉత్సాహంతో ఉరక లేస్తోంది. ఆ జట్టు గ్రూప్‌ బిలో ఉంది. భారత్‌, ఇంగ్లండ్‌, వెస్టిండీస్‌, బంగ్లాదేశ్‌, ఐర్లండ్‌, నెదర్లాండ్స్‌ ఈ గ్రూప్‌లోని మిగిలిన జట్లు. ప్రపంచకప్‌ సమ రానికి దిగేముందు ఈ నెల 12న జింబాబ్వేతో వార్మప్‌ మ్యాచ్‌ ఆడు తుంది. వరల్డ్‌కప్‌లో తొలి మ్యాచ్‌ను వెస్టిండీస్‌ తో ఫిరోజ్‌షా కోట్లా మైదానంలో ఈ నెల 24న ఆడుతుంది.

No comments:

Post a Comment