Sunday, February 6, 2011

రెండు ఫార్మట్‌లో పాక్‌ పైచేయి

 వరల్డ్‌కప్‌ ముందు న్యూజిలాండ్‌కు చివరివన్డేలో విజయం లభించింది. పాకిస్థాన్‌, న్యూజిలాండ్‌ మధ్య జరుగుతున్న ఆరు వన్డేలలో పాక్‌ 3-2 తేడాతో విజయం సాధించింది. రెండో వన్డే వర్షం కారణంగా రద్దు అయ్యింది. ప్రపంచకప్‌ ముందు విజయం సాధించింనందుకు పాక్‌ జట్టు అత్మవిశ్వాసం పెంచుతుందనడంలో సందేహం లేదు. టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న న్యూజిలాండ్‌ 50 ఓవర్లలో 311 పరుగుల చేసింది. రైడర్‌ అద్బుతంగా సెంచరీ చేశాడు. 312 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్‌ 254 పరుగుల చేసి అలౌట్‌ అయ్యింది. కమ్రాన్‌ అక్మల్‌ 89 , అఫ్రీద్‌ 44 పరుగులు చేశారు. మిగితా బ్యాట్‌మైన్‌లు ఏఒక్కరు రాణించలేకపోయారు. రైడర్‌ మ్యాన్‌ ఆప్‌ ద మ్యాచ్‌ లభించింది. టెస్టు మ్యాచ్‌లో 1-0 తేడాతో వన్డేలో 3-2 తేడాతో పాక్‌ ఘన విజయం సాధించింది. ప్రపంచకప్‌ ముందు ఇది ఒక సవాల్‌గా తీసుకుది. ప్రపంచకప్‌లో పాక్‌ కెప్టెన్‌గా షాహిద్‌ అఫ్రిద్‌ ఎంపికయ్యాడు.

No comments:

Post a Comment