Saturday, January 29, 2011

ఆల్‌ రౌండర్స్‌ ..

షాహిద్‌ ఆఫ్రిద్‌, అబ్దుల్‌ రజాక్‌ , యూసుఫ్‌ పఠాన్‌, మాథ్యూస్‌ , దిల్షాన్‌, ఫెరీరా, షకిబుల్‌, రైడర్‌, నాథన్‌ మెకకలమ్‌, షేన్‌ వాట్సన్‌, కామెరూన్‌ వైట్‌, డేవిడ్‌ హసీ, క్రిస్‌గేల్‌, కాలింగ్‌వుడ్‌, లా ప్రతి ఒక టీమ్‌లో ఇద్దరు లేక ముగ్గురు ల్‌ రౌండర్స్‌ ఉంటారు.
షాహిద్‌ ఆఫ్రిద్‌, అబ్దుల్‌ రజాక్‌ లాంటి
ల్‌ రౌండర్లు మెరుపులు మెరిపిస్తే ఎంతటి జట్టుయినా చిత్తు కావాల్సిందే. ముఖ్యంగా అఫ్రిద్‌ ఫామ్‌లోకి వస్తే చాలు ఆకాశమే హద్దుగా చెలరేగుతాడు. సిక్స్‌ల వర్షం కురిపిస్తాడు. అతని తోడు రజాక్‌ కూడా అవసరమైన సమయంలో జట్టును అదుకుని పరుగుల రాబట్టడం అలవాటు బౌలింగ్‌లో అఫ్రిది తన స్పిన్‌తో కీలక సమయాల్లో వికెట్టు పడగొట్టి మ్యాచ్‌ను మలుపుతిప్పుతాడు.
యూసుఫ్‌ పఠాన్‌ విధ్యంసకర బ్యాటింగ్‌తో మెరుపులు మెరిపిస్తాడు. కీలక సమయంలో ఎలాంటి భయం లేకుండా అలవోకగా సిక్సర్లు ఫోర్లు బాదడం ఇతని బలం. బౌలింగ్‌లో తన ఆఫ్‌ స్పిన్‌తో కీలక వికెట్టు పడగొడతాడు. అతనికి తోడు యువరాజ్‌ సింగ్‌ ఉన్నాడు. లెఫ్ట్‌ ఆర్మ్‌ స్పిన్‌తో ప్రత్యర్థిని కట్టి పడేయడం, తన బ్యాటింగ్‌తో చుక్కలు చూపించడం యువీనైజం. వీరిద్దరూ రాణిస్తే ప్రపంచ కప్‌ ఇండియాదే.
మాథ్యూస్‌, ఫెరారీ, దిల్షాన్‌, లాంటి ఆల్‌ రౌండర్లు రాణిస్తే శ్రీలంక జయభేరి తథ్యం. దిల్షాన్‌ బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లో కూడా రాణించగలడు. అతనికి తోడు మాథ్యూస్‌, ఫెరీరా ఇద్దరు మంచి అల్‌ రౌండర్లు. ఏ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ఫోర్లు, సిక్సులతో విరుచుపడే మ్యాథ్యూస్‌, ఆరంభంలో వికెట్లు తీసి ప్రత్యర్థి జట్టు నడ్డి విరవడం వెన్నతో పెట్టిన విద్య.
షకిబుల్‌ బంగ్లాకు చాలా కీలక ఆటగాడు. వన్డేల్లో ఆల్‌రౌండర్‌గా రాణించగలిగాడు. బ్యాటింగ్‌ బౌలింగ్‌ రెండింటిలో సత్తా చాటుతున్నాడు.
న్యూజిలాండ్‌లో జట్టులో రైడర్‌, స్లైరీస్‌, వీరితో పాటు నాథన్‌ మెక్‌కలమ్‌ స్పిన్‌ బౌలర్‌గా, అల్‌ రౌండర్‌గా జట్టుకు సేవలందిస్తున్నాడు. రైడర్‌ బ్యాటింగ్‌లో మంచి ఫామ్‌తో పరుగుల వర్షం కురుపిస్తూనే.. తనదైన శైలి బౌలింగ్‌లో కూడా రాణిస్తున్నాడు. స్టైరీస్‌ ఆల్‌రౌండర్‌గా జట్టుకు ఎంతో తోడుపడుతున్నాడు. నాథన్‌ మెక్‌కలమ్‌ కీలక సమయాలలో జట్టుకు వెన్నంటి ఉంటూ విజయ తీరాలకు చేరుస్తున్నారు.
ఆస్ట్రేలియాలో షేన్‌ వాట్సన్‌, వైట్‌ వీద్దరు కలిసి రాణిస్తే విజయం వారిదే. జట్టు ఓపెనర్‌ షేన్‌ వాట్సన్‌, మిడిలార్డర్‌లో డేవిడ్‌ హసీ, వైట్‌లలో ఏ ఒక్కరు రాణించినా ప్రత్యర్థి జట్టు విజయంపై ఆశలు వదులుకోవల్సిందే...!
క్రిస్‌గేల్‌ అతను ఉన్నతసేపు జట్టు విజయానికి డోకా ఉండదు. క్రిస్‌గేల్‌ సిక్స్‌, ఫోర్లు వర్షం కురిస్తే ఇక అతన్ని ఆపడం ఎవరి తరం కాదు. జట్టులో అతని తోడుగా బ్రావో అల్‌ రౌండర్‌గా మంచి ప్రదర్శన కనబరుస్తాడు. వీరుద్దరు విజృంబించిన రోజు విండీస్‌పై గెలిచే దైర్యం ఏ జట్టుకు లేదు.

No comments:

Post a Comment