Thursday, January 13, 2011

ఆదిలోనే షాక్‌........

భారత్‌, దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న మొదటి వన్డే మ్యాచ్‌లలో 135 పరుగుల తేడాతో ఘోర పరాజయం పొందింది. భారత్‌ టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్నది. దక్షాణాఫ్రికా జట్టు 50 ఓవర్లలో 289 పరుగులు చేసింది. ఆమ్లా 50, డివిలియర్స్‌ 76, డుమినీ 73లు రాణించి దక్షిణాఫ్రికా జట్టు భారీ స్కోరును సాధించడంలో కీలకపాత్ర వహించారు. కెప్టెన్‌ స్మిత్‌ 11, ఇంగ్రామ్‌ 5 , జొహాన్‌ బోథా 23, వేన్‌ పార్నెల్‌ 21, మిల్లర్‌ 9, స్టెయిన్‌ 7, మోర్కెల్‌ 0 పరుగులు చేసి అవుట్‌ అయ్యారు. 290 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌ 13 పరుగులకే ఓపెనర్లు ఇద్దరు పెవిలియమ్‌ చేరుకున్నారు. రోహిత్‌ శర్మ 11, యువరాజ్‌ సింగ్‌ 2, కెప్టెన్‌ దోని 25, రైనా 32, హర్భజన్‌ సింగ్‌ 0, జహీర్‌ ఖాన్‌ 6, నెహ్రా 1 పరుగులు చేసి అవుట్‌ అయ్యారు. కోహ్లి ఒక్కడే అర్థసెంచరీ చేశాడు. రైనా కొద్దిసేపు పోరాటం చేసి సొత్సొబె బౌలింగ్‌లో ఇంగ్రామ్‌ క్యాచ్‌ ఇచ్చి అవుట్‌ అయ్యాడు.

1 comment:

  1. hee hee shock ayyaaraa...అందుకేగా మేం క్రికెట్ చూడ్డం మానేసాం..

    ReplyDelete