సినీ నటుడు అక్కినేని నాగార్జున కుమారుడు అఖిల్, ఫ్యాషన్ డిజైనర్ శ్రియాభూపాల్‌ల
నిశ్చితార్థం డిసెంబరు 9న జరగనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం నాగార్జున
ఈ వేడుకకు సినీ, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన పలువురు ప్రముఖులను
ఆహ్వానించే పనిలో ఉన్నారు. అయితే వీరి వివాహాన్ని విదేశంలో నిర్వహించాలని,
ఇటలీ అయితే బావుంటుందని కుటుంబ సభ్యులు అనుకుంటున్నట్లు సమాచారం.
ఘనంగా జరగనున్న ఈ వివాహ వేడుకకు ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 600
మంది అతిథులను ఆహ్వానిస్తున్నట్లు తెలుస్తోంది. నాగచైతన్య, సమంతల
వివాహం వచ్చే ఏడాది జరగనున్నట్లు నాగార్జున ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అఖిల్
‘అఖిల్’ చిత్రం తర్వాత విక్రమ్‌కుమార్ దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో
నటించనున్నారు.
No comments:
Post a Comment