బాలీవుడ్ తారలపై పుకార్లు అనేవి సర్వసాధారణం. ఎంత ఎక్కువ స్థాయిలో పుకార్లు వినిపిస్తే అంత పాపులారిటీ వస్తుందనేది అక్కడి తారలు నమ్మే సిద్ధాంతం. అయితే తాను అందుకు పూర్తిగా వ్యతిరేకమని చెబుతోంది కృతిసనన్. వివరాల్లోకి వెళితే...హీరో పంటి చిత్రంతో బాలీవుడ్ బాటపట్టిన కృతిసనన్ ప్రస్తుతం దినేష్ విజన్ రూపొందిస్తున్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్ రబ్తాలో నటిస్తోంది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ హీరోగా నటిస్తున్నాడు.

ఇటీవల తన ప్రేయసి అంకిత లోఖండేతో విడిపోవడంతో ఈ సినిమా చిత్రీకరణ సమయం నుంచి కృతిసనన్, సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్‌ల మధ్య ప్రేమాయణం మొదలైందని, ప్రస్తుతం వీరిద్దరు డేటింగ్‌లో వున్నారని బాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ సందర్భంగా కృతిసనన్ మాట్లాడుతూ ఇక చాలు. నాపై రూమర్‌లు ఆపండి. సహనటులతో సన్నిహితంగా వుంటే డేటింగ్‌లో వున్నామని అనవసరమైన కథనాల్ని సృష్టిస్తున్నారు. అ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదు. సుశాంత్, నేను మంచి స్నేహితులం అంతే. ఓ సినిమా కోసం సన్నిహితంగా మెలిగితే ఇద్దరి మధ్య ఏదో వుందని ప్రచారం మొదలుపెట్టడం విచారకరం. నేను ఎవరితోనూ డేటింగ్ చేయడం లేదు అని తెలిపింది. మహేష్‌బాబు నటించిన వన్ నేనొక్కడినే చిత్రంతో కృతిసనన్ తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన విషయం తెలిసిందే.

No comments:
Post a Comment