ఫిలిం ఇండస్ట్రీలో వారసుల హవా బాగా కనిపిస్తోంది. ముఖ్యంగా గ్లామర్
ఇండస్ట్రీ కావటంతో ఈ రంగంలోని వారందరూ తమ వారసులను సినిమాల్లోనే నటించేలా
ప్రోత్సహిస్తుంటారు. అయితే ఇప్పుడు ఇతర రంగాల వారు కూడా సినీ రంగం మీద
దృష్టి పెడుతున్నారు. రాజకీయ, వ్యాపార రంగాల నుంచి చాలా మంది సినీ రంగంలోకి
అడుగుపెడుతున్నారు. అదే బాటలో ఓ స్టార్ క్రికెటర్ కొడుకు టాలీవుడ్
ఎంట్రీకి రెడీ అవుతున్నాడు.
ప్రముఖ క్రికెటర్, ఇండియన్ క్రికెట్ టీం మాజీ కెప్టెన్ అజారుద్దీన్ కొడుకు
అబ్బాస్(అసదుద్దీన్) త్వరలోనే హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడు. తెలుగులో 'నాకు
ఓ లవ్వరుంది', 'దక్షిణ మధ్య భారత జట్టు' సినిమాలకు నిర్మాతగా వ్యవహరించిన
కె సురేష్ బాబు ఈ సినిమాతో దర్శకుడిగా మారుతున్నాడు. ప్రస్తుతం చర్చల దశలో
ఉన్న ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని భారీగా నిర్వహించడానికి
ఏర్పాట్లు చేస్తున్నారు.
No comments:
Post a Comment