Tuesday, April 12, 2016

నాలుగున్నర గంటలపాటు కళ్లార్పకుండా 24 విన్నా - సూర్య

 ‘‘ ‘24’ నా కెరీర్‌లో ముఖ్యమైన సినిమా. ‘మనం’ సమయంలోనే ఈ  సినిమా చేసే అవకాశం వచ్చింది. అప్పుడే దర్శకుడు విక్రమ్‌కుమార్  ‘24’ కథ వినిపించారు. నాలుగున్నర గంటలపాటు కళ్లార్పకుండా ఆయన చెప్పిన కథే విన్నాను. ఈ కథ ఎంతగా నచ్చిందంటే వెంటనే నిర్మాతగా మారడానికి నిర్ణయించుకున్నా. వెంటనే సంగీత దర్శకుడు ఏ.ఆర్.రె హ్మాన్ తలుపు తట్టాం. ఇంతకాలం ఎందుకు గ్యాప్ వచ్చిందనే ప్రశ్నకుఈ చిత్రం ఓ సమాధానం అవుతుంది’’ అని హీరో సూర్య అన్నారు. ‘ఇష్క్’, మనం’ చిత్రాల ఫేమ్ విక్రమ్‌కుమార్ దర్శకత్వంలో సూర్య మూడు విభిన్నమైన పాత్రల్లో నటించిన చిత్రం - ‘24’.
గ్లోబల్ సినిమాస్, 2డి ఎంటర్‌టైన్ మెంట్స్, శ్రేష్ఠ్ మూవీస్ సంయుక్త నిర్మాణంలో జ్ఞానవేల్ రాజా సమర్పణలో ఈ చిత్రం రూపొందింది. సమంత, నిత్యామీనన్ కథానాయికలు. ఏ.ఆర్.రెహ్మాన్ స్వరాలందించిన ఈ చిత్రం పాటల వేడుక హైదరాబాద్‌లో జరిగింది. పాటలను హీరో కార్తీ విడుదల చేశారు.  ఏఆర్. రెహ్మాన్ మాట్లాడుతూ- ‘‘ఈ సినిమా అవకాశం ఇచ్చినం దుకు సూర్య, విక్రమ్‌కుమార్‌లకు చాలా థ్యాంక్స్,  మా అబ్బాయి అమీన్ మొదట ‘ఓకే బంగారం’లో అరబిక్ పాట పాడాడు. మళ్లీ రెండో సారి ‘నిర్మలా కాన్వెంట్’లో ‘కొత్త కొత్త భాష’ పాట పాడాడు.

మీ ఆశీస్సులు అతనికి ఎప్పుడూ ఉండాలి. ఈ సినిమా పెద్ద హిట్ కావాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నా’’ అని అన్నారు. ‘‘ఈ సినిమా కథ చెప్పినప్పుడు అసలు దీన్ని తెరకెక్కించడం సాధ్యమా అని అనిపించింది. కానీ మాకు చెప్పిన దాని కన్నా బాగా విక్రమ్ ఈ సినిమా తీశారు’’ అని సమంత అన్నారు. ఈ వేడుకలో హీరోలు కార్తీ, అఖిల్, నిర్మాత సుధాకర్‌రెడ్డి, పాటల రచయిత చంద్రబోస్, నటుడు అజయ్ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment