Monday, January 11, 2016

ఊరి కోసం వెబ్‌సైట్‌

గ్రామానికి ప్రపంచవ్యాప్త గుర్తింపుతెచ్చిన యువకుడు

            పుట్టిన ఊరుకు ఎదో చేయాలనే తపన. ప్రభుత్వ ఉద్యోగం లేకపోయినా స్వయం కృషితో చిన్నషాపు నడుపుకుంటూ కుటుంబా న్ని వెల్లదీస్తున్న ఓ యువకుడు. గ్రామం కోసం రూ.20 వేల వరకు ఖర్చుపెట్టి ఏకంగా ఒక వెబ్‌సైట్‌ను కొనుగోలు చేశాడు. అందులో గ్రామచరిత్రను పెట్టాడు. ఇప్పుడు ఆ గ్రామం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. స్వార్థంతో ఆలోచించే ఈ రోజుల్లో తన సంపాద లోంచి ఖర్చు చేయడం పట్ల పలువురు అభినం దిస్తున్నారు. అతనే కొల్చారం మండలం చిన్నఘనపూర్‌ గ్రామానికి చెందిన శ్రీను. చిన్నఘనపూర్‌ ఈ పేరు ఇప్పుడు నెట్‌లో హల్‌ చల్‌ చేస్తోంది. కొల్చారం మండలంలోని ఈ గ్రామానికి ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. వందేం డ్లకు పైగా ఘన చరిత్ర కలిగిన, జిల్లాలో ఏకైక మధ్యతరహా, సాగునీటి ప్రాజెక్టు అయిన ఘన పూర్‌ ఆనకట్ట ఈ గ్రామ పరిధిలోనే ఉండ టం విశేషం. దీనిద్వారా సాగునీటి రంగంలో గ్రామానికి రాష్ట్ర వ్యాప్త గుర్తింపు ఉంది. ప్రస్తుతం మరో ప్రత్యేకతను సంతరించుకుని ఊరి పేరు ప్రపంచ వ్యాప్తమైంది.


             గ్రామానికి చెందిన గిరిగళ్ల శ్రీనివాస్‌గౌడ్‌ అనే యువకుడు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ. చిన్నఘనపూర్‌. కామ్‌ పేరిట ప్రత్యేకంగా ఓ వెబ్‌ సైట్‌ రూపొందించాడు. గూగుల్‌ కంపెనీ నుంచి స్పేస్‌ కొను గోలు చేసి సుమారు ఆరు నెలల పాటు శ్రమించి వెబ్‌సైట్‌ను రూపకల్పన చేశాడు. ఇదే గ్రామానికి చెందిన కంప్యూటర్‌ నిపుణు డు గణేష్‌ చిన్నఘనపూర్‌ వెబ్‌ పేజీని శాసన సభ్యుడు చిలుముల మదన్‌రెడ్డి మంగళ వారం ఈ వెబ్‌సైట్‌ను ప్రారంభించారు.
సమగ్ర సమాచారం            ఈ వెబ్‌సైట్‌లో గ్రామ సమగ్ర సమాచారాన్ని అందరికి సులభంగా అర్థమయ్యేలా తెలుగు భాషలో పొందుపరిచాడు. గ్రామ భౌగోళిక స్వరూపం, చరిత్ర, చారిత్రక నేపథ్యం, జనాభా, ఆలయాలు, విద్యాలయాలు, వ్యవసాయ, రాజ కీయ, పర్యాటక రంగాల వివరాలు ప్రజాప్రతిని ధుల పేర్లు, యువజన సంఘాల సేవ కార్యక్రమాలు, తదిత ర సమా చారం ఉంచారు.
చిత్రమాలిక         వెబ్‌సైట్‌లో సమాచారంతో పాటు ప్రత్యేకంగా ఫొటో, వీడియో గ్యాల రీ ఏర్పాటు చేశారు. ఇం దులో గ్రామంలోని ఆలయాలు, పాఠ శాలలు, నాయకులు విగ్రహాలు, ప్రధానంగా ఘన పూర్‌ ఆనకట్ట దృశ్యాలతో పాటు వివిధ పండ గలు, ఉత్సవాల సందర్భంగా గ్రామంలో జరిగే కార్య క్రమాల, అభివృద్ధి పనుల శంకుస్థాపన, ప్రారంభోత్సవాల చిత్రాలు ఉంచారు. ఆయా కార్యక్రమాలకు సంబంధించిన వీడియోలతో గ్యాలరీ ఏర్పాటు చేశారు.
విద్యా,ఉద్యోగ ఖాళీల వివరాలు            గ్రామ సమాచారంతో పాటు విద్యార్థు లకు, ఉద్యోగార్థులకు ఉపకరించేలా విద్యా, ఉద్యోగ సమాచారాన్ని సైతం ఇందులో పొందు పర్చాడు. ఉన్నత విద్యా భ్యాసానికి సంబంధించిన సమాచా రం. వివిధ ఉద్యోగాల భర్తీకి ప్రభు త్వం జారీచేస్తున్న ప్రకట నల గురించి ఇట్టే తెలుసుకోవచ్చు.
ఎప్పటికప్పుడు : శ్రీనివాస్‌గౌడ్‌
             నేటి ఆధునిక కాలంలో అంతా ఆన్‌లైన్‌ విధా నం. ఈ నేపథ్యంలోనే ఘన చరిత్ర ఉన్న మా చిన్నఘనపూర్‌ గ్రామ సమాచారాన్ని ఆన్‌లైన్‌లో అందరికి అందుబాటులో ఉంచేందుకు వెబ్‌సైట్‌ రూపొం దించాను. గ్రామానికి చెందిన విద్యావంతులు, ప్రజాప్రతిని ధులు, రాజకీయ నాయకులు, యు వకులు, సీనియర్‌ సిటిజన్‌ల సహకారంతో వీలైనంత వరకు గ్రామసమగ్ర సమాచారం సేక రించి పొందుపరిచాను. తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఆప్‌డేట్‌ చేస్తా.

No comments:

Post a Comment