Wednesday, December 30, 2015

'మామ మంచు అల్లుడు కంచు' మూవీ రివ్యూ

            చాలా రోజులుగా సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న అల్లరి నరేష్ హీరోగా, సీనియర్ హీరో మోహన్ బాబు మరో లీడ్ రోల్ లో తెరకెక్కించిన అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్ టైనర్ మామ మంచు అల్లుడు కంచు. మరాఠిలో ఘనవిజయం సాధించిన సినిమాకు తెలుగు రీమేక్ గా రూపొందిన ఈ చిత్రానికి శ్రీనివాస్ రెడ్డి దర్శకుడు.
             అల్లరి నరేష్ 50వ సినిమాగా, మోహన్ బాబు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన 40 ఏళ్లు పూర్తి చేసుకున్న తరువాత విడుదలైన సినిమాగా భారీ హైప్ క్రియేట్ చేసిన మామ మంచు అల్లుడు కంచు. రిలీజ్ తరువాత ఆ అంచనాలను అందుకుందా..? హిట్ కోసం ఎదురుచూస్తున్న అల్లరి నరేష్ సక్సెస్ సాధించాడా,? చాలా కాలం తరువాత కామెడీ పాత్రలో నటించిన మోహన్ బాబు ఈ జనరేషన్ ను తన టైమింగ్ తో మెప్పించాడా..? వివరాల్లోకి వెళితే...
కథ :          భక్తవత్సలం నాయుడు( మోహన్ బాబు) అనుకోని పరిస్థితుల్లో రెండు పెళ్ళిలు చేసుకొని పాతికేళ్లుగా ఒకరి తెలియకుండా ఒకరిని మెయిన్ టెయిన్ చేయడానికి కష్టపడిపోతుంటాడు. అతని స్నేహితుడు ఇస్మాయిల్ (అలీ) ఈ కష్టాల్లో నాయుడుగారికి సాయం చేస్తుంటాడు. భక్తవత్సలం నాయుడు మొదటి భార్య సూర్యకాంతం (మీనా) కి ఒక కూతురు శృతి(పూర్ణ), రెండో భార్య ప్రియంవద(రమ్యకృష్ణ)కు ఓ కొడుకు గౌతమ్ నాయుడు(వరుణ్ సందేశ్). ఇలా కష్టాల్లో సాగుతున్న భక్తవత్సలం నాయుడుకి పిల్లలు పెళ్లీడుకి రావటంతో కొత్త కష్టాలు మొదలవుతాయి. శృతి, గౌతమ్ ల పుట్టిన రోజులు కూడా ఒకే రోజు కావటంతో సినిమా అసలు కథలోకి ఎంటర్ అవుతుంది.
         ఇద్దరు పిల్లలకు పుట్టినరోజు కానుకలు ఇచ్చే క్రమంలో అడ్రస్ లు మారిపోవటంతో శృతి గిఫ్ట్, గౌతమ్ కు, గౌతమ్ గిఫ్ట్ శృతికి వెళుతుంది. గిఫ్ట్ మార్చుకోవటం కోసం శృతి, గౌతమ్ లు కలుసుకోవాలనుకుంటారు. అలా కలిస్తే తన నాటకం బయటపడుతుందని భావించిన నాయుడు వారు కలవకుండా ఉండేదుకు గౌతమ్ గిఫ్ట్ దొంగతనం చేసి దాన్ని బాలరాజు (అల్లరి నరేష్) తో శృతి దగ్గరకు పంపిస్తాడు. ఎలాగైనా గౌతమ్ అంటే శృతికి అసహ్యం కలిగేలా చేయమంటాడు.
           శృతిని చూసి మొదటి చూపులోనే ప్రేమలో పడ్డ బాలరాజు, తానే గౌతమ్ అని శృతిని ప్రేమలోకి దించుతాడు. అలా మరింత కష్టాల్లో ఇరుక్కున్న నాయుడు, బాలరాజు నుంచి తన కూతురిని కాపాడుకోవటానికి, తన ఇద్దరు భార్యల రహస్యం బయటపడకుండా ఉండటానికి ఎలాంటి ఎత్తులు వేశాడు. చివరకు ఆ విషయం ఎలా బయటపడింది. అనుకున్నట్టుగా బాలరాజు శృతి పెళ్లి చేసుకున్నాడా అన్నదే అసలు కథ.
నటీనటులు :
        
ఇండస్ట్రీకి వచ్చి 40 ఏళ్లు గడుస్తున్నా మోహన్ బాబు ఇప్పటికీ యంగ్ హీరోలతో పోటిపడి నటిస్తున్నారు. తన బాడీ లాంగ్వేజ్ కు తగ్గ క్యారెక్టర్ ను ఎంచుకున్న మోహన్ బాబు ఆ పాత్రకు వంద శాతం న్యాయం చేశారు. ముఖ్యంగా కామెడీ టైమింగ్ తో కడుపుబ్బా నవ్వించీ ఇప్పటికీ తనలో అదే ఫాం ఉందని మరోసారి ప్రూవ్ చేసుకున్నారు. ఇక తనకు బాగా అలవాటైన క్యారెక్టర్ లో అల్లరి నరేష్ మరోసారి మెప్పించాడు. కామెడీతో పాటు క్లైమాక్స్ లో వచ్చే ఎమోషనల్ సీన్స్ లో కూడా మంచి నటనతో ఆకట్టుకున్నాడు. చాలా రోజుల తరువాత ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ లో కనిపించిన అలీ అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడు. ఇక మీనా, రమ్యకృష్ణ, పూర్ణ, వరుణ్ సందేశ్, కృష్ణభగవాన్ లు తన పరిధి మేరకు మెప్పించారు.
 
          ముఖ్యంగా స్క్రీన్ ప్లే విషయంలో మంచి క్లారిటీ మెయిన్ టెయిన్ చేసిన శ్రీనివాస్ రెడ్డి, కన్ఫ్యూజింగ్ సీన్స్ లోనూ ఎక్కడ క్లారిటీ మిస్ అవ్వకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు. ఇటీవల కాలం వరుస సక్సెస్ లు సాధిస్తున్న మాటల రచయిత శ్రీధర్ సీపాన మరోసారి తన పెన్ను పవర్ చూపించాడు. కామెడీ పంచ్ లతో ఆకట్టుకున్నాడు. ఈ సినిమాలో ఆకట్టుకోలేకపోయిన ఒకే ఒక్క అంశం సంగీతం. ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్లు పనిచేసినా.. థియేటర్ నుంచి బయటికి వచ్చాక గుర్తుండే పాట ఒక్కటీ ఇవ్వలేకపోయారు. సినిమాటోగ్రఫి, ఎడిటింగ్ బాగున్నాయి.

No comments:

Post a Comment