Sunday, November 29, 2015

స్కూటర్‌ మీద చక్కర్లు కొట్టిన అమితాబ్‌ ...

 దాదాపు ఏడాది కిందట సైకిల్ తొక్కి హల్‌చల్‌ చేసిన బిగ్‌ బీ అమితాబ్ బచ్చన్ తాజాగా స్కూటర్‌ నడిపారు. చక్కగా హెల్మెట్ పెట్టుకొని, గళ్ల చొక్కా, ముదురు రంగు ప్యాంటు తొడుక్కొని ఆయన అలా కోల్‌కతా వీధుల్లో స్కూటర్‌పై సవారీ చేశారు. పశ్చిమ బెంగాల్ అధికార కేంద్రానికి చిరునామా అయిన రైటర్స్ బిల్డింగ్‌ వద్ద శనివారం ఈ దృశ్యం కనిపించింది. రిబూ దాస్‌గుప్తా రూపొందిస్తున్న తాజా చిత్రం 'టీఈ3ఎన్' (Te3N) సినిమా కోసం అమితాబ్ ఇలా స్కూటర్ ఎక్కారు.
           
గతంలో 'పీకూ' సినిమా కోసం అమితాబ్ సైకిల్ తొక్కి.. అభిమానులను అలరించిన సంగతి తెలిసిందే. 'పీకూ'లో దీపికా పదుకొణే తండ్రిగా నటించిన అమితాబ్ తాజాగా రిబూ దాస్‌గుప్తా సినిమాలో విభిన్న పాత్రతో అలరించడానికి సిద్ధమవుతున్నారు. విఖ్యాత సినీ దిగ్గజం సుజయ్‌ ఘోష్‌ నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటులు నవాజుద్దీన్ సిద్దిఖీ, విద్యాబాలన్ కూడా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కోసం అమితాబ్ శ్రద్ధగా దర్శకుడి సూచనలు వినడం.. కొన్ని సెకండ్లపాటు కోల్‌కతా వీధుల్లో స్కూటర్ నడుపడం.. అక్కడ పెద్ద ఎత్తున గుమిగూడిన ఆయన అభిమానులు, ప్రజలకు ఎంతో సంతోషం కలిగించింది.

No comments:

Post a Comment