Saturday, November 28, 2015

పిలవని పేరంటానికి వెళ్తే...కొట్టి చంపారు ..!

పెండ్లి జరిగితే బంధువులే కాదు...ఆకలి బాధలో ఉన్నవారు కూడా ఆ సందడిలో హాజరవుతారు. ఓ వేళ అలా వచ్చిన వారిని బయటకు పంపటమో..లేకపోతే పోనీలే అని ఊరుకుంటాము. అది మానవత్వం..కానీ పంజాబ్‌లో ఓ దళితుడు పిలవని పెండ్లికి హాజరయ్యాడు. అతన్ని గుర్తించి తీవ్రంగా కొట్టి చంపేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. పంజాబ్‌లోని సంగ్రూర్‌ జిల్లా గాగా గ్రామంలో భారీఏర్పాట్లతో పెండ్లి వైభవంగా జరుగుతున్నది. అది చూసి ముచ్చటపడ్డ జర్నేల్‌సింగ్‌ లోనికి వెళ్లాడు. తమ బంధువుల్లోని వ్యక్తి కాదని పెండ్లివారు గుర్తించారు. అతన్ని బయటకు పంపకుండా తీవ్రంగా కొట్టారు. పిడిగుద్దులు కురిపించారు. ఈ దారుణం జరుగుతున్నప్పుడు స్కూలు నుంచి తిరిగి వస్తున్న జర్నేల్‌ సింగ్‌ తనయుడు గురుదీప్‌ సింగ్‌ చూశాడు. తీవ్రగాయాలతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న తండ్రిని చూసి కన్నీరుమున్నీరైన కొడుకు సమీపంలో ఉన్న బంధువులను పిలిచి ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశాడు. కానీ, మార్గమధ్యంలోనే జర్నేల్‌ సింగ్‌ మృతిచెందాడు. ఈ ఘటనలో ఇద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

No comments:

Post a Comment