Sunday, November 22, 2015

టీమ్‌ ఇండియాలో చోటుపై ఆశ ఇంకా ఉంది ...

 జట్టులో చోటు కోల్పోయిన ఆల్‌ రౌండర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ టీమ్‌ ఇండియాకు ఆడాలనే కోరిక ఇంకా అలాగే ఉందని తెలిపాడు. ఫామ్‌ కోల్పోవడంతో పాటు గాయాల బారిన పడి మూడేళ్ల క్రితం జట్టులో స్థానం కోల్పోయిన ఇర్ఫాన్‌ భారత జట్టు తరఫున ఆడాలనే ఆశ, కోరిక ఇంకా అలాగే ఉన్నాయని, సెలెక్టర్ల నుంచి పిలుపొస్తుందని ఎదురుచూస్తున్నట్లు తెలి పాడు. ఇటీవల రంజీ మ్యాచుల్లో 12 వికెట్లు పడగొట్టడంతో పాటు బ్యాటిం గ్‌లో 90 పరుగులు చేసి రాణించమే దీనికి శుభసూచకమన్నాడీ ఈ బరోడా ఆల్‌రైండర్‌. ఇర్ఫాన్‌ ప్రస్తుతం తాను పూర్తి ఫిట్‌నెస్‌తో ఉన్నట్లు చెప్పాడు. 'ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌ ఆడే ప్రతి క్రికెటర్‌కు భారత్‌ తరఫున ఆడాలని ఉంటుంది. నాక్కూడా టీమ్‌ ఇండియా తరఫున ఆడాలనే కోరిక ఇంకా అలాగే ఉంది. ప్రసు తం ఆటకు మాత్రమే ప్రాధాన్యమిస్తూ నైపుణ్యం పెంచుకోవడానికి ప్రాధాన్యమి స్తున్నాను. సెలెక్టర్లు గుర్తిస్తారనే నమ్మకముంది' అని ఆశాభావం వ్యక్తం చేశాడు.  2003లో భారత్‌ తరఫున ఆరంగేట్రం చేసిన ఇర్ఫాన్‌ 29 టెస్టుల్లో 100 వికెట్లు పడగొట్టడంతో పాటు 1105 పరుగులు చేశాడు. 120 వన్డేల్లో 173 వికెట్లతో తీసి 1544 పరుగులు సాధించిన ఇర్ఫాన్‌ 2012 ఆగస్టులో చివరి వన్డే ఆడాడు.

No comments:

Post a Comment