Monday, November 16, 2015

ఆంధ్రప్రదేశ్‌లో వర్ష బీభత్సం





బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తమిళనాడు, చెన్నై సహా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. తమిళనాడు ప్రభుత్వం 16 జిల్లాల్లో అన్ని విద్యాలయాలకు సెలవులు ప్రకటించింది. అలాగే ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, అనంతపురం జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. చిత్తూరు జిల్లాలో అన్ని ప్రాంతాల్లో ఆదివారం అర్దరాత్రి నుంచి కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జిల్లాలోని అన్ని విద్యా సంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. తిరుమలలోనూ కుండపోత వర్షంలో ప్రజలు తీవ్ర ాబ్బందులు పడుతున్నారు. జిల్లాలో మూడు చెరువులకు గండ్లు పడ్డాయి.
                  తిరుమల, నెల్లూరులో ఆదివారం నుంచి ఎడతతెరిపిలేని వర్షం కురుస్తోంది. పలు జిల్లాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. నెల్లూరు జిల్లాలో అత్యధికంగా వెంకటగిరిలో 24 సెంటీమీటర్లు వర్షపాతం నమోదైంది. బాలాయపల్లిలో 14, డక్కిలిలో 10 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అలాగే ప్రకాశంలో పలు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

No comments:

Post a Comment