సినీ నటుడు
మహేష్‌బాబు పాలమూరు జిల్లాలోని ఏ గ్రామాన్ని దత్తత తీసుకుంటారు అనే విషయంపై
ఉత్కంఠ నెలకొన్న విషయం విదితమే. ఇక ఆ ఉత్కంఠకు మహేష్‌బాబు ఎట్టకేలకు
తెరదించారు. మంత్రి కేటీఆర్, మహేష్‌బాబు జరిపిన సుదీర్ఘ సమాలోచనల అనంతరం
కొత్తూరు మండలంలోని సిద్ధాపురం గ్రామాన్ని ఆయన దత్తత తీసుకున్నారు.
సిద్ధాపురం గ్రామాభివృద్ధిలో క్రియాశీలక పాత్ర పోషిస్తానని మహేష్‌బాబు
పేర్కొన్నారు. రాబోయే కాలంలో నిర్మాణాత్మకంగా, అర్థవంతంగా ముందుకెళ్లాలని మహేష్‌బాబు అన్నారు. ప్రభుత్వ సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి చేయనున్నారు మహేష్బాబుఅన్నారు. మహేష్బాబుసిద్ధాపురం గ్రామాన్ని దత్తత తీసుకోవడంతో ఆ గ్రామ ప్రజలు ఆనందం
వ్యక్తం చేస్తున్నారు. మహేష్‌కు కృతజ్ఞతలు చెప్పారు.
No comments:
Post a Comment