Thursday, March 3, 2011

ఇలాగైతే కప్‌ గోవిందా !

 ఇలా అడితే కప్‌ గోవిందా ! ఇంగ్లాండ్‌ జట్టు మొదటి మ్యాచ్‌ నుంచి కష్టాలతో ప్రారంభంమైయింది. మొదటి మ్యాచ్‌ నెదర్లాండ్‌పై చాలా కష్టపడి గెలిచింది. ఇంకా రెండో మ్యాచ్‌ భారత్‌తో ' టై ' అయ్యింది. ఇరు జట్టు పరుగుల వరద కురిపించారు. ఇంకా మూడో మ్యాచ్‌ ఐర్లాండ్‌ , ఇంగ్లాండ్‌ మధ్య జరిగిన మధ్య జరిగిన మ్యాచ్‌లో ఐర్లాండ్‌ ఇంకా ఐదు బంతులు మిగిలివుండగానే విజయం సాధించింది. ఇంగ్లాండ్‌ జట్టు ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌లో 300 పైగా పరుగులు చేసింది. ప్రతర్థి జట్టు దీటుగా సమాధానం చేసింది. ఇంగ్లాండ్‌కు ఇంకా మూడు మ్యాచ్‌లు మిగిలివున్నాయి. వీటిలో తప్పని సరిగా రెండు మ్యాచ్‌లు గెలిచితీరాలి. లేకపోతే కప్‌ గోవిందా !
చిన్నజట్టేనని చిన్నచూపు చూస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఐర్లాండ్‌ జట్టు ఇంగ్లాండ్‌పై ఘన విజయం సాధించింది. 328 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఐర్లాండ్‌ ఇంకా ఐదు పరుగులు మిగిలివుండగానే ఐర్లాండ్‌ ప్రపంచకప్‌లో బోణీ కొట్టింది. కె విన్‌ఒబ్రెయిన్‌ అద్భుత సెంచరీతో ఐర్లాండ్‌ చిరస్మరణీయ విజయం సాధించి క్రికెట్‌ చరిత్రను తిరగరాసింది. అంతకముందు టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌ నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 327 పరుగులు చేసింది. పీటర్సన్‌ 59, ట్రాట్‌ 92, బెల్‌ 81 పరుగులు చేశారు. గత వరల్డ్‌కప్‌ పాక్‌ను కంగుతినింపిచిన ఐర్లాండ్‌ ఈ సారి ఇంగ్లాండ్‌ భరతం పట్టింది.

No comments:

Post a Comment