జనవరి 12న 'మిరపకాయ్'
రవితేజ, రిచా గంగోపాధ్యాయ, దీక్ష హీరోయిన్లుగా నటిస్తోన్న 'మిరపకాయ్' జనవరి 12న రానుంది. ఈ విషయాన్ని నిర్మాత రమేష్ పుప్పాల తెలియజేశారు. ఎల్లో ఫ్లవర్స్ బ్యానర్‌పై హరీష్‌శంకర్.ఎస్ దర్శకత్వం వహిస్తున్నారు. నిర్మాత మాట్లాడుతూ...'ఆద్యంతం వినోదాత్మకంగా సాగుతుంది. థమన్ సంగీత సారథ్యంలో రూపొందిన ఆడియో హిట్ అయింది. కిక్ తర్వాత రవితేజ కాంబినేషన్లో వస్తున్న పాటలవి. మా బ్యానర్లో ఎంతో రిచ్‌గా తీశాం. సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకులముందుకు వస్తోంది' అని తెలిపారు. దర్శకుడు మాట్లాడుతూ...'రవితేజ బాడీ లాంగ్వేజ్‌కు సరిపడే స్టోరీ. సీనియర్ నటీనటులు పాత్రలకు న్యాయం చేశారు. సంగీతం చిత్రానికి హైలైట్‌గా నిలుస్తుంది' అని చెప్పారు.
No comments:
Post a Comment